MAT
-
హైటెక్ డాన్స్‌మ్యాట్! ఈజీగా నేర్చుకోవచ్చు!
కింద ఒక చాపలాంటిది పరచుకుని చిన్నారి డాన్స్ చేస్తోంది. చూశారు కదా! ఇది మామూలు చాప కాదు. ఇది హైటెక్ డాన్స్‌మ్యాట్. ఇందులో రిథమ్ సెట్ చేసుకుంటే, రిథమ్‌కు అనుగుణంగా ఈ చాప మీద లైట్లు వెలుగుతాయి. వెలిగే లైట్ల మీద అడుగులు వేస్తుండటమే! చిన్నారులు డాన్స్ నేర్చుకోవడానికి, ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ హైటెక్ డాన్స్‌మ్యాట్ ఎంతో అనువుగా ఉంటుంది. అమెరికన్ కంపెనీ ఫావో ష్వార్జ్ దీనిని ‘డాన్స్ మిక్సర్ రిథమ్ స్టెప్ ప్లేమేట్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది రెండు మోడ్స్‌లో పనిచేస్తుంది. ‘కీప్ ద బీట్’, ‘ఫ్రీస్టైల్’ మోడ్స్‌లో కోరుకున్న మోడ్ ఎంపిక చేసుకుని, దీని మీద తకిట తధిమి అంటూ ఇంచక్కా గంతులేయవచ్చు. మూడేళ్ల వయసు పైబడిన పిల్లలకు ఇది చక్కని ఆటవస్తువు. దీని ధర 30 డాలర్లు (రూ.2,497) మాత్రమే! (చదవండి: పిల్లలు బాణాసంచా కాల్చేటప్పడూ జరభద్రం..ఈ జాగ్రత్తలు తప్పనసరి..) -
హోమ్ క్రియేషన్స్; చీరంచు టేబుల్.. లుక్ అదుర్స్
రాబోయే రోజులన్నీ రీ సైక్లింగ్ డేసే. ఉన్నవాటిని పొదుపుగానే కాదు కళాత్మకంగా వాడుకునే నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాలని గతానుభవాలు కళ్లకు కడుతున్నాయి. వాటిలో ఇంటిని శారీ‘కళ’తో ఇంపుగా తీర్చిదిద్దడం ప్రస్తుత ట్రెండ్. అది ఎలా శోభిల్లుతుందో చూద్దాం.. వాల్ డెకర్ ఎంబ్రాయిడరీ చేసే ఫ్రేమ్స్ మార్కెట్లో లభిస్తాయి. వీటికి మీ పాత చీరలను డిజైన్లను బట్టి ఎంచుకొని, వాటిపై ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్‌ను కావల్సిన విధంగా కట్ చేసుకొని, ప్యాచ్ వర్క్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాబ్రిక్ ఎంబ్రాయిడరీ ఫ్రేమ్స్ మీ ఇంటి వాల్‌ను ప్రత్యేకంగా మార్చేస్తాయి. ఎవరి అభిరుచిని బట్టి వారు ఫ్యాబ్రిక్ డిజైన్, కలర్ కాంబినేషన్స్ ఎంచుకోవచ్చు. టేబుల్ మ్యాట్ ఉడెన్ లేదా గ్లాస్ టేబుళ్లు బోసిగా ఉంటే వాటిని చీర అంచులతో మెరిపించవచ్చు. సగం శారీని టేబుల్ కవర్గానూ, మిగతా భాగాన్ని ప్లేట్స్ పెట్టుకునే మ్యాట్స్గానూ డిజైన్ చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ మాత్రమే కాదు సెంటర్ టేబుల్, సైడ్ టేబుల్ సోఫా కవర్గానూ జరీ అంచు చీరను అందంగా మలచవచ్చు. ఆ కళను కళ్లారా చూసుకోవచ్చు. ఇంటికి వచ్చిన అతిథుల మన్ననలూ పొందవచ్చు. కాటన్ ఇక్కత్ల కళ టేబుల్ మ్యాట్స్‌లో విశేషంగా ఆకట్టుకుంటున్న డిజైన్స్ ఇక్కత్ కాటన్ శారీతో రూపొందినవి. గ్లాస్ హోల్డర్స్, బౌల్ మ్యాట్స్గానూ తమకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకునే అవకాశాన్ని కలిగిస్తుంది చక్కటి ఈ ఫ్యాబ్రిక్. కిటికీ తెరలు పాత జరీ అంచు చీరలు ఉంటే, వాటిని ఎవరికి ఇవ్వాలా అని ఆలోచించనక్కర్లేదు. చిన్నపాటి మార్పులతో విండోస్‌కి కర్టెన్స్‌గా వాడుకోవచ్చు. శారీ కొనుగోలు చేసిన సందర్భం లేక ఎవరైనా కానుకగా ఇచ్చుంటే ఆ జ్ఞాపకాలను గాలితో పాటు మోసుకొచ్చి మీ మనసును తడతాయి తెరలు తెరలుగా. కుషన్ కవర్ మార్కెట్లో లభించే కవర్స్తోనే కుషన్స్‌ని అలంకరించాలని రూలేం లేదు. ఇప్పుడు జరీ చీరల కవర్లు కుషన్స్‌ని మరింత కళగా మార్చేస్తున్నాయి. వీటి మోతాదు ఎంత ఎక్కువ ఉంటే ఇంట్లో ఆ కళాత్మకత అంతగా పెరుగుతందనేది నేటి హోమ్ డెకర్ లవర్స్ మాట. -
ఇంగ్లండ్ జట్టు హెడ్ కోచ్‌గా మాథ్యూ మాట్..
ఇంగ్లండ్ వైట్ బాల్ జట్టు హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ మాట్ ఎంపికయ్యాడు. మాట్ నాలుగేళ్లు ఇంగ్లండ్ కోచ్‌గా పనిచేయనున్నాడు. ఇక ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్ జట్టు నెదర్లాండ్స్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ నుంచే మాట్ కోచ్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. కాగా మాట్ గత ఏడేళ్లుగా ఆస్ట్రేలియా మహిళల జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. మాట్ కోచ్‌గా ఉన్న కాలంలోనే ఆస్టేలియా జట్టు వన్డే ప్రపంచకప్, రెండు టీ20 ప్రపంచకప్‌లు కైవసం చేసుకుంది. "ఇంగ్లండ్ జట్టుకు ప్రధాన కోచ్‌గా మాథ్యూ మాట్ను నియమించడం మాకు సంతోషంగా ఉంది. అతడు ఈ బాధ్యతలు చెపట్టేందుకు అంగీకరించడం మా అదృష్టం" అని ఇంగ్లండ్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ పేర్కొన్నారు. ఇక ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్ కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్ ఎంపికైన సంగతి తెలిసిందే. చదవండి: Brendon McCullum: ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచ్‌గా బ్రెండన్ మెక్ కల్లమ్.. -
ఇంటిప్స్
కార్పెట్లను వాడని రోజుల్లో మడతపెట్టి లోపల పెట్టకూడదు. చాప చుట్టినట్లు రోల్ చేయాలి. మడతపెడితే ఆ మడతలు అలాగే నిలిచిపోతాయి. మళ్లీ పరిచినప్పుడు చక్కగా పరుచుకోకుండా... ఆ మడతల దగ్గర కార్పెట్ పైకి లేస్తుంది. కార్పెట్‌ను వ్యాక్యూమ్ క్లీనర్‌తో క్లీన్ చేసేటప్పుడు ఒకటే వైపుకి స్ట్రోక్స్ ఇవ్వాలి. అప్పుడే ఫర్ అంతా ఒకే దిశలో ఉండి డిజైన్ చక్కగా కనిపిస్తుంది. వాక్యూమ్ క్లీనర్‌ని ఎటుపడితే అటు దిశమారుస్తూ క్లీన్ చేస్తే డిజైన్ షేప్ అవుట్ అవుతుంది. నీటిలో ఉతికి ఆరిన తర్వాత పరిచేటప్పుడు ఫర్ని పొడి బ్రష్‌తో స్మూత్‌గా రుద్దాలి. -
పెండింగ్ ‘మ్యాట్’ కేసులపై కేంద్రం వెనక్కు!
న్యూఢిల్లీ: కనీస ప్రత్యామ్నాయ పన్నులు (మ్యాట్) కట్టాలని నోటీసులందుకున్న ఎఫ్ఐఐల కేసుల జోలికి ప్రస్తుతానికి వెళ్లొద్దని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీ టీ) తమ క్షేత్ర స్థాయి అధికారులను ఆదేశించింది. ఏప్రిల్ 1కి పూర్వం కేసుల విషయంలో రికవరీలు ఆపేయాలని ఒక సర్క్యులర్‌లో సూచించింది. మ్యాట్ నిబంధనలపై ఆదాయ పన్ను చట్టాలకు తగు సవరణలు చేయనున్నట్లు సీబీడీటీ పేర్కొంది. ఏపీ షా కమిటీ సిఫార్సుల మేరకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లపై (ఎఫ్ఐఐ) మ్యాట్ విధించొద్దంటూ కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో సీబీడీటీ ఈ ఆదేశాలు జారీ చేసింది. -
‘మ్యాట్’ వివాదానికి... విదేశీ ఇన్వెస్టర్లే కారణం
‘పాత పన్నుల’ వివాదాలపై షా కమిటీ దృష్టి... * కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లపై (ఎఫ్ఐఐ) కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) విధింపునకు సంబంధించి కీలకమైన పాత కేసులన్నింటినీ జస్టిస్ షా కమిటీ పరిశీలిస్తుందని జైట్లీ తెలిపారు. ఇదే అంశంపై పరస్పరం భిన్నమైన తీర్పులు రావడం వల్ల వివాదం ఏర్పడిందని పేర్కొన్నారు. 2012లో అథారిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ రూలింగ్స్‌ను (ఏఏఆర్) ఆశ్రయించడం ద్వారా విదేశీ ఇన్వెస్టర్లు స్వయంగా మ్యాట్ సమస్యను తెచ్చిపెట్టుకున్నారని జైట్లీ వ్యాఖ్యానించారు. ఇది ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున తమ ప్రభుత్వం భవిష్యత్‌లో మినహాయింపులు ఇవ్వడం తప్ప...పాత కేసుల విషయంలో చేయగలిగిందేమీ లేదని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో కార్యాలయాలు లేని విదేశీ కంపెనీలకు మ్యాట్ వర్తించదంటూ 2010లో ఉత్తర్వులిచ్చిన ఏఏఆర్.. ఆ తర్వాత 2012లో క్యాజిల్‌టన్ సంస్థ తమ మారిషస్ విభాగం నుంచి సింగపూర్ విభాగానికి షేర్లను బదలాయించినప్పుడు నమోదైన లాభాలపై మ్యాట్ కట్టాలంటూ ఆదేశాలిచ్చింది. ఇలాంటి భిన్నమైన ఉత్తర్వుల వల్ల తలెత్తిన పరిస్థితులు, కీలకమైన పాత పన్నుల వివాదాలను నిష్పక్షపాతంగా అధ్యయనం చేసేందుకే షా కమిటీని ఏర్పాటు చేసినట్లు జైట్లీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం పాత లావాదేవీలపై పన్నులు విధించడం లేదని (రెట్రాస్పెక్టివ్), ప్రస్తుతం వివాదాస్పద మైనవన్నీ కూడా పాత కేసులు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. గత లాభాలపై మ్యాట్ పేరిట.. సుమారు 68 ఎఫ్ఐఐలకు పన్నుల శాఖ రూ.603 కోట్ల మేర ట్యాక్సులు కట్టాలంటూ నోటీసులు పంపడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అవినీతి నిరోధక చట్టంలోనే లోపాలు.. అవినీతి నిరోధక చట్టంలోనే ప్రాథమికంగా లోపాలున్నాయని జైట్లీ వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకమైన అవినీతి నిర్ణయాలను, తప్పిదాలను ఇది ఒకే గాటన కడుతోందని ఆయన చెప్పారు. దీనివల్లే పలువురు ప్రభుత్వాధికారులు, నియంత్రణ సంస్థల అధికారులు సీబీఐ విచారణలు ఎదుర్కొనాల్సి వస్తోందన్నారు. దీంతో సరళీకరణకు ముందు 1988లో రూపుదిద్దుకున్న ఈ చట్టాన్ని సవరించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించిందని వివరించారు. పలు నియంత్రణ సంస్థల అధికారులు, ఇతర ప్రభుత్వాధికారులపై అవినీతి ఆరోపణల కింద సీబీఐ విచారణ జరుపుతుండటం, వీటిలో చాలా మటుకు కేసులను ఆ తర్వాత ఉపసంహరిస్తుండటం మొదలైన పరిణామాల నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్మన్ సీబీ భవే కూడా ఇలా సీబీఐ విచారణ ఎదుర్కొనాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిణామాల వల్లే 1991 తర్వాత ప్రభుత్వాధికారులు నిర్ణయాలు తీసుకోవడమనేది చాలా క్లిష్టంగా మారిందని జైట్లీ పేర్కొన్నారు. త్వరలో షాంఘైకి కామత్ న్యూఢిల్లీ: ప్రస్తుతం నిర్వహిస్తున్న పదవీ బాధ్యతల నుంచి త్వరలో వైదొలగి, బ్రిక్స్ బ్యాంక్ కేంద్ర కార్యాలయం ఉన్న షాంఘైలోని పరిస్థితులను అర్థం చేసుకోవడానికి అక్కడకు వెళ్లనున్నట్లు కె.వి.కామత్ వెల్లడించారు. ఆయన బ్రిక్స్ బ్యాంక్ తొలి ప్రెసిడెంట్‌గా నియమితులవడం తెలిసిందే. కామత్ ప్రస్తుతం ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్లకు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు. -
మ్యాట్‌పై సుప్రీంకు ఎఫ్ఐఐలు
గత వారం బిజినెస్ టాప్ 500 అమెరికా బ్రాండ్లలో టీసీఎస్ 13/05/15: అమెరికాలోని టాప్ 500 బ్రాండ్లలో టీసీఎస్‌కు చోటుదక్కింది. బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రూపొందించిన జాబితాలో 57వ స్థానాన్ని ఆక్రమించింది. గడిచిన ఐదేళ్లలో టీసీఎస్ బ్రాండ్ విలువ దాదాపు 4 రె ట్లు పెరిగింది. 2012లో 2.3 బిలియన్ డాలర్లుగా ఉన్న టీసీఎస్ ప్రస్తుతం బ్రాండ్ విలువ 8.7 బిలియన్ డాలర్లుగా ఉంది. మ్యాట్‌పై సుప్రీంకోర్టుకు విదే శీ ఇన్వెస్టర్లు వివాదాస్పదమైన కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) విధింపును వ్యతిరేకిస్తూ విదేశీ ఇన్వెస్టర్లు ఏకరువుపెడుతున్నారు. వీరిలో కొందరి తరపున హాంకాంగ్ లాబీ గ్రూప్ ‘ఆసియా సెక్యూరిటీస్ ఇండస్ట్రీ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ అసోసియేషన్’ (అసిఫ్మా) సుప్రీంకోర్టుకు వెళ్లాలని యోచిస్తోంది. ఇందుకోసం లాయర్లు, ఆర్థిక సంస్థలు తదితర వాటితో సమాలోచనలు జరుపుతోంది. పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తే మ్యాట్‌ను సవాలు చేసిన తొలి విదేశీ లాబీ గ్రూప్‌గా అసిఫ్మా అవతరిస్తుంది. ఇప్పటికే విదేశీ ఇన్వెస్టర్లపై మ్యాట్ విధించడాన్ని సవాలు చేస్తూ మారిషస్‌కు చెందిన క్యాజిల్‌టన్ ఇన్వెస్ట్మెంట్ సుప్రీంకోర్టులో కేసు వేసింది. తెలంగాణలో సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్? తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తిమేరకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించే గూగుల్ ఫైబర్ బృందం త్వరలోనే తెలంగాణకు రానుంది. గూగుల్ ఫైబర్ సెకనుకు 1000 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది. ఇవి ప్రస్తుతం ఉన్న బ్రాడ్‌బ్యాండ్ వేగంతో పోలిస్తే దాదాపు 40 రెట్లు ఎక్కువ. 2011లో కన్సస్ (యూఎస్)లో ప్రారంభమైన గూగుల్ ఫైబర్ ప్రస్తుతం అట్లాంటా, అస్టిన్, ప్రోవో, చార్లోటీ, నాస్విల్లీ తదితర నగరాల్లో సేవలను అందిస్తోంది. నిరాశ మిగిల్చిన ఎగుమతులు 15/05/15: భారత్ ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలిమాసంలోనే నిరాశ పరిచాయి. 2014 ఏప్రిల్‌తో పోలిస్తే 2015 ఏప్రిల్‌లో14 శాతంమేర క్షీణించాయి. దీంతో గతేడాది 26 బిలియన్ డాలర్లుగా ఉన్న ఎగుమతులు ఈ ఏడాది 22 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దిగుమతులు కూడా 7 శాతం మేర తగ్గాయి. వీటి విలువ 36 బిలియన్ డాలర్ల నుంచి 33 బిలియన్ డాలర్లకు చేరింది. అంతర్జాతీయ మందగమన పరిస్థితులే ఎగుమతులు తగ్గడానికి ప్రధాన కారణం. ఇది ఇలాఉంటే ఏప్రిల్‌లో వాణిజ్య లోటు ఏప్రిల్‌లో 11 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. వాణిజ్య లోటు పెరుగుదలకు బంగారం దిగుమతుల వృద్ధి కూడా ఒక కారణం. 2020కి రిటైల్ రంగం @ 1.2 లక్షల కోట్ల డాలర్లు ఈ-కామర్స్ జోష్‌తో భారత రిటైల్ రంగం జోరుగా వృద్ధి సాధిస్తోందని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) పేర్కొంది. ప్రస్తుతం 55 కోట్ల డాలర్లుగా ఉన్న భారత రిటైల్ రంగం 2020 నాటికి 1.2 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని తెలిపింది. అలాగే ఈ-కామర్స్ రంగం 290 కోట్ల డాలర్ల నుంచి 10,000 కోట్ల టర్నోవర్‌ను సాధిస్తుందని వివరించింది. -
మ్యాట్‌పై సుప్రీం కోర్టుకు విదేశీ ఇన్వెస్టర్లు!
హాంకాంగ్ లాబీ గ్రూప్ ఆధ్వర్యంలో సన్నాహాలు ముంబై/హాంకాంగ్: వివాదాస్పదమైన కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) విధింపును వ్యతిరేకిస్తూ విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) ఏకమవుతున్నారు. వీరిలో కొందరి తరఫున హాంకాంగ్ లాబీ గ్రూప్ ‘ఆసియా సెక్యూరిటీస్ ఇండస్ట్రీ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అసోసియేషన్’ (అసిఫ్మా) ఈ అంశపై సుప్రీం కోర్టుకు వెళ్లాలని యోచిస్తోంది. ఇందుకోసం ఆర్థిక సంస్థలు, లాయర్లు, ట్యాక్స్ కన్సల్టెంట్లతో సమాలోచనలు జరుపుతోంది. మ్యాట్ విషయంలోఅసిఫ్మా జూన్‌లో పిటీషన్ వేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే విదేశీ ఇన్వెస్టర్లపై మ్యాట్ విధించడంలో చట్టబద్ధతను ప్రశ్నిస్తూ మారిషస్‌కి చెందిన క్యాజిల్‌టన్ ఇన్వెస్ట్మెంట్ సుప్రీం కోర్టులో కేసు వేసింది. విస్తృతమైన అంశాలతో కూడిన క్యాజిల్‌టన్ కేసుతో సంబంధం లేదని భావించిన పక్షంలో ఆసిఫ్మా పిటీషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఒకవేళ కోర్టు గానీ విచారణకు స్వీకరిస్తే అసిఫ్మా.. మ్యాట్‌ను సవాల్ చేసిన తొలి విదేశీ లాబీ గ్రూప్ అవుతుంది. విదేశీ ఇన్వెస్టర్లు వ్యక్తిగతంగా వేర్వేరు కేసులూ వేయొచ్చు. అయితే, ఇవి తేలడానికి చాలా ఏళ్లు పట్టేసే అవకాశం ఉండటంతో గ్రూప్‌గా వే సేందుకు సిద్ధమవుతున్నాయి. ఎఫ్ఐఐలకుకొన్నాళ్లుగా ఐటీ శాఖ మ్యాట్ నోటీసులు జారీ చేస్తోంది. ఈ ఆందోళనలతో విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ బాండ్లు, షేర్లను భారీ స్థాయిలో విక్రయించి, వైదొలుగుతున్నారు. కమిటీలో స్వతంత్ర సభ్యులు: జైట్లీ మ్యాట్‌పై ఏర్పాటైన అత్యున్నత స్థాయి కమిటీలో స్వతంత్ర సభ్యులు ఉంటారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. వారు పక్షపాతరహితంగా, నిర్మొహమాటంగా తమ అభిప్రాయాలు తెలియజేయగలరని ఆయన చెప్పారు. మ్యాట్ అన్ని సంస్థలకూ వర్తిస్తుంది.. కానీ.. సాంకేతికంగా చూస్తే మ్యాట్ అనేది ప్రతీ కంపెనీకి వర్తిస్తుంది. కేవలం భారతీయ కంపెనీలకు మాత్రమే వర్తిస్తుందని నిబంధనల్లో ఎక్కడా లేదు. అయితే, ఇదే అంశం వివాదాస్పదమైంది కూడా. సాధారణంగా ఎఫ్‌పీఐలకు కంపెనీల చట్టం కింద అకౌంట్ల నిర్వహణ ఉండదు. ఆ రకంగా అవి మ్యాట్ పరిధిలోకి రావు. - రాజేష్ హెచ్ గాంధీ, పార్ట్నర్, డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్ ప్రత్యేక కేటగిరీకి మినహాయింపు ఉంటుంది.. పన్నుల విషయంలో ఎఫ్ఐఐలకు ప్రత్యేక నిబంధనలు వర్తిస్తాయి. వీరి రేట్లు ప్రత్యేకంగా ఉంటాయి. ప్రత్యేక కేటగిరీ కింద ప్రత్యేక పన్నులు విధించేటప్పుడు ఇక మ్యాట్ ఎందుకు? సవరించిన ఫైనాన్స్ బిల్లులో ఈ విషయాన్నే చెప్పారు. - షెఫాలి గరోదియా, పార్ట్నర్, బీఎంఆర్ అండ్ అసోసియేట్స్ -
ఎఫ్ఐఐలకు మ్యాట్ ఉపశమనం
కొత్త పన్ను నోటీసుల నిలిపివేత న్యూఢిల్లీ: కనీస ప్రత్యామ్నాయ పన్నుల (మ్యాట్) విషయంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ)కు ఊరటనిచ్చేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇప్పటికే నోటీసులు అందుకున్న ఎఫ్ఐఐలకు కొత్తగా మరిన్ని పన్ను నోటీసుల జారీని, తదుపరి పన్ను మదింపు ప్రక్రియలను నిలిపివేయాలని నిర్ణయించింది. ఎఫ్ఐఐల గత లాభాలపై మ్యాట్ విధింపు అంశంపై అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటైన నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ఆదాయ పన్నులో భాగమైన అంతర్జాతీయ ట్యాక్సేషన్ విభాగాలకు ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. మ్యాట్ విషయంలో విదేశీ ఇన్వెస్టర్లపై ఒత్తిడి ఉండబోదని ఆర్థిక మంత్రి ప్రకటించిన దరిమిలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. నిర్దిష్ట గడువేమీ నిర్దేశించనప్పటికీ అత్యున్నత కమిటీ సాధ్యమైనంత త్వరగా నివేదికను సమర్పించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎఫ్ఐఐల భయాలను పోగొట్టేందుకు ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా తాజా పరిణామం ఉందని అశోక్ మహేశ్వరి అండ్ అసోసియేట్స్ పార్ట్నర్ అమిత్ మహేశ్వరి అభిప్రాయపడ్డారు. గతంలో ఆర్జించిన లాభాలపై మ్యాట్ కింద రూ. 602 కోట్ల మేర కట్టాలంటూ 68 ఎఫ్ఐఐలకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. విదేశీ ఇన్వెస్టర్లు గగ్గోలు పెట్టడంతో దీనిపై రిటైర్డు జస్టిస్, లా కమిషన్ చైర్మన్ ఎ.పి. షా సారథ్యంలో అత్యున్నత స్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
‘మ్యాట్’ పరిష్కారమే లక్ష్యం..!
న్యూఢిల్లీ: విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (ఎఫ్ఐఐ)కు తలనొప్పిగా మారిన కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) వివాదం పరిష్కారమే లక్ష్యంగా కేంద్రం చర్యలు ప్రారంభించింది. ఈ అంశంపై ఏర్పాటయిన కమిటీ చీఫ్... జస్టిస్ ఏపీ షాతో శుక్రవారం కేంద్ర రెవెన్యూ కార్యదర్శి శక్తికాంత దాస్ సమావేశమయ్యారు. వివాద పరిష్కారానికి సంబంధించి కమిటీ విధి విధానాలను, అలాగే నివేదిక సమర్పించాల్సిన కాలపరిమితిని ఆర్థిక శాఖ 4 రోజుల్లో ఖరారు చేస్తుందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. షా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు విషయాన్ని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారమే రాజ్యసభలో ప్రకటించారు. ఈ కమిటీలో పన్నుల వ్యవహారాల నిపుణులు సభ్యులుగా ఉంటారని అధికార వర్గాలు తెలియజేశాయి. కాగా మ్యాట్ బకాయిల వసూళ్ల విషయంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ)పై ఎలాంటి బలవంతపు చర్యలు ఉండబోవని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. మూలధన లాభాల్లో 20% మ్యాట్ చెల్లించాలంటూ 68 మంది ఎఫ్ఐఐలకు పన్నుల శాఖ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. ఎఫ్ఐఐల పునరాలోచన...: ఫిచ్ మిగతా దేశాలతో పోలిస్తే భారత్ వృద్ధి అవకాశాలు ఆకర్షణీయంగానే ఉన్నాయని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ పేర్కొంది. అయితే, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునే పరిస్థితి నెలకొందని అభిప్రాయపడింది. -
మ్యాట్‌పై ఉన్నత స్థాయి కమిటీ: జైట్లీ
న్యూఢిల్లీ: విదేశీ పెట్టుబడిదారుల భయాలను పోగొట్టడానికి కేంద్రం తన వంతు ప్రయత్నం చేస్తోంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) చెల్లింపుల వివాదాస్పద అంశాన్ని అత్యున్నత స్థాయి కమిటీ ఒకటి పరిశీలిస్తుందని, తగిన సూచనలు చేస్తుందని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గురువారం పేర్కొన్నారు. రాజ్యసభలో ఫైనాన్స్ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, మ్యాట్‌తో పాటు పన్నులకు సంబంధించి నెలకొన్న పలు వివాదాస్పద అంశాలను ఉన్నత స్థాయి కమిటీ పరిశీలిస్తుందని తెలిపారు. ఈ కమిటీకి లా కమిషన్ చైర్మన్ జస్టిస్ ఏపీ షా నేతృత్వం వహిస్తారని కూడా వెల్లడించారు. కమిటీ చేసిన సూచనల ప్రకారం కేంద్రం తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రూ. లక్ష దాటిన చెల్లింపుల విషయంలో పాన్ నెంబర్‌ను తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలని కొన్ని వర్గాల నుంచి వస్తున్న డిమాండ్‌ను ఆయన తిరస్కరించారు. -
మార్కెట్‌కు రూపాయి దెబ్బ
వరుసగా మూడో రోజూ నష్టాలే ⇒ కొనసాగుతున్న ఎఫ్ఐఐల విక్రయాలు ముంబై: స్టాక్ మార్కెట్ పతనం గురువారం మూడోరోజు కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల మ్యాట్ ఆందోళనలకు తోడు తాజాగా డాలర్‌తో రూపాయి మారకం 20 నెలల కనిష్ట స్థాయికి 64కు క్షీణించడం స్టాక్ మార్కెట్‌ను దెబ్బకొట్టింది. బీఎస్ఈ సెన్సెక్స్ 118 పాయింట్లు క్షీణించి 26,599, నిఫ్టీ 40 పాయింట్లు క్షీణించి 8,057 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది ఆరున్నర నెలల కనిష్ట స్థాయి. కాగా ఇంట్రాడేలో నిఫ్టీ 8,000 పాయింట్ల దిగువకు తాకింది. పన్ను వివాదాల కారణంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతుండడం, సంస్కరణల బిల్లుల ఆమోదంలో జాప్యం జరుగుతుండడం, కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశమయంగా ఉండడం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయని ట్రేడర్లంటున్నారు. 1,858 షేర్లు నష్టాల్లో, 813 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్ఈలో రూ.3,182 కోట్లుగా, ఎన్ఎస్ఈ నగదు విభాగంలో రూ.17,676 కోట్లుగా, ఎన్ఎస్ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,48,778 కోట్లుగా నమోదైంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,361 కోట్ల నికర విక్రయాలు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,158 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు. -
ఎఫ్ఐఐలకు బూస్ట్..!
అబర్డీన్‌కు మ్యాట్ నోటీసులపై బాంబే హైకోర్టు స్టే ముంబై: మ్యాట్‌పై ఎఫ్ఐఐలకు బాంబే హైకోర్టు ఊరటనిచ్చింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చే విధంగా స్కాట్లాండ్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ అబర్డీన్‌కు ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) నోటీసులపై బాంబే హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జూన్ 22కి వాయిదా వేసింది. ఇలాంటి నోటీసులపై మరో అయిదు ఎఫ్‌పీఐలు దాఖలు చేసిన రిట్ పిటీషన్లపై బుధవారం విచారణ జరపనున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. 2008 నుంచి స్టాక్స్, బాండ్లలో ట్రేడింగ్ ద్వారా ఆర్జించిన లాభాలపై రూ. 603 కోట్ల మేర మ్యాట్ కట్టాలంటూ 68 ఎఫ్‌పీఐలకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీటిపైనే అబర్డీన్ గ్లోబల్ ఎమర్జింగ్ మార్కెట్స్‌తో పాటు ఫస్ట్ ఏషియా పసిఫిక్ సస్టెయినబిలిటీ ఫండ్ మొదలైనవి కోర్టును ఆశ్రయించాయి. మరోవైపు, హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను అధ్యయనం చేయాల్సి ఉందని, ఆ తర్వాతే స్పందించగలమని కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్పర్సన్ అనితా కపూర్ తెలిపారు. -
ఆరేళ్ల ఎఫ్ఐఐ ఖాతాలు తిరగదోడనున్న ఐటీ శాఖ
న్యూఢిల్లీ : కనీస ప్రత్యామ్నాయ పన్నులు (మ్యాట్) కట్టాల్సిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్ఐఐ) ఆరేళ్ల ఖాతాలను ఆదాయ పన్ను శాఖ పునఃపరిశీలించనుంది. భారత్‌తో ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం (డీటీఏఏ) లేని దేశాలకు చెందిన ఇన్వెస్టర్లకు ఆరేళ్ల ట్యాక్స్ నోటీసులు పంపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కేమ్యాన్ ఐలాండ్, హాంకాంగ్, బ్రిటీష్ వర్జిన్ ఐల్యాండ్ మొదలైన వాటికి భారత్‌తో డీటీఏఏ ఒప్పందాలు లేవు. గత ఆరేళ్లుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) కట్టాల్సిన పన్ను బకాయిలు సుమారు రూ. 3,000 కోట్లు ఉంటాయని అంచనా. విదేశీ ఇన్వెస్టర్ల పాత లావాదేవీలపై మ్యాట్ విధించడంపై ప్రస్తుతం వివాదం నడుస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఫైనాన్స్ బిల్లులో ‘మ్యాట్’పై స్పష్టత!
ఎఫ్ఐఐలకు కేంద్ర ప్రభుత్వం సంకేతాలు.. - డీటీఏఏ పరిధిలో ఉన్న విదేశీ ఇన్వెస్టర్లకు పన్ను నుంచి ఊరట... - నిబంధనల్లో సవరణలపై కసరత్తు..! న్యూఢిల్లీ: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ) ఆందోళనల నేపథ్యంలో కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) వర్తింపుపై ప్రభుత్వం స్పష్టతనివ్వనుంది. పార్లమెంటులో 2015-16 ఫైనాన్స్ బిల్లు ఆమోదం సందర్భంగా ఈ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి వరకూ మూలధన లాభాలన్నింటిపైనా ఎఫ్ఐఐలు 20 శాతం మ్యాట్ బకాయిలను (దాదాపు రూ. 40,000 కోట్లు) చెల్లిం చాలంటూ కేంద్ర రెవెన్యూ విభాగం డిమాండ్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎఫ్ఐఐలతో తాజాగా భేటీ అయిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా కాస్త ఊరటనిచ్చే సంకేతాలిచ్చారు. ప్రధానంగా భారత్‌తో ద్వంద్వ పన్నుల నిరోధ ఒప్పందాలున్న(డీటీఏఏ) దేశాలకు చెందిన ఎఫ్ఐఐలకు మ్యాట్ వర్తింపు ఉండబోదని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫైనాన్స్ బిల్లులో మ్యాట్ నిబంధనలకు స్పష్టతనిచ్చేవిధంగా సవరణలు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన గురువారమిక్కడ విలేకరులకు వెల్లడించారు. అయితే, ఈ ఒప్పందాల పరిధిలో లేని ఎఫ్ఐఐలు మాత్రం కోర్టుల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలంటూ ఆయన సూచించారు. ప్రస్తుతం పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి విదితమే. మే 8న లోక్‌సభ సమావేశాలు ముగియనుండగా.. 13 వరకూ రాజ్య సభ సమావేశాలు కొనసాగనున్నాయి. వచ్చే వారంలో ఫైనాన్స్ బిల్లు చర్చకు రానుంది. డీటీఏఏల పరిశీలన... మ్యాట్ వర్తింపు విషయంలో స్పష్టత కోసం వివిధ దేశాలతో భారత్‌కు ఉన్న డీటీఏఏలను అధ్యయనం చేయనున్నామని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి మూలధన లాభాలపై తమ స్వదేశాల్లో పన్ను చెల్లిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు 20 శాతం మ్యాట్ పరిధిలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు డీటీఏఏ ఒప్పందాలున్న మారిషస్, సింగపూర్ వంటి దేశాల్లో మూలధన లాభాలపై పన్నులు లేనప్పటికీ... ఆయా దేశాల ఎఫ్ఐఐలకు కూడా మ్యాట్ మినహాయింపు లభించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, స్థిర ఆదాయ సెక్యూరిటీలు, ఇతర డెట్ మార్గాల్లోని ఆదాయాలపై వడ్డీ రేటుకు సంబంధించి మ్యాట్ వర్తింపు విషయంలో కూడా ఫైనాన్స్ బిల్లులో స్పష్టతనివ్వనున్నట్లు ఆయా వర్గాల పేర్కొన్నాయి. భారత్‌లో లావాదేవీలు నిర్వహిస్తున్న ఎఫ్ఐఐల్లో దాదాపు 90% మారిషస్, సింగపూర్ కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహిస్తుండటం గమనార్హం. కాగా, పన్ను నోటీసులు అందుకున్న ఎఫ్ఐఐ లు మ్యాట్ నుంచి మినహాయింపు పొందాలంటే... డీటీఏఏ దేశాలకు చెందినవిగా రుజువు చేసుకోవాల్సి ఉంటుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. -
ఎఫ్ఐఐలకు ‘మ్యాట్’ ఊరట లేనట్టే..!
తేల్చిచెప్పిన కేంద్ర ఆర్థిక శాఖ * సుప్రీంను ఆశ్రయించాలని సూచన న్యూఢిల్లీ: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ)కు పన్ను ఊరటనిచ్చే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేసింది. పన్ను విధానాలపై చర్చించేందుకు బుధవారం ఎఫ్ఐఐలతో జరిగిన సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా, రెవెన్యూ కార్యదర్శి శక్తికాంత దాస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మూలధన లాభాలపై ఈ ఏడాది మార్చి వరకూ 20 శాతం కనీస ప్రత్నామ్నాయ పన్ను(మ్యాట్) బకాయిలను(దాదాపు రూ.40 వేల కోట్లు) చెల్లించాలంటూ ఇటీవలే రెవన్యూ విభాగం ఎఫ్ఐఐలకు డిమాండ్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అయితే, విదేశీ ఇన్వెస్టర్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పన్ను నోటీసులపై కల్పించుకోవడానికి నిరాకరించిన ఆర్థిక శాఖ.. కోర్టుల్లో దీన్ని పరిష్కరించుకోవాల్సిందిగా వారికి సూచించింది. కాగా, పన్ను నోటీసులపై ఇప్పటికే అథారిటీ ఫర్ అడ్వాన్స్డ్ రూలింగ్స్(ఏ ఏఆర్)లో అప్పీలు చేసుకున్న ఎఫ్ఐఐలకు అక్కడా చుక్కెదురైంది. పన్నుల విభాగానికి అనుకూలంగా తీర్పు వెలువడింది. మ్యాట్ విషయంలో గత యూపీఏ ప్రభుత్వ హయాంలో నెలకొన్న గందరగోళమే ప్రస్తుత పరిస్థితికి కారణమని సిన్హా వ్యాఖ్యానించారు. మ్యాట్ వర్తింపు సమంజసమేనంటూ ఏఏఆర్ తీర్పుతో ఇబ్బందులు తలెత్తాయని ఆయన చెప్పారు. ఈ అంశం ఇప్పుడు ప్రభుత్వ విధానానికి సంబంధించినది కాదని.. కోర్టుల్లోనే తేల్చుకోవాల్సి వస్తుందన్నారు. సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకుంటే అక్కడి తీర్పుకు అనుగుణంగా ఈ ప్రతిష్టంభణకు తెరపడొచ్చని కూడా ఆయన ఎఫ్ఐఐలకు సూచించారు. ఈ ఏప్రిల్ నుంచి వర్తించదు... ఏప్రిల్, 2015 నుంచి లావాదేవీలపై మ్యాట్ వర్తింపజేయకుండా ఫైనాన్స్ బిల్లులో ప్రతిపాదనను చేర్చామని సిన్హా పేర్కొన్నారు. పార్లమెంటులో దీనికి ఆమోదముద్ర పడితే అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు. -
ఈ తెరచాప ఎత్తితే.. కరెంటు వస్తుంది!
పడవలకు తెరచాపను ఎందుకు వాడతారు? గాలివాటాన్ని ఉపయోగించుకుని పడవను సరైన దిశలో ముందుకు తీసుకుపోవడానికి. అయితే ఈ తెరచాపతో పడవను నడపడమే కాదు.. కరెంటునూ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఎలాగంటే.. దీనిలో సోలార్ సెల్స్ కూడా ఉంటాయి మరి. అధునాతనమైన ఈ పర్యావరణ హిత నౌకను డాక్టర్ మార్గట్ క్రసోజెవిక్ అనే ఆర్కిటెక్ట్ డిజైన్ చేశారు. కార్బన్ ఫైబర్, కృత్రిమ ఫైబర్‌తో తయారు చేసిన తెరచాపలో సోలార్ సెల్స్‌ను పొందుపరుస్తారు. అవసరమైనప్పుడు పడవ నీటిపై కొంత ఎత్తుకు తేలేందుకు, తెరచాప దిశను, ఆకారాన్ని మార్చుకునేందుకు కూడా వీలవుతుంది. పూర్తిగా సౌరవిద్యుత్తోనే నడిచే ఈ పడవను దక్షిణాఫ్రికాలోని హోల్డెన్ మాంజ్ వైన్ ఎస్టేట్ యజమానులు డిజైన్ చేయించుకున్నారు. పడవ పందేలకు, సముద్రయానానికి దీనిని ఉపయోగిస్తారట. వచ్చే ఏప్రిల్‌లో నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీని నిర్మాణానికి రూ. 10 కోట్ల వరకూ ఖర్చు కానుందట. -
ఉద్యోగాలు
ఇండియన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ 251 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు.. అసిస్టెంట్ మేనేజర్ (ఇండస్ట్రీ): 67 మేనేజర్ (క్రెడిట్, రిస్క్, హెచ్ఆర్, మార్కెటింగ్): 90 మేనేజర్ (ట్రెజరీ/ ఫైనాన్షియల్ సర్వీసెస్): 40 మేనేజర్ (ప్లానింగ్ అండ్ ఎకనమిస్ట్): 18 మేనేజర్ (సెక్యూరిటీ): 11 మేనేజర్ (కాస్ట్ అకౌంటెంట్): 2 మేనేజర్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్): 2 సీనియర్ మేనేజర్ (ట్రెజరీ): 4 సీనియర్ మేనేజర్ (రిస్క్ మేనేజ్మెంట్): 3 చీఫ్ మేనేజర్ (క్రెడిట్): 10 చీఫ్ మేనేజర్ (ఎకనమిస్ట్): 2 చీఫ్ మేనేజర్ (చార్టెర్డ్ అకౌంటెంట్): 1 చీఫ్ మేనేజర్ (రిస్క్ మేనేజ్మెంట్) 1 ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. అర్హతలు తదితర పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: జూలై 30 వెబ్సైట్: www.indianbank.in ప్రవేశాలు మ్యాట్ ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్-సెప్టెంబరు 2014 నోటిఫికేషన్ విడుదల చేసింది. కోర్సులు: ఎంబీఏ, పీజీడీఎం, పీజీడీబీఏ అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక: ఆఫ్‌లైన్/ ఆన్లైన్ టెస్ట్ ద్వారా. దరఖాస్తు: ఆఫ్‌లైన్/ ఆన్లైన్ ద్వారా. రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 23 హార్డ్ కాపీలను పంపడానికి చివరి తేది: ఆగస్టు 25 ఆఫ్‌లైన్ టెస్ట్ తేది: సెప్టెంబరు 7 ఆన్లైన్ టెస్ట్ తేది: సెప్టెంబరు 13 వెబ్సైట్: apps.aima.in కృష్ణా యూనివర్సిటీ రీసెర్చ్ సెట్ కృష్ణా యూనివర్సిటీ (కేఆర్‌యూ) మచిలీపట్నం, ఎంఫిల్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే రీసెర్చ్ సెట్ - 2014కు దరఖాస్తులు కోరుతోంది. రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2014 కోర్సు: ఎంఫిల్, పీహెచ్డీ (ఫుల్‌టైమ్/ పార్ట్‌టైమ్) విభాగాలు: బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ సెన్సైస్, ఫిజిక్స్, మ్యాథ మెటిక్స్, కంప్యూటర్ సైన్స్, బిజినెస్ మేనేజ్ మెంట్, కామర్స్, ఇంగ్లిష్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, తెలుగు, ఎడ్యుకేషన్. అర్హతలు: సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: ఆగస్టు 14 వెబ్సైట్: www.krishnauniversity.ac.in -
యోగా నేర్పే చాప
వాషింగ్టన్: యోగా నేర్చుకోవాలంటే మాస్టర్ ఉండాలి. వేసే ఆసనాలు సరిగ్గా ఉంటున్నాయా? అన్నది పరిశీలించేందు కు ఓ శిక్షకుడు ఉంటేనే మంచిది. అయితే, ఈ పనులన్నిం టినీ యోగా చేసేటప్పుడు నేలపై వేసుకునే చాపే చేసేస్తే..? అవును అలాంటి చాపనే మునిచ్‌కు చెందిన ల్యూనార్ యూ రోప్ అనే కంపెనీ తయారు చేసింది. ఈ చాపలో సెన్సర్లు, ఎల్ఈడీ లైట్లను అమర్చారు. ఈ సెన్సర్లు శరీర కదలికలను, ఒత్తిడిని పరిశీలించి ఆ సమాచారాన్ని పరిశీలిస్తూ ఉంటాయట. ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని అసలైన భంగిమ రూపంలో చాపపై లైట్లు వెలుగుతాయి. వాటిని అనుసరిస్తూ ఆసనం సులువుగా వేసుకోవచ్చని దీన్ని తయారు చేసిన కంపెనీ చెబుతోంది. యోగాతోపాటు, థైబో, పిలేట్స్, జుంబా వంటి కసరత్తులకూ ఉపయోగపడేలా ఈ చాపను తయారు చేశారు. -
ఎస్ఈజెడ్లకు మ్యాట్ మినహాయించాలి
కేంద్రానికి ఎగుమతిదారుల విజ్ఞప్తి న్యూఢిల్లీ: ప్రత్యేక ఆర్థిక మండళ్లను(ఎస్ఈజెడ్) కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్) నుంచి మినహాయించాలని ఎగుమతిదారుల మండలి సోమవారం కేంద్ర ఆర్థిక శాఖకు విజ్ఞప్తి చేసింది. ఈ చర్య ఎగుమతుల వృద్ధితోపాటు, దేశీయ తయారీ రంగానికి సైతం సానుకూల ప్రయోజనం కల్పిస్తుందని ఈఓయూ అండ్ ఎస్ఈజెడ్ ఎగుమతి అభివృద్ధి మండలి(ఈపీసీఈఎస్) తన ప్రీ-బడ్జెట్ సంప్రదింపుల సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి తెలియజేసింది. ఎస్ఈజెడ్లపై మ్యాట్‌ను తొలగించాలన్నది తమ ప్రథమ డిమాండ్ అని పేర్కొంది. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే కనీసం దీనిని 7.5 శాతానికి తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. ఎస్ఈజెడ్ డెవలపర్లను డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ నుంచి మినహాయించాలని కూడా సూచించింది. మ్యాట్, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ పన్నులు ఎస్ఈజెడ్లకు సంబంధించి ‘పెట్టుబడుల సానుకూల ధోరణిని’ దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. సేవల పన్నుల నుంచి సైతం ఎస్ఈజెడ్లను మినహాయించాలని కోరింది. దేశ ఎగుమతుల్లో ఎస్ఈజెడ్లదే కీలకపాత్ర. దేశ మొత్తం ఎగుమతుల్లో దాదాపు 33 శాతం ఎస్ఈజెడ్లదే. దాదాపు 15 లక్షల మందికి ఎస్ఈజెడ్లు ఉపాధి కల్పిస్తున్నాయి. ఎస్ఈజెడ్ల నుంచి 2005-06లో ఎగుమతుల విలువ రూ.22,840 కోట్లు. 2013-14లో ఈ విలువ రూ.4.94 లక్షల కోట్లకు ఎగసింది.