
ఇంగ్లండ్ వైట్ బాల్ జట్టు హెడ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మాథ్యూ మాట్ ఎంపికయ్యాడు. మాట్ నాలుగేళ్లు ఇంగ్లండ్ కోచ్‌గా పనిచేయనున్నాడు. ఇక ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్ జట్టు నెదర్లాండ్స్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ నుంచే మాట్ కోచ్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. కాగా మాట్ గత ఏడేళ్లుగా ఆస్ట్రేలియా మహిళల జట్టు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
మాట్ కోచ్‌గా ఉన్న కాలంలోనే ఆస్టేలియా జట్టు వన్డే ప్రపంచకప్, రెండు టీ20 ప్రపంచకప్‌లు కైవసం చేసుకుంది. "ఇంగ్లండ్ జట్టుకు ప్రధాన కోచ్‌గా మాథ్యూ మాట్‌ను నియమించడం మాకు సంతోషంగా ఉంది. అతడు ఈ బాధ్యతలు చెపట్టేందుకు అంగీకరించడం మా అదృష్టం" అని ఇంగ్లండ్ జట్టు మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ పేర్కొన్నారు. ఇక ఇంగ్లండ్ టెస్టు జట్టు హెడ్ కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్ ఎంపికైన సంగతి తెలిసిందే.
చదవండి: Brendon McCullum: ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కోచ్‌గా బ్రెండన్ మెక్ కల్లమ్..
Comments
Please login to add a commentAdd a comment