యోగా నేర్పే చాప
వాషింగ్టన్: యోగా నేర్చుకోవాలంటే మాస్టర్ ఉండాలి. వేసే ఆసనాలు సరిగ్గా ఉంటున్నాయా? అన్నది పరిశీలించేందు కు ఓ శిక్షకుడు ఉంటేనే మంచిది. అయితే, ఈ పనులన్నిం టినీ యోగా చేసేటప్పుడు నేలపై వేసుకునే చాపే చేసేస్తే..? అవును అలాంటి చాపనే మునిచ్‌కు చెందిన ల్యూనార్ యూ రోప్ అనే కంపెనీ తయారు చేసింది.
ఈ చాపలో సెన్సర్లు, ఎల్‌ఈడీ లైట్లను అమర్చారు. ఈ సెన్సర్లు శరీర కదలికలను, ఒత్తిడిని పరిశీలించి ఆ సమాచారాన్ని పరిశీలిస్తూ ఉంటాయట. ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని అసలైన భంగిమ రూపంలో చాపపై లైట్లు వెలుగుతాయి. వాటిని అనుసరిస్తూ ఆసనం సులువుగా వేసుకోవచ్చని దీన్ని తయారు చేసిన కంపెనీ చెబుతోంది. యోగాతోపాటు, థైబో, పిలేట్స్, జుంబా వంటి కసరత్తులకూ ఉపయోగపడేలా ఈ చాపను తయారు చేశారు.