కింద ఒక చాపలాంటిది పరచుకుని చిన్నారి డాన్స్ చేస్తోంది. చూశారు కదా! ఇది మామూలు చాప కాదు. ఇది హైటెక్ డాన్స్‌మ్యాట్. ఇందులో రిథమ్ సెట్ చేసుకుంటే, రిథమ్‌కు అనుగుణంగా ఈ చాప మీద లైట్లు వెలుగుతాయి. వెలిగే లైట్ల మీద అడుగులు వేస్తుండటమే! చిన్నారులు డాన్స్ నేర్చుకోవడానికి, ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ హైటెక్ డాన్స్‌మ్యాట్ ఎంతో అనువుగా ఉంటుంది.
అమెరికన్ కంపెనీ ఫావో ష్వార్జ్ దీనిని ‘డాన్స్ మిక్సర్ రిథమ్ స్టెప్ ప్లేమేట్’ పేరుతో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది రెండు మోడ్స్‌లో పనిచేస్తుంది. ‘కీప్ ద బీట్’, ‘ఫ్రీస్టైల్’ మోడ్స్‌లో కోరుకున్న మోడ్ ఎంపిక చేసుకుని, దీని మీద తకిట తధిమి అంటూ ఇంచక్కా గంతులేయవచ్చు. మూడేళ్ల వయసు పైబడిన పిల్లలకు ఇది చక్కని ఆటవస్తువు. దీని ధర 30 డాలర్లు (రూ.2,497) మాత్రమే!
(చదవండి: పిల్లలు బాణాసంచా కాల్చేటప్పడూ జరభద్రం..ఈ జాగ్రత్తలు తప్పనసరి..)
Comments
Please login to add a commentAdd a comment