న్యూఢిల్లీ : కనీస ప్రత్యామ్నాయ పన్నులు (మ్యాట్) కట్టాల్సిన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) ఆరేళ్ల ఖాతాలను ఆదాయ పన్ను శాఖ పునఃపరిశీలించనుంది. భారత్‌తో ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం (డీటీఏఏ) లేని దేశాలకు చెందిన ఇన్వెస్టర్లకు ఆరేళ్ల ట్యాక్స్ నోటీసులు పంపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
కేమ్యాన్ ఐలాండ్, హాంకాంగ్, బ్రిటీష్ వర్జిన్ ఐల్యాండ్ మొదలైన వాటికి భారత్‌తో డీటీఏఏ ఒప్పందాలు లేవు. గత ఆరేళ్లుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) కట్టాల్సిన పన్ను బకాయిలు సుమారు రూ. 3,000 కోట్లు ఉంటాయని అంచనా. విదేశీ ఇన్వెస్టర్ల పాత లావాదేవీలపై మ్యాట్ విధించడంపై ప్రస్తుతం వివాదం నడుస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆరేళ్ల ఎఫ్‌ఐఐ ఖాతాలు తిరగదోడనున్న ఐటీ శాఖ
Published Thu, Apr 30 2015 1:57 AM | Last Updated on Thu, Oct 4 2018 5:15 PM
Advertisement