Budget 2024-25: బడ్జెట్‌ ముఖ్యాంశాలు | FM Nirmala Sitharaman Presents Union Budget 2024-25 Live Updates And Top Headlines In Telugu | Sakshi
Sakshi News home page

Budget 2024-25 Live Updates: బడ్జెట్‌ సమావేశాలు

Published Tue, Jul 23 2024 8:27 AM | Last Updated on Tue, Jul 23 2024 4:58 PM

nirmala sitharaman presents union budget 2024-25 live updates telugu

Parliament Budget Session 2024 Highlights: 
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ దేశ చరిత్రలో ఏడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ రికార్డు నెలకొల్పారు. బడ్జెట్‌ 2024-25లో నిర్మలా సీతారామన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు, అప్‌డేట్లు.

  • ఆదాయ సమీకరణ కేవలం పన్ను ఆధారితమైంది కాదు: నిర్మలా సీతారామన్‌

  • మనీలాండరింగ్‌ను నిరోధించడంలో ఏంజెల్ ట్యాక్స్ రద్దు అంశం కీలక ప్రభావం చూపుతుంది. ఇన్ని రోజులు ఇది భారతదేశంలో పెట్టుబడులకు ఆటంకంగా మారింది.

  • యూపీఏ 2లో ఏంజెల్ ట్యాక్స్ ప్రవేశపెట్టారు.

  • దీర్ఘకాలిక మూలధన లాభాలపై తీసుకొచ్చిన 12.5% ​​ట్యాక్స్‌ను నిజానికి సరాసరి పన్నురేటుతో పోలిస్తే చాలా తగ్గించాం.

  • పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేసేందుకు దీన్ని ప్రవేశపెట్టాం.

  • ఎప్‌ అండ్‌ ఓల్లో ఎస్‌టీటీ ఛార్జీలు అక్టోబర్‌ 1 నుంచి అమలులోకి  వస్తాయి .

  • కేంద్ర బడ్జెట్‌ 2024-25లో మొత్తం రూ.48,20,512 కోట్లు వ్యయం అంచనా వేశారు.

  • మూలధన వ్యయం రూ.11,11,111 కోట్లు. ఇది 2023-24 అంచనాల కంటే 16.9% ఎక్కువ.

  • ప్రభావవంతమైన మూలధన వ్యయం రూ.15,01,889 కోట్లుగా అంచనా.

  • రెవెన్యూ వసూళ్లు రూ.31,29,200 కోట్లు.

  • నికర పన్ను ఆదాయం రూ.25,83,499 కోట్లు.

  • పన్నేతర ఆదాయం రూ.5,45,701 కోట్లు.

  • మొత్తం మూలధన వసూళ్లు (రుణేతర రశీదులు, రుణ రసీదులతో కలిపి) రూ.15,50,915 కోట్లు.

  • యువతకు నైపుణ్యాలు పెంచే బడ్జెట్‌: మోదీ

  • మహిళల స్వావలంబనకు దోహదం చేసే బడ్జెట్‌.

  • ముద్ర రుణాల పరిమితిని రూ.20 లక్షలకు పెంచాం.

  • ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యమిచ్చాం.

  • భారత్‌ను గ్లోబల్‌ మ్యానుఫాక్చరింగ్‌ హబ్‌గా మారుస్తాం.

  • పర్యాటక రంగాన్ని మరింత మెరుగుపరిచేలా చర్యలు తీసుకున్నాం.

  • స్టాంప్‌ డ్యూటీ పెంచేందుకు రాష్ట్రాలకు అనుమతి.

  • పన్ను సమస్యలకు సంబంధించిన అప్పీళ్ల ద్రవ్య పరిమితులు పెంచారు.

  • ట్యాక్స్‌ ట్రిబ్యునల్స్, హైకోర్టులు, సుప్రీంకోర్టులో ప్రత్యక్ష పన్నులు, ఎక్సైజ్, సర్వీస్‌ ట్యాక్స్‌కు సంబంధించిన అప్పీళ్లను దాఖలు చేయడానికి ద్రవ్య పరిమితులు వరుసగా రూ.60 లక్షలు, రూ.2 కోట్లు, రూ.5 కోట్లుగా నిర్ణయించారు.

  • గత సంవత్సరం కంటే బడ్జెట్ కేటాయింపులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు నిధులు తగ్గించారు. 2024-25 బడ్జెట్‌లో రూ.951 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయించిన రూ.968 కోట్లు కంటే 1.79 శాతం నిధులు తగ్గాయి.

  • జమ్మూ కశ్మీర్‌కు బడ్జెట్‌లో రూ.42,277 కోట్లు.

  • అండమాన్ నికోబార్ దీవులకు రూ.5,985 కోట్లు.

  • చండీగఢ్‌కు రూ.5,862 కోట్లు.

  • లద్దాఖ్‌కు రూ.5,958 కోట్లు.

  • ప్రభుత్వం మూడు క్యాన్సర్ మందులను కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయించింది.

  • విదేశీ కంపెనీలపై కార్పొరేట్ పన్ను రేటు 40% నుంచి 35%కి తగ్గించింది.

  • క్యాపిటల్ గెయిన్‌లపై ప్రభుత్వం పన్ను పెంచిన తర్వాత రూపాయి రికార్డు స్థాయికి క్షీణించింది.

  • యూఎస్‌ డాలర్‌తో పోలిస్తే రూపాయి 83.69కి పడిపోయింది.

  • ఎంపిక చేసిన నగరాల్లో 100 స్ట్రీట్ ఫుడ్ హబ్‌ల అభివృద్ధి.

  • 30 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న 14 పెద్ద నగరాల కోసం రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికలు.

ప్రధాన కేంద్ర పథకాలకు కేటాయింపులు..

  • గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.86 వేలకోట్లు.

  • రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లకు రూ.1,200 కోట్లు.

  • న్యూ క్లియర్‌ ప్రాజెక్ట్‌లకు రూ.2,228 కోట్లు.

  • ఫార్మాసూటికల్స్‌ రంగంలో పీఎల్‌ఐ పథకానికి రూ.2,143 కోట్లు.

  • సెమికండక్టర్లు అభివృద్ధికి, తయారీ రంగానికి రూ.6,903 కోట్లు.

  • సోలార్‌ పవర్‌(గ్రిడ్‌) రూ.10 వేలకోట్లు.

  • ఎల్‌పీజీ డీబీటీ(రాయితీ)లకు 1,500 కోట్లు.

రూపాయి రాక...

  • ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ 19 పైసలు

  • ఎక్సైజ్‌ డ్యూటీ 5 పైసలు

  • అప్పులు, ఆస్తులు 27 పైసలు

  • పన్నేతర ఆదాయం 9 పైసలు

  • మూలధన రశీదులు 1 పైసలు

  • కస్టమ్స్‌ ఆదాయం 4 పైసలు

  • కార్పొరేషన్‌ ట్యాక్స్‌ 17 పైసలు

  • జీఎస్టీ, ఇతర పన్నులు 18 పైసలు

రూపాయి పోక..

  • పెన్షన్లు 4 పైసలు

  • వడ్డీ చెల్లింపులు 19 పైసలు

  • కేంద్ర పథకాలు 16 పైసలు

  • సబ్సిడీలు 6 పైసలు

  • డిఫెన్స్‌ 8 పైసలు

  • రాష్ట్రాలకు తిరిగి చెల్లించే ట్యాక్స్‌లు 21 పైసలు

  • ఫైనాన్స్‌ కమిషన్‌కు చెల్లింపులు 9 పైసలు

  • కేంద్ర ప్రాయోజిక పథకాలు 8 పైసలు

  • ఇతర ఖర్చులు 9 పైసలు

  • కొత్త పన్ను విధానంలో మార్పులు.. రూ.3 లక్షలలోపు ఎలాంటి పన్ను లేదు. రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షలలోపు 5 శాతం, రూ.7లక్షలు-రూ.10 లక్షలలోపు 10%, రూ.10లక్షలు- రూ.12 లక్షలలోపు 15%, రూ.12 లక్షలు-రూ.15 లక్షలలోపు 20%, రూ.15 లక్షలు అంతకంటే ఎక్కువ ఉంటే 30% పన్ను చెల్లించాలి. మొత్తంగా పన్నుదారులు రూ.17,500 మిగుల్చుకునే అవకాశం.

  • పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంపు.

  • ట్రేడింగ్‌ మార్కెట్‌లో ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్లపై ఎస్‌టీటీ వరుసగా 0.02%, 0.01%కి పెంపు.

  • దీర్ఘకాలిక మూలధన లాభాలపై 12.5 శాతం పన్ను.

  • క్యాపిటల్‌ కనిష్ఠ పరిమితి రూ.1.25 లక్షలు.

  • స్టార్టప్‌ల కంపెనీలకు ప్రోత్సాహకం.. ఏంజెల్‌ ట్యాక్స్‌ రద్దు.

  • బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకం 6 శాతం, ప్లాటినంపై 6.4 శాతం తగ్గింపు.

  • మొబైల్, యాక్ససరీస్‌పై 15 శాతం దిగుమతి సుంకం తగ్గింపు.

  • జీఎస్టీలో పన్నుల నిర్మాణాన్ని హేతుబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. సామాన్యులకు జీఎ‍స్టీ వల్ల గణనీయంగా లాభం చేకూరింది. జీఎస్టీ ప్రయోజనాలను మరింత మెరుగుపరచడానికి పన్ను నిర్మాణంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నిస్తాం.

  • ఆర్థిక ద్రవ్యలోటు జీడీపీలో 4.9%గా ఉంది.

  • విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)ను పెంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

  • కాశీ విశ్వనాథ్ ఆలయం, నలంద, విష్ణుపాద్, మహాబోధి ఆలయం వంటి ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రత్యేక కారిడార్ల ఏర్పాటు.

  • రాబోయే 10 సంవత్సరాలలో అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను ఐదు రెట్లు విస్తరిస్తాం.

  • ఈ లక్ష్యానికి చేరుకోవడానికి రూ.1,000 కోట్ల క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేస్తాం.

  • ఫిబ్రవరిలో ప్రకటించిన విధంగా రూ.1 లక్ష కోట్ల ఫండ్‌తో ప్రైవేట్ ఆధారిత పరిశోధనలను ప్రోత్సహించడానికి ఒక యంత్రాంగాన్ని రూపొందిస్తాం.

  • చిన్న, మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్‌ల అభివృద్ధి.

  • ఇందుకు ప్రభుత్వం ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేస్తుంది. న్యూక్లియర్ ఎనర్జీ కోసం కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేయాల్సి ఉంది.

  • నేపాల్‌లో వరదలను నియంత్రించేలా మరిన్ని నిర్మాణాలు చేపట్టాలి. అసోం, బీహార్‌లోనూ తరచు వరదలు సంభవిస్తాయి. వరదల వల్ల హిమాచల్ ప్రదేశ్ తీవ్రంగా నష్టపోతుంది. కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తుల నిర్వహణకు రూ.11,500 కోట్లు ఆర్థికసాయం.

  • ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి సంబంధించి విధాన పత్రాన్ని విడుదల చేస్తాం. ఈ పథకాన్ని రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి ప్రారంభించారు. దీని ద్వారా 1 కోటి కుటుంబాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తారు. ఇప్పటికే 1.28 కోట్ల రిజిస్ట్రేషన్‌లు నమోదయ్యాయి. 14 లక్షల దరఖాస్తులు అందాయి.

  • మౌలిక సదుపాయాలకు రూ.11.11 లక్షల కోట్లు.

  • ఇది జీడీపీలో 3.4 శాతానికి సమానం.

  • రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్‌లకు రూ.26,000 కోట్ల ప్రోత్సాహం.

  • గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు.

  • ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ (ఐబీసీ) పరిధిలో బ్యాంక్‌ రుణాల రికవరీని మెరుగుపరచడానికి ఇంటిగ్రేటెడ్ టెక్ ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు.

  • ముద్ర రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు.

  • ఎంఎస్‌ఎంఈలకు క్రెడిట్‌ గ్యారెంట్‌ స్కీం.

  • సులభంగా నిధులు అందేలా చర్యలు.

  • గంగానదిపై మరో రెండు వంతెనల ఏర్పాటు.

  • ఈశాన్యరాష్ట్రాల్లో ఎక్స్‌ప్రెస్‌ హైవేల నిర్మాణం.

  • ఈశాన్యరాష్ట్రాల్లో 100 పోస్ట్‌పేమెంట్‌ బ్యాంకుల ఏర్పాటు.

  • దేశవ్యాప్తంగా 12 ఇండస్ట్రీయల్‌ పార్క్‌ల ఏర్పాటు.

  • బీహార్‌లో ఎక్స్‌ప్రెస్‌ హైవేలు నిర్మాణం.

  • బీహార్‌, ఏపీలోనూ పూర్వోదయ పథకం అమలు.

ఏపీకి అండగా ఉంటాం..

  • ఏపీ రాజధాని నిర్మాణానికి నిధులు.

  • వాటర్‌, పవర్‌, రైల్లే, రోడ్లు రంగాల్లో ఏపీకి అండగా ఉంటాం.

  • పోలవరం ప్రాజెక్ట్‌కు పూర్తి సాయం అందించేలా చర్యలు.

  • అమరావతి అభివృద్ధికి రూ.15 వేలకోట్లు.

  • ఈ ఏడాదిలోనే ఆర్థిక సాయం.

  • అవసరమైతే మరిన్ని నిధులు.

  • విభజన చట్టం కింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు.

  • ఏటా 10 లక్షల మందికి విద్యారుణం.

  • విద్యా, నైపుణ్యాభివృద్ధికి రూ.1.48 లక్షల కోట్లు.

  • వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు.

  • మహిళల నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు.

  • కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి ఈపీఎఫ్‌ఓ పథకం.

  • ఈపీఎఫ్‌ఓ ద్వారా నగదు బదిలీ.

  • వర్కింగ్‌ ఉమెన్‌ హాస్టళ్ల ఏర్పాటు.

  • నాలుగు కోట్ల మందికి స్కిల్‌ పాలసీ.

  • ఈ బడ్జెట్‌లో వికసిత్‌ భారత్‌కు రోడ్‌మ్యాప్‌.

  • సమ్మిళిత అభివృద్ధికి పెద్దపేట.

  • యువతకు ఐదు ఉద్యోగ పథకాలు.

  • నాలుగు కోట్ల యువతకు ఉపాధి కల్పించేలా కృషి.

  • వ్యవసాయం డిజిటలైజేషన్‌ కోసం ప్రత్యేక కార్యక్రమం.

  • ఉద్యోగాల కల్పన, నైపుణ్యాల సృష్టి, సంస్థల ఏర్పాటుకు బడ్జెట్‌లో నిర్ణయాలు.

  • కూరగాయల ఉత్పత్తి, సరఫరాలకు ప్రత్యేక చర్యలు.

  • ప్రధానమంత్రి అన్నయోజన పథకాన్ని ఐదేళ్లు పొడిగించాం.

  • ప్రధానిగా నరేంద్రమోదీ మూడోసారి చరిత్రాత్మక విజయం సాధించారు.

  • ప్రజల ఆంకాక్షలు నెరవేర్చడంలో ఈ విజయం సాధ్యమైంది.

  • దేశవ్యాప్తంగా మద్దతు ధరలు పెంచాం.

  • అంతర్జాతీయ అనిశ్చితుల వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతున్నా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల స్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది: నిర్మలా సీతారామన్‌
  • పార్లమెంట్‌లో బడ్జెట్‌ 2024-25ను విడుదల చేయనున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ లోక్‌సభకు చేరుకున్నారు.

  • బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ పార్లమెంట్‌ చేరుకున్నారు.

  • బడ్జెట్ 2024-25 పత్రాలను ‘యూనియన్ బడ్జెట్’ మొబైల్ యాప్ ఉపయోగించి పొందవచ్చు. ఈ యాప్‌ను ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో లేదా యూనియన్ బడ్జెట్ వెబ్ పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ పత్రాలు ఇంగ్లీష్, హిందీలో అందుబాటులో ఉంటాయి.

  • బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తేదీ నుంచి దాన్ని అమలు చేయాలంటే 1-2 నెలల సమయం పడుతుంది. గతంలో మార్చి చివరి నాటికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. దాంతో అది జూన్‌ వరకు అమలు అయ్యేది. కానీ ప్రస్తుతం ఫిబ్రవరిలో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నారు. దాంతో ఏప్రిల్‌-మే వరకు అమలు అవుతుంది.

  • ఫిబ్రవరి 1, 2020లో జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో  రెండు గంటల నలభై నిమిషాలపాటు ప్రసంగించి సీతారామన్ రికార్డు నెలకొల్పారు.

  • మోడీ 3.0 మొదటి బడ్జెట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలిలో ఆమోదం లభించింది.

  • సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు. ఆమె వరుసగా ఏడో బడ్జెట్‌ను విడుదల చేస్తూ రికార్డు సృష్టించనున్నారు.

మరికాసేపట్లో కేంద్ర బడ్జెట్‌

  • మరో గంటలో పార్లమెంట్‌లో బడ్జెట్‌

  • స్వల్ప నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు  

  • మరికాసేపట్లో కేంద్ర కేబినెట్‌ భేటీ

  • బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్‌

  • ఎనిమిది నెలల కాలానికి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

  • వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా బడ్జెట్‌ ఉంటుదన్న ప్రధాని మోదీ

  • ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటుకు చేరుకున్నారు. పార్లమెంటు భవనంలోని ప్రవేశిస్తూ బడ్జెట్‌ ట్యాబ్‌ను ఆమె ప్రదర్శించారు. కొత్తగా ఏర్పడిన మోదీ ప్రభుత్వంలో తొలి బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్నారు.

 

  • పార్లమెంటులో ఈరోజు ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో రాష్ట్రపతి భవన్‌లో సమావేశమయ్యారు. తిరిగి పార్లమెంట్‌కు వెళ్లారు.

  • జమ్మూకశ్మీర్‌ బడ్జెట్ కాపీలు పార్లమెంటుకు చేరుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ జమ్మూకశ్మీర్ బడ్జెట్‌ 2024-25 అంచనా రశీదులను సమర్పిస్తారు.

  • నిర్మలా సీతారామన్ తన ‘బహి-ఖాతా’తో రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. గతంలో మాదిరిగానే ఆర్థిక మంత్రి సంప్రదాయ ‘బహి-ఖాతా’ రూపంలో ఉన్న టాబ్‌తోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

  • నిర్మలమ్మ ఈసారి మెజెంటా పట్టు బోర్డర్ ఉన్న తెల్లటి చీరను ధరించారు.

  • కొవిడ్‌ పరిణామాల తర్వాత స్టాక్ మార్కెట్‌లోని డెరివేటివ్స్ ట్రేడింగ్ భారీగా పెరిగింది. ప్రభుత్వం, రెగ్యులేటర్‌లు దీన్ని ప్రమాదకరంగా భావిస్తున్నాయి. ఈసారి బడ్జెట్‌లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం.

  • బడ్జెట్ 2024-25 ప్రకటన సందర్భంగా ఈరోజు స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.

  • దేశంలో అతిపెద్ద సిగరెట్ తయారీదారు ఐటీసీ కంపెనీపై 5–7 శాతం కంటే తక్కువ పన్ను విధించే అవకాశం ఉందని ‘జెఫ్రీస్’ అభిప్రాయపడుతుంది.

  • ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం రూ.1.08 లక్షల కోట్ల సబ్సిడీలను ప్రభుత్వం పంపిణీ చేసింది. వీటిని మరింత పెంచే అవకాశం ఉంది.

  • లోక్‌సభలో ఈరోజు ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమర్పించనున్న నిర్మలా సీతారామన్‌ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవడానికి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. రాష్ట్రపతి అనుమతి పొందిన తర్వాత తిరిగి పార్లమెంట్‌ను చేరుకుంటారు.

బడ్జెట్‌ను ఆవిష్కరించిన నిర్మలా సీతారామన్‌

  • ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బృందంతో కలిసి నార్త్ బ్లాక్‌లోని మంత్రిత్వ శాఖ వెలుపల బడ్జెట్‌ టాబ్‌ను ఆవిష్కరించారు. 

  • ఏడోసారి బడ్జెట్‌ ప్రవేశపెడుతున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌. బడ్జెట్‌లో కీలక ప్రకటనలు వచ్చే అవకాశం. 

  • నిర్మలా సీతారామన్‌ ఉదయం 11 గంటల సమయంలో నూతన పార్లమెంట్‌ భవనంలోని లోక్‌సభలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

  • కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు.

  • ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి చేరుకున్న ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్.

  • ఈజ్‌ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు రికాంత్ పిట్టి మాట్లాడుతూ..‘గత సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు దాదాపు 6.5% ఉంది. ఈసారి కూడా ఆర్థిక సర్వే 7% వృద్ధి రేటును సూచిస్తుంది. పర్యాటక రంగంలో చాలామంది ఉపాధి పొందుతున్నారు. ప్రజల సంప్రదాయాల విస్తరణకు ఈ రంగం వారధిగా ఉంటుంది. బడ్జెట్‌ 2024-25లో పర్యాటక రంగానికి ప్రోత్సాహకాలుంటాయని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.

  • ఈరోజు బడ్జెట్‌ సమావేశాల్లో జమ్ము కశ్వీర్‌ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెడుతారు.

వ్యవసాయం రంగం వృద్ధికి నిర్ణయాలు..?

ఆర్థికసర్వేలోని వివరాల ప్రకారం దేశాభివృద్ధికి తోడ్పడే వ్యవసాయం మరింత పుంజుకోవాలంటే వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచాలని నిపుణులు చెబుతున్నారు. ఈమేరకు బడ్జెట్‌లో నిర్ణయం వెలువడుతుందని ఆశిస్తున్నారు.

  • వ్యవసాయ పద్ధతుల్లో ఆధునిక నైపుణ్యాలను తీసుకురావాలని కోరుతున్నారు.

  • వ్యవసాయ మార్కెటింగ్ మార్గాలను మెరుగుపరచాలంటున్నారు.

  • పంట ఉత్పత్తుల ధరను స్థిరీకరించాలని చెబుతున్నారు.

  • వ్యవసాయంలో ఆవిష్కరణలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

  • ఎరువులు, నీటి వాడకంలో మార్పులు రావాలంటున్నారు.

  • వ్యవసాయ-పరిశ్రమ సంబంధాలను మెరుగుపరిచేలా నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.

ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ ప్రకటన

2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి కేంద్ర బడ్జెట్‌ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గత ఫిబ్రవరిలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టడం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలకు ఇది రికార్డు స్థాయిలో వరుసగా ఏడో బడ్జెట్‌ కావడం విశేషం. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా వివిధ రంగాలకు ప్రాధాన్యతల మేరకు నిధులు కేటాయింపులు చేయనున్నారు. 

  • సోమవారం విడుదల చేసిన ఎకనామిక్‌సర్వేలో ‘వికసిత్‌ భారత్‌’ కోసం ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు ప్రధాని మోదీ చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలు కలిసి పనిచేస్తే జీడీపీ వృద్ధి చెందుతుందన్నారు.

  • ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్లో నిర్మల ఎలాంటి కీలక నిర్ణయాలు ఏవీ చేయలేదు. ఈసారి నూతన పన్ను విధానంలో పన్ను మినహాయింపును ప్రస్తుత రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడంతో పాటు పాత విధానంలో మినహాయింపులను కూడా పెంచుతారని అంచనాలున్నాయి.

  • పాత పన్ను విధానానికే చాలామంది మొగ్గు చూపుతున్నందున వారిని కొత్త విధానానికి మారేలా ప్రోత్సహించేందుకు మరిన్ని పన్ను మినహాయింపులు వస్తాయని అంచనా. 80సీ కింద మినహాయింపు మొత్తం రూ.1.5 లక్షలను 2014 నుంచీ పెంచలేదు. ఈపీఎఫ్, పీపీఎఫ్, ఇంటి రుణాలు, జీవిత బీమా, ఈక్విటీ ఆధారిత సేవింగ్‌ పథకాల వంటివన్నీ దీని పరిధిలోకే వస్తాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement