కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రసంగంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్థిరాస్తి విక్రయంపై సూచిక(ఇండెక్సెషన్)ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. రియల్ ఎస్టేట్ విక్రయాలకు సంబంధించిన దీర్ఘకాలిక మూలధన లాభం (ఎల్‌టీసీజీ)పై పన్నును 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గిస్తున్నామని చెప్పారు. ఈ నిర్ణయంతో రియల్టీ ఇన్వెస్టర్లకు తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఇప్పటివరకు రియల్‌ఎస్టేట్ పెట్టుబడులపై ఇండెక్సేషన్‌ను సర్దుబాటు చేసి దానికి అనుగుణంగా ఆస్తి విక్రయం సమయంలో 20 శాతం పన్ను విధించేవారు. ఉదాహరణకు..20 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన స్థలాలను విక్రయించేపుడు ఆ ఇరవై ఏళ్లకు అనువుగా ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసి(ఇండెక్సెషన్), ఆ స్థలానికి ప్రభుత్వ విలువను లెక్కించి దానిపై 20 శాతం పన్ను విధించేవారు. కొత్త నిబంధనల ప్రకారం..ఇండెక్సెషన్‌ను పూర్తిగా తొలగించారు. మార్కెట్ విలువ ప్రకారం స్థలాన్ని విక్రయిస్తే దానిపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు జులై 23, 2024 నుంచే అమల్లోకి వస్తాయని కేంద్రమంత్రి చెప్పారు.
ఇదీ చదవండి: క్లీన్ ఎనర్జీకి బడ్జెట్‌లో ప్రతిపాదనలు.. ఎవరికి లాభమంటే..
ప్రస్తుత ఆస్తిని విక్రయించి, కొత్త దానిపై తిరిగి పెట్టుబడి పెట్టే వారికి కేంద్ర నిర్ణయం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రియల్టీ రంగం ఏటా చెందుతున్న అభివృద్ధి సూచీ ప్రకారం ఐదేళ్ల కంటే తక్కువ కాలవ్యవధితో ఇన్వెస్ట్ చేసే పెట్టుబడిదారులకు ప్రభుత్వ నిర్ణయం ప్రతికూలంగా ఉంటుందని నిపుణులు విశ్వసిస్తున్నారు. ఇదిలాఉండగా, కొత్త నిబంధనలు తక్షణం అమలులోకి వచ్చినప్పటికీ 2001కి ముందు ఉన్న పాత ఆస్తులకు ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment