Central Financial Ministry Released The List of States Debt 2022 - Sakshi
Sakshi News home page

State Wise Debt in India 2022: రాష్ట్రాల అప్పుల చిట్టా విప్పిన కేంద్రం.. టాప్‌లో తమిళనాడు, తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇలాగ..

Published Mon, Dec 19 2022 6:51 PM | Last Updated on Mon, Dec 19 2022 7:57 PM

The center Financial Ministry released the list of states debts 2022 - Sakshi

సాక్షి, ఢిల్లీ:  దేశంలో వివిధ రాష్ట్రాల అప్పుల జాబితాపై ఓ స్పష్టత వచ్చింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో భాగంగా.. లోక్‌ సభలో సోమవారం రాష్ట్రాల అప్పులపై టీఆర్ఎస్ ఎంపీలు లిఖితపూర్వక ప్రశ్న సంధించారు. దీనికి స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ(సహాయ) మంత్రి పంకజ్ చౌదరి.. రాష్ట్రాల అప్పుల వివరాలను వెల్లడించారు. 

దేశంలో అప్పుల్లో తమిళనాడు రాష్ట్రం నెంబర్ వన్‌గా ఉంది. 2022 నాటికి తమిళనాడు అప్పు రూ. 6,59,868 కోట్లుగా తేలింది. రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్ అప్పు రూ. 6,53,307 కోట్లు, మూడో స్థానంలో మహారాష్ట్ర అప్పు రూ. 6,08,999 కోట్లు, నాలుగో స్థానంలో పశ్చిమబెంగాల్ అప్పు రూ. 5,62, 697 కోట్లుగా తేలింది. ఇక ఐదో స్థానంలో రాజస్థాన్ అప్పు రూ. 4,77,177 కోట్ల రూపాయలుగా ఆర్థిక శాఖ ప్రకటించింది.  ఆరో స్థానంలో కర్ణాటక అప్పు రూ. 4,61,832 కోట్లతో నిలిచింది. ఏడు స్థానంలో గుజరాత్ అప్పు రూ. 4,02,785 కోట్లుగా ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. అప్పుల్లో 8వ స్థానంలో ఆంధ్రప్రదేశ్‌, 11వ స్థానంలో తెలంగాణ నిలిచాయి. ఏపీ అప్పు రూ. 3,98,903 కోట్ల రూపాయలు, తెలంగాణ అప్పు రూ. 3,12,191 కోట్ల రూపాయలుగా తెలిపింది కేంద్రం. ఏపీ అప్పుల పెరుగుదల 10.7 శాతంతో దేశంలో 15వ స్థానంలో నిలవగా.. తెలంగాణ మాత్రం 16.7 శాతంతో అప్పుల పెరుగుదలలో దేశంలో ఆరో స్థానంలో నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement