![YSRCP MPs Going To Delhi For Parliamentary Sessions - Sakshi](/styles/webp/s3/article_images/2019/11/18/ysrcp.jpg.webp?itok=36QIp17A)
సాక్షి, విశాఖపట్నం : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏపీ నుంచి అయిదుగురు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు దేశ రాజధాని ఢిల్లీకి పయనమయ్యారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయలుదేరిన అనంతపురం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, కాకినాడ ఎంపీ వంగా గీత, కర్నూల్ ఎంపీ డా.సంజీవ్ కుమార్‌లకు పార్టీ శ్రేణులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పార్లమెంటులో పలు విషయాలపై ఎంపీలు గళమెత్తనున్నారు.
వారు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా సాధన, పోలవరం నిధుల కేటాయింపు, ఆయా పార్లమెంట్ పరిధిలలో అభివృద్ధికి కేంద్రం నుంచి రాబట్టేలా గళం విప్పుతామని వెఎస్సార్సీపీ ఎంపీలు స్పష్టం చేశారు. అలాగే తమ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర సమస్యలను గట్టిగా ప్రస్తావిస్తామని ఎంపీలు పేర్కొన్నారు. కాగా వచ్చే నెల 23 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment