
న్యూఢిల్లీ: దేశంలో 2012–2021 సంవత్సరాల మధ్య సంభవించిన వరదలు, భారీ వర్షాలతో 17,422 మంది చనిపోయినట్లు కేంద్రం తెలిపింది. సోమవారం రాజ్యసభలో జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వర్ తుడు ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానంగా ఈ వివరాలను ఆయన వెల్లడించారు.
అతి తక్కువ సమయంలో అతి భారీ వర్షాలు కురియడమే పట్టణ ప్రాంతాల్లో వరదలకు ప్రధాన కారణమన్నారు. ఆక్రమణలకు గురైన సహజ నీటి వనరులు, విచ్చలవిడిగా నిర్మాణాలు, నాణ్యతలేని మురుగు వ్యవస్థ వంటివి సమస్యను మరింత పెంచుతున్నాయని వివరించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2012–21 సంవత్సరాల కాలంలో వర్షాలు, వరదలతో పంటలు, నివాసాలు, ఇతరాలకు కలిపి మొత్తం రూ.2.76 లక్షల కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు.