
సాక్షి, విశాఖపట్నం : విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు నిర్ణయంతో ఉత్తారంధ్ర అభివృద్ధికి భీజం పడిందని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు పేర్కొన్నారు. రాష్ట్ర విభజనతో హైదరాబాద్‌కు దూరమై అన్ని రకాలుగా కొత్త రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఆయన వెల్లడించారు. చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో రాజధాని పేరిట కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారని విమర్శించారు. గత ఐదేళ్ల కాలంలో చంద్రబాబు రాజధానిలో ఒక్క శాశ్వత నిర్మాణాన్ని కూడా చేపట్టలేకపోయారని తెలిపారు. అమరావతి పేరిట గ్రాఫిక్‌లు చూపించి బాబు రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేశారని దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment