సాక్షి, అనకాపల్లి జిల్లా: అనకాపల్లి జిల్లాకు పులి టెన్షన్ మొదలైంది. కాకినాడ జిల్లా నుంచి అనకాపల్లి జిల్లాలోకి పులి ప్రవేశించింది. నక్కపల్లి మండలం తిరుపతిపాలెం దగ్గర పులి అడుగుజాడలు గుర్తించారు. తటపర్తి దగ్గర గేదెపై పులి దాడి చేసింది. పులి సంచారంతో పాయకరావుపేట పరిధిలోని శ్రీరామపురం, తిరుపతిపాలెం, తడపర్తి, వెంకటాపురం గ్రామాల్లో ఆందోళన నెలకొంది. దీంతో గ్రామస్తులను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు.
చదవండి: మీ బ్యాంకు ఖాతాలో నగదు జమ కావడం లేదా..? కారణం ఇదే..
కాగా, సోమవారం రాత్రి 8 గంటల సమయంలో కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలోవ సమీపంలోని కుచ్చులకొండ నుంచి తాండవ నది పరివాహక ప్రాంతానికి వెళుతూ తుని-కొట్టాం రోడ్డుపై పులి చేరుకున్నట్లు సమాచారం. అదే సమయంలో బెండపూడి నుంచి రొయ్యల ఫ్యాక్టరీ బస్సులో ఇళ్లకు వెళుతున్న కార్మికులు దీనిని గుర్తించారు. బస్సు లైట్ల కాంతికి కొంతసేపు పులి రహదారిపైనే ఉన్నట్లు వీరు తెలిపారు. తర్వాత తాండవ నదిలోకి దిగేందుకు మార్గం కనిపించకపోవడంతో కుచ్చులకొండపైకి వెళ్లినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment