పాయకరావుపేట సీటు దక్కదనే అపనమ్మకం ఆమెలో పెరుగుతోందా? వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం తనకు మొండి చేయి చూపిస్తుందని భావిస్తున్నారా? సీటును కాపాడుకునే ప్రయత్నంలో చంద్రబాబునే బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారా? టీడీపీ కార్యకర్తల మెడలో కండువాలు వేసి వారంతా వైసీపీ కార్యకర్తలేనని పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీనే నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా?
తెలుగుదేశంపార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పరిస్థితి పైన పల్లకి మోతా.. ఇంట్లో ఈగల మోతలా తయారయిందా అని ప్రశ్న వేసుకుంటే అవుననే సమాధానం వస్తోంది.. ఎందుకంటే పాయకరావుపేట నియోజక వర్గంలో ఆమెకు ఎదురువుతున్న పరిస్థితులే అందుకు కారణమని తెలుస్తోంది.. వంగలపూడి అనిత పేరుకు టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా చెప్పుకుంటుంది కానీ.. ఆమెకు మాత్రం నియోజకవర్గంలో గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.
అనిత ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి నియోజకవర్గంలో ఉన్న అసమ్మతి ఇప్పటికి అదే విధంగా ఉంది అంటే ఆమె నాయకత్వంపట్ల నియోజవర్గంలో ఎలాంటి విశ్వసనీయత వుందో సులువుగా అర్థమవుతుంది. ఆమెకు ఈ సారి ఎన్నికల్లో పాయకరావుపేట సీటు ఇస్తే వచ్చే ఓడించి తీరుతామని అనిత వ్యతిరేక వర్గీయులు శపథం చేస్తున్నారు..
టీడీపీ ముద్దు.. అనిత వద్దు అంటూ గతంలో అనితకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ర్యాలీలు సభలు నిరసనలు సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో అనితకు నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని 2019 ఎన్నికల్లో అనితను కొవ్వూరు నియోజకవర్గానికి మార్చారు. అక్కడ ఆమె తానేటి వనిత చేతిలో ఓడిపోయి తిరుగుముఖం పట్టారు. ఎన్నికల తర్వాత అనిత మళ్లి పాయకరావుపేటకు వచ్చారు..
వంగలపూడి అనిత మీద పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ క్యాడర్‌లో ఉన్న అసంతృప్తి జ్వాలలు ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో ఆమెను మరొకసారి.. ఈ వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గం మారుస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.. లేదా టీడీపీ జనసేన పొత్తు ఉంటే పోత్తులో భాగంగా పాయకరావుపేట సీటును జనసేనకు కేటాయిస్తారని చర్చ నడుస్తోంది.
చదవండి: అయ్యన్న ఆశ అదేనట.. అడ్డు పడుతోందెవరు..?
ఇటువంటి వ్యతిరేక పరిస్థితుల్లో పాయకరావుపేట నియోజకవర్గంలో తాను బలంగా ఉన్నానని అధిష్టానానికి చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది అనిత. అయితే ఇందుకోసం ఆమె అనుసరిస్తున్న మార్గమే విమర్శలపాలవుతోంది.. పార్టీ క్యాడర్ కు నిత్యం అందుబాటులో ఉండి, ప్రజల సమస్యల మీద పోరాటం చేసి తాను బలంగా ఉన్నానని ఆమె చెప్పుకుంటే పరవాలేదు.. కానీ ఆమె అలా చేయడంలేదు.. వంగలపూడి అనిత ఈ మధ్యకాలంలో చేసిన ఒక కార్యక్రమం పట్ల సొంత పార్టీ నేతలే చీత్కరించుకుంటున్నారు. ఇంతకీ అనిత చేసిన ఆ పని ఏమిటో ఒకసారి చూద్దాం..
తెలుగుదేశం పార్టీలో ఉన్న పదిమందిని తీసుకువచ్చి వారంతా వైఎస్సార్సీపీ కార్యకర్తలేనని నమ్మబలికింది. వారి మెడలో కండువాలు వేసి వారంతా వైఎస్ఆర్సిపి కార్యకర్తలే టీడీపీలో చేరుతున్నారంటూ సభ ఏర్పాటు చేసింది.. వాస్తవంగా వారంతా తెలుగుదేశం పార్టీలో వున్నవారే.. వారు మొన్నటిమొన్న చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగాను ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు నిర్వహించారు. అటువంటి వారిని తీసుకువచ్చి వారంతా వైఎస్సార్సీపీ కార్యకర్తలు అంటూ అటు టీడీపీ అధిష్టానాన్ని ఇటు నియోజకవర్గ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు వనిత. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు.
చదవండి: చంద్రబాబును భయపెడుతోంది ఇదే..!
అనిత చేసిన మోసం ఎంతో కాలం నిలవలేదు. సాక్ష్యాలతో సహా వైఎస్సార్‌సీపీ నాయకులు బట్టబయలు చేశారు. భాస్కర్ చౌదరి అనే టీడీపీ నాయకునితో పాటు కొంతమంది కార్యకర్తలు ఈ మధ్యనే టీడీపీ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఫోటోలు మీడియా ముందు విడుదల చేశారు.. ఓ పదిమంది టీడీపీ నేతలను తీసుకువచ్చి వారందరికీ కండువాలు వేసి వారిని వైఎస్సార్సీపీ నేతలుగా ప్రచారం చేసుకోవడాన్ని తప్పుపట్టారు. ప్రజా సేవ చేసి ప్రజల మనసు గెలవాలి గాని టీడీపీ నాయకులకు, కార్యకర్తలకే కండువా లేసి వారిని వైఎస్సార్సీపీ నేతలుగా చిత్రీకరించడం తగదంటూ వంగలపూడి అనితకు హితవు పలికారు.
వంగలపూడి అనిత ప్లాన్ చేసిన ఈ నిర్వాకాన్ని ముందుగానే గ్రహించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, యనమల కృష్ణుడు ఆమె నిర్వహించిన బహిరంగ సభకు రాకుండా గైర్హాజయ్యారు. ఈ నేపథ్యంలో అసలు విషయం బయట పడడంతో అనిత నవ్వుల పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment