Payakaraopet Assembly Constituency
-
నేడు సీఎం జగన్ ప్రచార సభలు ఇలా..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం ఆయన విడుదల చేశారు.ఆ వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 10 గంటలకు విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని బొబ్బిలిలో ఉన్న మెయిన్ రోడ్ సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పాయకరావుపేటలోని సూర్య మహల్ సెంటర్లో జరిగే సభలో.. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. -
రాజ్యసభలోనూ ఉత్తరాంధ్రకే పెద్దపీట
సాక్షి విశాఖపట్నం: ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మరోసారి ఉత్తరాంధ్ర పక్షపాతి అని నిరూపించారు. రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైతే అందులో రెండు ఉత్తరాంధ్రకే అవకాశం కల్పించారు. వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావును రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటించారు. దీనిపై ఉత్తరాంధ్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి.. వైవీ సుబ్బారెడ్డిది ప్రకాశం జిల్లా మేదరమెట్ల. తల్లిదండ్రులు ఎర్రం చిన్నపోలిరెడ్డి, పిచ్చమ్మ. షోలాపూర్‌లో భారతీ విద్యాపీఠ్్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎంబీఎ(మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్) పూర్తి చేసారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించి 16వ లోక్‌సభలో అడుగుపెట్టారు. పరిశ్రమల స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా, ప్రైవేట్ బిల్లుల, తీర్మానాల కమిటీలో సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకాల(ఎంపీ ల్యాడ్స్) కమిటీ, ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కాన్సులేటివ్ కమిటీలో సభ్యుడిగా పనిచేశారు. ప్రత్యేక హోదా కోసం 2018లో లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2019 నుంచి 2023 వరకు రెండు పర్యాయాలు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్పీకరించారు. వైఎస్సార్ సీపీలోనూ పలు పదవులు నిర్వర్తించారు. గతంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నారు. విశ్వసనీయతకు గుర్తింపు విధేయత, విశ్వసనీయతకు గుర్తింపుగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. గ్రూప్–1 అధికారిగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించిన బాబూరావు మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పాయకరావుపేట అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు. అక్కడ ముప్పై ఏళ్ల టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టి తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురు వేశారు. కొద్ది నెలలకే వైఎస్సార్ దుర్మరణం పాలవ్వడంతో తదనంతర పరిణామాల్లో జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీని స్థాపించారు. జిల్లాలో బాబూరావు ఒక్కరే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో తిరిగి పాయకరావుపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. వై.వి.సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావుకు అవకాశం -
జనసేన నేతల నిలదీత.. తలదించుకున్న నాగబాబు!
సాక్షి, అనకాపల్లి: టీడీపీ జెండా ఇంకా ఎన్నాళ్లు మోయాలి, సైకిల్‌ను భరించడం మావల్లకాదు.. అంటూ జనసేన నేతలు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబుకి షాక్ ఇచ్చారు. ఈ దఫా పాయకరావుపేట అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించాలని.. ఇవ్వకుంటే ఎన్నికల ప్రచారంలో సహాయ నిరాకరణ చేపడతామని అల్టిమేటం జారీ చేశారు. పాయకరావుపేటలో మరోసారి జనసేన టీడీపీ సీటు వివాదం రాజుకుంది. బుధవారం ఆ నియోజకవర్గంలో జనసేన నాయకులతో నాగబాబు సమావేశం అయ్యారు. ఆ సందర్భంలో.. టీడీపీ పొత్తులో భాగంగా పాయకరావుపేట సీటు జనసేనకే కేటాయించాలని జనసేన నేతలు కోరారు. ‘‘గతంలో జనసేన మద్దతుతో నెగ్గిన అనిత.. అనేక కేసులతో మమ్మల్ని వేధించారు. జనసేనకు సీటు ఇవ్వకపోతే ఈసారి ఎన్నికల్లో టీడీపీకి ఎంతమాత్రం సహకరించేది లేదు’’ అని స్పష్టం చేశారు. దీంతో నాగబాబు మౌనంగా ఫోన్ చూస్తూ ఉండిపోయారు. 2014లో టీడీపీ అభ్యర్థి అనిత.. జనసేన పార్టీ మద్దతుతో గెలిచారని... ఇబ్బంది పెట్టారని.. మళ్లీ అనితకే టికెట్ ఇచ్చి కలిసి పనిచేయాలంటే కష్టమని మొదటి నుంచి జనసేన నాయకులు చెబుతున్నారు. పొత్తులో భాగంగా టీడీపీకే ఆ సీటు ఇవ్వాల్సి వస్తే మాత్రం తాము పని చేయమని ఖరాకండిగా చెబుతూ వస్తున్నారు. అయితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం అసంతృప్తిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఏపీ రాజకీయాల్లో ఇంకా పొత్తు మాత్రం పొడవడం లేదు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో జనసేన-టీడీపీలో సీట్ల లొల్లి నడుస్తోంది. మరోవైపు చర్చల పేరిట టైం పాస్ చేస్తూ వస్తున్న జనసేనాని.. టీడీపీ నుంచి ఎన్ని స్థానాల్లో పోటీ? అనే అంశంపై స్పష్టమైన హామీ పొందలేక పోవడంపైనా ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి.. తీవ్రంగా అవమానించిన టీడీపీతో కలిసి నడవడం ఇబ్బందిగా అనిపిస్తోందంటూ పలువురు నేతలు పవన్ దగ్గర ఏకరువు పెడుతున్నా.. ఆయన మాత్రం కలిసి నడవాల్సిందేనని.. టీడీపీ జెండా మోయాల్సిందేనని చెబుతుండడం గమనార్హం. -
జనసేనలో వర్గపోరు
నక్కపల్లి: పాయకరావుపేట నియోజకవర్గ జనసేనలో వర్గపోరు మొదలయింది. పొత్తులో భాగంగా పాయకరావుపేట టికెట్ జనసేనకు కేటాయించడంతోపాటు అభ్యర్థిగా బోడపాటి శివదత్‌ను ప్రకటించాలని ఆ వర్గం నాయకులు మంగళవారం నక్కపల్లి పార్టీ కార్యాలయం వద్ద పత్రికా సమావేశంలో డిమాండ్ చేశారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆకేటి గోవిందరావు, సహాయ కార్యదర్శి కురందాసు అప్పలరాజు మాట్లాడుతూ.. గత ఆరేడు సంవత్సరాల నుంచి శివదత్ నియోజకవర్గంలో చురుకై న పాత్ర పోషిస్తూ పార్టీ తరపున అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారని అన్నారు. ఆయనకు కాకుండా, ఇప్పటికిప్పుడు పార్టీలో చేరి టికెట్ తమకే ఇవ్వాలని కోరే లక్ష్మీ శివకుమారికి తాము మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని తెగేసి చెప్పారు. మరోపక్క నియోజకవర్గ ఇన్చార్జ్ గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి జనసేనలో చేరి టికెట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గెడ్డం బుజ్జి తమ పార్టీ అభ్యర్థిగా లక్ష్మీ శివకుమారిని తెరమీదకు తీసుకురావడంతోపాటు, ఆమెను నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోను కార్యకర్తలకు పరిచయం చేస్తున్నారు. జనసేన పార్టీలో రెండు వర్గాలు తయారైన నేపథ్యంలో దీనిని అవకాశంగా తీసుకుని టీడీపీ ఆ పార్టీలో కుంపటి రాజేసింది. బోడపాటి శివదత్ వర్గాన్ని తమ వైపునకు తిప్పుకున్నారు. ఇస్తే టికెట్ తమకు ఇవ్వాలని, కాని పక్షంలో టీడీపీకి ఇవ్వాలని శివదత్ వర్గం మాట్లాడుతున్నారు. జనసేనలోని రెండు వర్గాలు వేర్వేరు అభ్యర్థులను ప్రతిపాదిస్తే.. ఈ కుమ్ములాటల వల్ల టీడీపీకే టికెట్ కేటాయిస్తారన్న ఎత్తుగడలో భాగంగానే జనసేనలో రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టి వర్గపోరుకు పరోక్షంగా సహకరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఉచ్చులో చిక్కుకుంటే ఈ దఫా కూడా మళ్లీ జెండా కూలీలుగానే మిగిలిపోవాల్సి వస్తుందని జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పాయకరావుపేట టికెట్ జనసేనకే.. అనిత పరిస్థితి ఏంటి..!
అనకాపల్లి: టీడీపీ జెండా ఎన్నాళ్లు మోయాలి, సైకిల్‌ను భరించడం మావల్లకాదు ఈ దఫా పాయకరావుపేట అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించాలని పలువురు ఆశావహులు పార్టీ సీనియర్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యరి్థగా ప్రచారం అవుతున్న అనితకు మద్దతు ఇచ్చి మళ్లీ కేసుల్లో ఇరుక్కుని ఇబ్బంది పడలేమంటూ వారు శనివారం పాయకరావుపేటలో జరిగిన సమావేశంలోపార్టీ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబుకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో నాలుగు మండలాల నుంచి జన సమీకరణ చేసి, బలప్రదర్శన చేశారు. కేవలం పాయకరావుపేట టికెట్ జనసేనకు కేటాయించాలన్న ప్రధాన ఎజెండాతోనే ఈ సమావేశం నిర్వహించారు. జనసేననుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్సీ లక్ష్మి శివకుమారి, బోడపాటి శివదత్, పెద్దాడ వెంకటరమణ మాట్లాడుతూ ఇప్పటివరకు జనసేన పార్టీ టీడీపీకి మద్దతు ఇచ్చిందన్నారు. ఇకనైనా నియోజకవర్గ టికెట్ జనసేనకు కేటాయించాలని కోరారు. పార్టీరాష్ట్రకార్యదర్శి, సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి మాట్లాడుతూ 2014లో టీడీపీ అభ్యర్థి అనిత.. జనసేన పార్టీ మద్దతుతో గెలిచి, తర్వాత జనసేన నాయకులు, కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. మళ్లీ అనితకే టికెట్ ఇచ్చి కలిసి పనిచేయాలంటే కష్టమని తెలిపారు. పొత్తులో భాగంగా తప్పనిసరి పరిస్థితిలో పాయకరావుపేట టికెట్ టీడీపీకే ఇవ్వదలిస్తే అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. అనితకు టికెట్ ఇస్తే మాత్రం కలిసి పనిచేసే ప్రసక్తే లేదని తెలిపారు. జనసేన కార్యకర్తల అభ్యర్థనను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు హమీ ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పాయకరావుపేట టికెట్ ఆశిస్తున్న జనసేన నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీకుమారి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోను పర్యటిస్తున్నారు. గ్రామాల్లో జరిగే సమావేశాలు, కార్యక్రమాలలోను జనసేన నాయకులు మాత్రమే పాల్గొంటున్నారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారు. -
వంగలపూడి అనిత వల్లే పార్టీ సర్వనాశనం
నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి ఎదురైంది. పాయకరావుపేట మండలానికి చెందిన పలువురు టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు అనితకు వ్యతిరేకంగా ఆదివారం సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు సీటు ఇస్తే ఓడిపోవడం ఖాయమని తేల్చిచెప్పారు. అనిత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇళ్ల లబ్ధిదారుల నుంచి రూ.30 వేల చొప్పున, పింఛన్ కావాలని వచ్చేవారి నుంచి రూ.5 వేల చొప్పున వసూళ్లకు పాల్పడ్డారని మండిపడ్డారు. జడ్పీ కోఆప్షన్ సభ్యుడి పదవిని కూడా అమ్ముకున్నారని ఆరోపించారు. అనిత వల్లే పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ సర్వనాశనౖమెందన్నారు.ఆమె వచ్చాకే పార్టీలో ఆరు గ్రూపులు తయారయ్యాయని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అనిత, ఆమె అనుచరులు చేసిన అవినీతిని ప్రశ్నించినందుకు తమపై కక్షకట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును తాము కలవడంతో కక్ష గట్టి వేధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆదేశాలను కూడా అనిత పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆమె మాటలు విని తమను సస్పెండ్ చేసిన అచ్చెన్నాయుడుపైనా నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాయకరావుపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు, తాపీమేస్త్రీల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మజ్జూరి నారాయణరావు, పార్టీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు గొర్లె రాజబాబు, సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షుడు దేవవరపు ఆనంద్, మాజీ సర్పంచ్‌లు డి.ఆనంద్, కలిగొట్ల శ్రీను, సుంకర సూరిబాబు, గొల్లపల్లి నాగు, తలారి రాజా, భజంత్రీల శివ, చొక్కా శ్రీను, శ్రీనివాసరెడ్డి, కోడూరి నూకరాజు, థామస్, పడాల కోటి, నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
పొత్తు పొడవకముందే టీడీపీ-జనసేన మధ్య విభేదాలు
అనకాపల్లి: ఆ సీటు మాదే అంటే మాదే అంటున్నారు టీడీపీ-జనసేన నేతలు. ఇంకా పొత్తు పొడవకముందే సీట్ల పంపకం మొదలుపెట్టేశారు. ఈ క్రమంలోనే టీడీపీ-జనసేన నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో టీడీపీ-జనసేన మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి జనసేన నేతలు సమావేశం కాగా, అక్కడ సీటు తమకే కేటాయించాలని జనసేన స్వరం పెంచింది. అక్కడ టీడీపీకి సీటు ఇస్తే తాము సహకరించమని తేల్చిచెబుతున్నారు జనసేన నేతలు. అనితకి సీటు ఇస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ సహకరించమని తెగేసి చెబుతున్నారు జనసేన నేతలు. గతంలో అనితను ఎమ్మెల్యేని చేస్తే తమపై తప్పుడు కేసులు బనాయించారని జనసేన నేతలు కుండ బద్ధలు కొట్టారు. దాంతో అనితకు సీటు ఇస్తే ఎట్టిపరిస్థితుల్తోనూ టీడీపీ సహకరించమని అంటున్నారు. అనితకు సీటు ఇస్తే ఓడించే తీరుతామని ప్రతిన పూనారు జనసేన నేతలు.. అందుకు సంబంధంచి తీర్మానం కూడా చేశారు.