రైతులను వైఎస్‌ఆర్ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని, మీకు నేను అండగా ఉన్నానని ప్రతి రైతుకూ భరోసా కల్పించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో శనివారం సాయంత్రం నిర్వహించిన సమైక్య శంఖారావం సభలో ఆమె ప్రసంగించారు. వైఎస్ పావలా వడ్డీలకే రుణాలు ఇచ్చారని, విద్యార్థుల గురించి ఓ తండ్రిలా వైఎస్ ఆలోచించారని అన్నారు. ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుందని భరోసా కల్పించారని తెలిపారు. పేదవాడు కార్పొరేట్ ఆస్పత్రి వైద్యం పొందాలని ఆరోగ్యశ్రీ పెట్టారని గుర్తు చేశారు. తన హయాంలో వైఎస్ ఏనాడూ ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచలేదని, గ్యాస్, ఆర్టీసీ, విద్యుత్‌పై ఒక్క రూపాయి కూడా వైఎస్ పెంచలేదని కానీ. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమాన్ని పాడె కట్టిందని, చేసిన పాపాలు సరిపోలేదని అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి చలికాచుకుంటోందని మండిపడ్డారు. ఇప్పుడు హఠాత్తుగా ఇంకో రాష్ట్రం వస్తే సీమాంధ్ర రైతాంగం ఏమైపోవాలని ఆమె ప్రశ్నించారు. ఇంకో రాష్ట్రం వస్తే పోలవరం ప్రాజెక్టును ఏం నీళ్లతో నింపుతారు, హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్రుల పాత్ర లేదా అని నిలదీశారు. హైదరాబాద్ అభివృద్ధికి 60 ఏళ్లు పట్టిందని, ఇంకో రాష్ట్రం అభివృద్ధి చేయాలంటే పదేళ్లు సరిపోతుందా? అని నిలదీశారు. వీటన్నింటిపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని.. మన కర్మకొద్దీ పాలకపక్షం ఇలా ఏడిస్తే, ప్రధాన ప్రతిపక్షం కూడా అలాగే ఉందని.. ఇంతిలా జరుగుతున్నా చంద్రబాబు గుడ్లప్పగించి చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజనకు కారణం చంద్రబాబేనని విమర్శించారు. తెలంగాణపై ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోండని చంద్రబాబును తాము పదేపదే అడుగుతూనే ఉన్నామని, ఆయన తాను చేసిన తప్పును ఒప్పుకుని చెంపలేసుకుని కోట్లాదిమందికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పాలకపక్షంతోనే కుమ్మక్కై రాష్ట్ర విభజనకు మద్దతు పలుకుతున్నాడంటే అసలు చంద్రబాబును ప్రతిపక్ష నాయకుడనాలా? దుర్మార్గుడనాలా అని నిలదీశారు.
Published Sat, Sep 14 2013 7:31 PM | Last Updated on Thu, Mar 21 2024 9:11 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement