రాష్ట్రంలో పులిలా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) ముందు ఎందుకు పిల్లిలా మారిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు ప్రశ్నించారు.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలు చేయడం సీఎం దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన అన్నారు. వైఎస్ హయాంలోనే రాష్ట్రంలో సమగ్రాభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రులు చాలా మంది రాష్ట్రాన్ని ఏలినా ఎందుకు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయారని ప్రశ్నించారు.
విశాఖలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయం చేస్తున్నారని వైఎస్ఆర్‌సీపీ నగర కన్వీనర్ వంశీకృష్ణ ఆరోపించారు. అన్ని వర్గాలను కలుపుకొని రాజకీయేతర ఐక్యకార్యాచరణ వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
దిగజారుడు విమర్శలు చేస్తున్న సీఎం: బాబూరావు
Published Fri, Aug 9 2013 7:05 PM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement
Advertisement