ముఖ్యమంత్రి వాహనంపై పూలు చల్లుతున్న అభిమానులు
పటాన్‌చెరు: మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ఆదేశాల మేరకు పటాన్‌చెరులో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. నియోజకవర్గ కేంద్రంలో పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు కేసీఆర్ కాన్వాయ్‌పై పూలు చల్లి తమ అభిమానం చాటుకున్నారు. అయితే, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయనతో కలిసి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మహారాష్ట్ర పర్యటన వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్న నినాదంతో ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను భారత రాష్ట్ర సమితిగా మార్చారని గుర్తుచేశారు.
రైతాంగానికి అండగా నిలవాలన్న ఉన్నత లక్ష్యంతో సీఎం కేసీఆర్ దేశవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ను విస్తరిస్తున్నారన్నా రు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్టాభివద్ధికి పెనుముప్పుగా మారిన ప్రతిపక్ష పార్టీలకు తెలంగాణలో స్థానం లేదని, వచ్చే ఎన్నిక ల్లో వారికి డిపాజిట్లు సైతం దక్కే పరిస్థితులు లేవని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్‌రెడ్డి, పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు అఫ్జల్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
జహీరాబాద్: సీఎం కాన్వాయ్ సోమవారం మధ్యాహ్నం 12.15 గంటలకు మండలకేంద్రానికి చేరుకుంది. కాగా హుగ్గెల్లి క్రాస్‌రోడ్డు వద్ద ఎంఆర్‌ఎఫ్ కార్మిక సంఘం అధ్యక్షుడు ఎంజీ రాములు ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు సీఎం వాహనంపై పూలు చల్లి స్వాగతం పలికారు. సీఎం తన వాహనంలో నుంచే అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. రాష్ట్ర సరిహద్దు వద్ద కలెక్టర్ శరత్, ఎస్పీ రమణకుమార్, డీఎస్పీ రఘు, సీఐ భూపతి ఈ పర్యటనను పర్యవేక్షించారు. 65వ జాతీయ రహదారి పొడుగునా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సీఎం కాన్వాయ్ రహదారిపై ఎక్కడా ఆగకుండా కర్ణాటకలోకి ప్రవేశించింది.
Comments
Please login to add a commentAdd a comment