సీఎం కాన్వాయ్‌లోకి చొరబడ్డ యువకులు | youth intrude into cm convoy | Sakshi
Sakshi News home page

సీఎం కాన్వాయ్‌లోకి చొరబడ్డ యువకులు

Published Sat, Jun 17 2017 8:15 PM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM

సీఎం కాన్వాయ్‌లోకి చొరబడ్డ యువకులు

సీఎం కాన్వాయ్‌లోకి చొరబడ్డ యువకులు

టీనగర్‌: సీఎం కాన్వాయ్‌లోకి చొరబడ్డ యువకులు నలుగురిని పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. చెన్నై రాజా అన్నామలైపురంలో మంత్రుల నివాసగృహాలు ఉన్నాయి. ఇక్కడ సీఎం ఎడపాడి పళనిస్వామి కుటుంబం నివసిస్తోంది. శనివారం ఉదయం సచివాలయానికి వెళ్లేందుకు సీఎం ఎడపాడి బయలుదేరారు.

ఆ సమయంలో సీఎం కారుకు ముందు, వెనుక భద్రతా వాహనాలు బారులుతీరాయి. సీఎం వాహనం కామరాజర్‌ రోడ్డులో వస్తుండగా రెండు బైక్‌ల్లో వచ్చిన నలుగురు యువకులు సీఎం కాన్వాయ్‌లోకి చొరబడ్డారు. దీంతో వెంటనే దిగ్భ్రాంతి చెందిన పోలీసులు యువకులను అరెస్టు చేసి అన్నాస్క్వేర్‌ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. విచారణలో వారు పల్లికరనైకు చెందిన శ్రీనివాస్‌, అతని స్నేహితులని తెలిసింది. వీరు విద్రోహచర్యకు పాల్పడేందుకు ప్రయత్నించారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement