Updates.
►ముఖ్యమంత్రి మహారాష్ట్రలో అడుగుపెట్టారు. సోమవారం సాయంత్రం సోలాపూర్‌కు చేరుకున్నారు. కాగా రెండు రోజుల మహారాష్ట్ర పర్యటన కోసం ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో రెండు ప్రత్యేక బస్సులు, భారీ కార్ల కాన్వాయ్‌తో బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రికి బీఆర్‌ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ రాత్రి సోలాపూర్‌లోనే రాత్రి బస చేయనున్నారు.
►మంగళవారం ఉదయం స్థానికంగా అధిక సంఖ్యలో ఉండే తెలుగు ప్రజలతో పాటు వివిధ రంగాలు, వర్గాలకు చెందిన ప్రతినిధులతో కేసీఆర్ భేటీ అవుతారు. అనంతరం పండరీపూర్ పట్టణానికి చేరుకుని శ్రీ విఠల రుక్మిణీ మందిర్‌లో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత స్థానికంగా జరిగే బీఆర్‌ఎస్ సభలో ఎన్‌సీపీ దివంగత ఎమ్మెల్యే భరత్ భాల్కే కుమారుడు భగీరథ్ భాలే్క.. కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరతారు. మధ్యాహ్నానికి తుల్జాపూర్ చేరుకుని భవానీమాత మందిరంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం అక్కడికి సమీపంలోని ఉస్మానాబాద్ (దారాశివ్) ఎయిర్‌పోర్టుకు చేరుకుని, ప్రత్యేక విమానంలో మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్‌కు వస్తారు.
►సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ జాతీయ రహదారి 65 నుండి బై పాస్ రోడ్డు మీదుగా భారీ కాన్వాయ్ తో మహారాష్ట్రకు ముఖ్యమంత్రి కేసీఆర్ తరలివెళ్లారు.
► జహీరాబాద్ జాతీయ రహదారి 65 వెంట భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రకు తరలిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జ తీయ రహదారిపై కొహీర్ క్రాస్ రోడ్డు వద్ద, హుగ్గేలీ వై జంక్షన్, అల్గోల్ క్రాస్ రోడ్డు, చిరాగ్ పల్లి బార్డర్ చెక్ పోస్ట్ వద్ద బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.
వీరికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సు నుంచి చేతులు ఊపి అభివాదం చేశారు. నేటి నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు.
ముఖ్యమంత్రి వెంట పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నేతలు భారీ కాన్వాయ్ తో తరలివెళ్లారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ వస్తుండడంతో బై పాస్ రోడ్డు పై ట్రాఫిక్ ను పోలీసు అధికారులు నిలిపివేశారు. ముఖ్యమంత్రి తరలిన అనంతరం ట్రాఫిక్‌ను వెళ్ళనిచ్చారు.
► జహీరాబాద్ దాటి కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించిన సీఎం కాన్వాయ్
► సంగారెడ్డి జిల్లా దాటిన సీఎం కాన్వాయ్
► సీఎం పర్యటన సందర్భంగా గులబీమయమైన హైదరాబాద్- ముంబై జాతీయ రహదారి
► కార్యకర్తలకు అభివాదం తెలుపుకుంటు వెళ్లిన సీఎం
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలో బీఆర్‌ఎస్ పార్టీని బలోపేతం చేసే దిశగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్, బీఆర్‌ఎస్ మంత్రులు, నేతలు రెండు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు.
- ఈ క్రమంలో సీఎం కేసీఆర్ మంత్రులతో కలిసి ప్రగతి భవన్ నుంచి బయలుదేరారు.
- రోడ్డు మార్గంలో కేసీఆర్ మహారాష్ట్రకు బయలుదేరారు.
- దాదాపు 600 కార్లతో ప్రగతి భవన్ నుంచి భారీ కాన్వాయ్ బయలుదేరింది.
- సీఎం కేసీఆర్ రెండు రోజుల పాటు మహారాష్ట్రలోనే ఉంటారు. ఈ సందర్బంగా పండరీపూర్‌లో విఠలేశ్వరస్వామిని కేసీఆర్ దర్శించుకోనున్నారు.
- సోమవారం రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్‌తో బయలుదేరి.. తిరుగు ప్రయాణంలో ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment