సాక్షి, అమరావతి : తన పర్యటనలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విమానాశ్రయానికి వెళ్లినప్పుడు కాన్వాయ్ వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని వైఎస్ జగన్ గమనించారు. దీంతో ఎయిర్‌పోర్టుకు వెళ్లే సమయాల్లో తన వలన ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని పోలీసు, సీఎంవో అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ నగరంలో ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాల కోసం పోలీస్, భద్రతా అధికారులు అన్వేషిస్తున్నారు. (చదవండి: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం)
Comments
Please login to add a commentAdd a comment