
మహిళ దగ్గర లభించిన పత్రం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద గురువారం ఓ మహిళ అలజడి సృష్టించింది. అమరావతిలోని ఉండవల్లిలోని సీఎం ఇంటి సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు సదరు మహిళను భద్రతా సిబ్బంది అడగగా సచివాలయానికి వెళ్తున్నట్టు చెప్పింది.
అయితే ఆమె సీఎం ఇంటి దగ్గరే తిరుగుతుండటంతో పోలీసులకు అనుమానం వచ్చి ప్రశ్నించారు. ఓసారి సీబీఐ అధికారినని, మరోసారి సీబీఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ భార్యనంటూ పొంతనలేని సమాధానమిచ్చింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని ఆధారాలు పరిశీలించారు. ఎర్విన్ రీటాగా గా గుర్తించిన పోలీసులు ఆమెను తాడేపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment