ఉండవల్లి రైతులతో పవన్ కల్యాణ్ ముఖాముఖి | pawan kalyan face to face with capital region farmers | Sakshi
Sakshi News home page

ఉండవల్లి రైతులతో పవన్ కల్యాణ్ ముఖాముఖి

Published Thu, Mar 5 2015 10:41 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

pawan kalyan face to face with capital region farmers

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రతిపాదిత గ్రామాలలో సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గురువారం పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం చేరుకున్న ఆయన అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఉండవల్లి చేరుకున్నారు. అక్కడి రైతులతో పవన్ కల్యాణ్ ముఖాముఖి అయ్యారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.  పలువురు రైతులు తమ సమస్యలను పవన్కు చెప్పుకుంటున్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని రైతులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తమ భూములు తమకే కావాలని వారు తెలిపారు. అయితే రోడ్లు వేసేందుకు మాత్రం స్థలాలు ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement