గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధానికి ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా శనివారం తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని రెడ్ల బజార్ రామాలయం వద్ద రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ ప్రజా సంఘాలు, రైతు సంఘాలతోపాటు అఖిలపక్షాల నేతలు హాజరయ్యారు. రాజధాని కోసం చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూ సేకరణపై సదరు సంఘాల నేతలు తమ అభిప్రాయాలను ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివరిస్తున్నారు.