round table
-
రాజకీయ నిరుద్యోగుల అడ్డాగా టీఎస్పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) రాజకీయ నిరుద్యోగులకు అడ్డాగా మారిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కనీస అర్హతలు లేని వ్యక్తులను కమిషన్ సభ్యులుగా ప్రభుత్వం నియమించడంతో కమిషన్ పనితీరు అస్తవ్యస్తమైందని మండిపడ్డారు. ఫలితంగా లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు అల్లకల్లోలంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిరుద్యోగ అభ్యర్థుల ఆధ్వర్యంలో జరిగిన టీఎస్పీఎస్సీ ప్రక్షాళన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి రియాజ్‌లతో కలసి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఖరి, కమిషన్ తీరుపై విరుచుకుపడ్డారు. సీఎం కుటుంబానికి అవి ఏటీఎంలు... మంత్రి కేటీఆర్‌కు టీఎస్పీఎస్సీ, సీఎం కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్టు, ఎమ్మెల్సీ కవితకు సింగరేణి సంస్థలు ఏటీఎంలుగా మారాయని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. సీఎం కార్యాలయంలో పనిచేసే వ్యక్తుల బంధువులే టీఎస్పీఎస్సీ బోర్డులో అక్రమాలకు పాల్పడ్డారని.. వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్–1 పరీక్ష విషయంలో ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పబట్టినా ఇప్పటికీ బోర్డును రద్దు చేయకుండా మొండిగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో 30 లక్షల మంది నిరుద్యోగులతోపాటు వారి తల్లిదండ్రులు కలిపి మొత్తం 90 లక్షల మంది ఓటు ద్వారా కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి రాగానే ఏటా జనవరిలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఉద్యోగ నియామకాల వ్యవహారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, టీఎస్పీఎస్సీ తీరును నిరసిస్తూ ఈ నెల 14న సడక్ బంద్ (రహదారుల దిగ్బంధం) చేపట్టాలని పిలుపునిచ్చారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో ‘సిట్’ నివేదిక వివరాలను ప్రభుత్వం ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. తక్షణమే కొత్త బోర్డు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ కోదండరాం పిలుపు మేరకు రహదారుల దిగ్బందానికి టీపీసీసీ పూర్తి మద్దతు ప్రకటించింది. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ప్రొఫెసర్ వినాయక్‌రావు పాల్గొనగా నిరుద్యోగులు శివానంద స్వామి, మహేష్, మిత్రదేవి అధ్యక్షత వహించారు. -
నాలాలు, వరద నీటి కాలువల శుభ్రతపై దృష్టి సారించాలి
రాయదుర్గం: పట్టణ ప్రాంతాల్లో నిత్యం నాలాలు, వరద నీటి కాలువలను శుభ్రం చేసే అంశంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి చారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ఫ్లడ్ రిస్క్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ‘ఫ్లడ్ రిస్క్ మిటిగేషన్ అండ్ మేనేజ్మెంట్’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఎస్కీ డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ... ప్రస్తుతం పట్టణ ప్రాంతాలు కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్నాయని, ఈ నేపథ్యంలో రోడ్లపైకి మురుగునీరు, వర్షపునీరు రాకుండా శాశ్వత ప్రాతిపదికన నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.వర్షపు నీటిని చాలా వరకు భూమిలో ఇంకేలా చర్యలు తీసుకోవాలని కూడా పేర్నొన్నారు. అన్ని విభాగాల వారు సమష్టిగా చర్యలు చేపడితే దాదాపు అన్ని సమస్యలు తీరేందుకు అవకాశం ఉంటుందన్నారు. తరచూ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదికలిస్తే వాటిని ప్రభుత్వాలు అమలు చేస్తే చాలా వరకు సమస్యలు తీరేందుకు ఆస్కారం ఉందన్నారు. ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కరుణాగోపాల్, రీ సస్టేనబిలిటీ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ పి.జి.శాస్త్రి, జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ కె.కిషన్, జేఎన్టీయూఏ వాటర్ రిసోర్సెస్ హెచ్ఓడీ డాక్టర్ ఎం.వి.ఎస్.ఎస్.గిరిధర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.గోపాల్‌నాయక్, సిటీ ట్రాఫిక్ పోలీస్ అసిస్టెంట్ కమిషనర్ ఎం.నర్సింగ్‌రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
బీజేపీ పాలనలో 156 మత ఘర్షణలు
కేంద్రంలో భారతీయ జనతా పార్ట్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 156 మత ఘర్షణలు జరిగాయని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వరరావు ఆరోపించారు. ఇప్పటి వరకూ ఒక్క మతఘర్షణ నమోదు కాని.. దాద్రిలో ఘోర ఘటన చోటుచేసుకుందని ఆయన అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో జరుగుతున్న మత ఘర్షణలకు వ్యతిరేకంగా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో 'భారత రాజకీయాలు, బీఫ్ తినడం పట్ల అభ్యంతరాలు' పేరిట రౌండ్ టేబుల్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని రాజకీయ పార్టీలతో పాటు.. ప్రజా సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయని అన్నారు. ప్రజలు ఏం తినాలో.. ఎలాంటి బట్టలు కట్టుకోవాలో.. ఏ పుస్తకం చదవాలో ప్రభుత్వమే నిర్ణయిస్తే ఎలాగని ప్రశ్నించారు. మనది ప్రజాస్వామ్య దేశం అనే సంగతి పాలకులు గుర్తుంచుకోవాలని అన్నారు. -
భూసేకరణపై ఉండవల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధానికి ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా శనివారం తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని రెడ్ల బజార్ రామాలయం వద్ద రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ ప్రజా సంఘాలు, రైతు సంఘాలతోపాటు అఖిలపక్షాల నేతలు హాజరయ్యారు. రాజధాని కోసం చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన బలవంతపు భూ సేకరణపై సదరు సంఘాల నేతలు తమ అభిప్రాయాలను ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివరిస్తున్నారు. -
అసెంబ్లీ స్థానాల సంఖ్య పెంపుపై ఆల్ పార్టీ మీటింగ్
-
‘పౌరసేవల చట్టం’పై నేడు రౌండ్‌టేబుల్: లోక్‌సత్తా
సాక్షి, హైదరాబాద్: ‘హక్కుగా పౌరసేవల చట్టం’ అంశంపై మంగళవారం హైదరాబాద్‌లోని ‘సెస్’ సెమినార్ హాల్లో నిర్వహించే రౌండ్‌టేబుల్ సమావేశంతో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నట్లు లోక్‌సత్తా పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. సామాన్య ప్రజలకు రోజువారీ జీవితంలో ప్రభుత్వ కార్యాలయాల నుంచి అందాల్సిన రేషన్ కార్డులు, పట్టాదారు పాసు పుస్తకాలు, మంచినీటి కనెక్షన్లు వంటి సేవలను అవినీతి, ఆలస్యం లేకుండా కచ్చితంగా అందించేందుకు వీలుగా ఈ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు లోక్‌సత్తా తెలంగాణ కన్వీనర్ ఎన్.శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 14న విశాఖపట్టణంలోనూ రౌండ్‌టేబుల్ సమావేశం ఉంటుందన్నారు. సెస్‌లో జరిగే రౌండ్‌టేబుల్ సమావేశంలో సీహెచ్ రాజేశ్వరరావు, విశ్రాంత ఐఏఎస్ కేఆర్ వేణుగోపాల్, జస్టిస్ రెడ్డప్ప రెడ్డి, కళానిధి సత్యనారాయణ, ప్రొ.హనుమంతరావు, ప్రొ. సి.లక్ష్మణ్ణ, అన్వర్ ఖాన్, డా.చక్రపాణి, ఎం.ధర్మారావు, డా. టి.హనుమాన్‌చౌదరి, మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొంటారు. -
రాజధాని - భూములు: చర్చ Part - 3
-
''విచ్చలవిడిగా ప్రజల డబ్బు ఖర్చు''
-
రాజధాని - భూములు: చర్చ Part - 1
-
రాజధాని - భూములు: చర్చ Part - 2
-
వెనుకబాటుపై యుద్ధం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, న్యూస్‌లైన్: వెనుకబాటుతనాన్ని తరిమికొట్టి, సహజవనరులన్న సిరులగడ్డ పాలమూరును పునర్నించుకుందామని వక్తలు అభిప్రాయపడ్డారు. శనివారం ‘పాలమూరు పునర్నిర్మాణ ఫోరం’ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రాజీవ్ విద్యామిష న్ సమావేశ మందిరంలో ‘రేపటి తెలంగాణలో పాలమూరు అభివృద్ధి’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు కొనసాగిన ఈ సమావేశంలో విద్య, వైద్యం, పరిశ్రమలు, ప్రాజెక్టులు, వ్యవసాయం, విద్యుత్ తదితర అంశాలపై ఆయాశాఖల నిపుణులు ప్రసంగించారు. పాలమూరు పునర్నిర్మాణ ఫోరం గౌరవ అధ్యక్షుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. పాలమూరు పునర్నిర్మాణ ఫోరం ఏ రాజకీయ పార్టీకి, సంస్థకో, వ్యక్తికో అనుబంధమైదని కాదన్నారు. అన్ని వనరులుండి వెనకబాటు తనానికి గురౌతున్న పాలమూరు జిల్లాను పూర్తిగా అభివృద్ధి పరచాలనే దృఢసంకల్పంతో, అన్ని రంగాల నిష్ణాతులైన వ్యక్తుల చేతస్థాపించామని చెప్పారు. తెలంగాణ కోసం 60 ఏళ్లుగా పోరాటం చేశామని, ఇప్పుడు జిల్లా అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. ఆ సంఘం అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాను అన్ని రంగాలల్లో అభివృద్ధి చేసేందుకు అన్ని వర్గాల వారు ముందుకురావాలన్నారు. ప్రభుత్వ వైద్య, విద్య, సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని హైకోర్టు న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి అన్నారు. జిల్లాలో వైద్యం రంగం నిర్లక్ష్యానికి గురౌతుందని హెల్త్ ఎడ్యుకేటర్ వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. జిల్లాలో ప్రతి 10వేల మందిలో 152 మాతృమరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. జిల్లాలో కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా లేదన్నారు. విద్యాశాఖకు సంబంధించిన శంకర్‌రాథోడ్ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థను పటిష్టపర్చాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో 56శాతం మంది మాత్రమే అక్షరాస్యులున్నారని 80శాతానికి పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పారిశ్రామిక నీటిపారుదల శాఖ రిటైర్ట్ చీఫ్ ఇంజనీర్ విఠల్‌రావు, ఆర్డీఎస్ ప్రాజెక్టు జల సంఘం అధ్యక్షుడు సీతారాంరెడ్డి, వ్యవసాయశాఖ నిపుణులు ఖాజమునీర్ అహ్మద్ మాట్లాడుతూ.. జిల్లాలో దాదాపు 82శాతం మంది వ్యవసాయంపై ఆధారపడుతున్న వారికి కావల్సిన సాగునీరు అందటం లేదని అన్నారు. జిల్లాలో ఆర్థిక సంక్షోభం పెరిగిపోయిందని కరువు వ్యతిరేక పోరాటం సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవాచారి అన్నారు. లిక్కర్సేల్స్లో జిల్లా మొదటిస్థానంలో ఉందని, ఈ పరిస్థితిని మార్చాలని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి పాలమూరు నుంచి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పారిశ్రామికవేత్త బెక్కరి రాజశేఖర్‌రెడ్డి, కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి ఎం.ఏ.అలీం, విద్యుచ్చక్తి నిపుణులు కృష్ణారెడ్డి, ఫిషరిస్ డిపార్ట్మెంట్ నుంచి ఎం.ఏ. వాజీద్‌లు మాట్లాడారు. కార్యక్రమంలో పీపీఎఫ్ ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి చలపతిరావు, కోశాధికారి ఎన్.శ్రీహరి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివిధ సంఘాల నాయకులు, యువత పాల్గొన్నారు.