
కిరణ్ వాస్తవాలు వెల్లడించారు: ఉండవల్లి
ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కఠోరమైన నిజాలు వెల్లడించారని రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
రాజమండ్రి : ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కఠోరమైన నిజాలు వెల్లడించారని రాజమండ్రి కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టాల్సిన అవసరం లేదని ఆయన శనివారమిక్కడ అభిప్రాయపడ్డారు. ఎవరైనా తమ అభిప్రాయాలు చెప్పవచ్చనేది కాంగ్రెస్ విధానమన్నారు. కిరణ్కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా తన అభిప్రాయాన్ని నిష్కర్షగా చెప్పారని ఉండవల్లి అన్నారు. హైదరాబాద్లో మెజార్టీ శాసనసభ్యులు విశాలాంధ్రను కోరుతున్నారని ఆయన తెలిపారు.
అసెంబ్లీలో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు విప్లుండవన్నారు.
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై ఉండవల్లి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ వల్లే ఇరుప్రాంతాల్లోనూ వైషమ్యాలు పెరిగాయన్నారు. చరిత్రను కేసీఆర్ వక్రీకరిస్తున్నారని ఉండవల్లి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డిని క్యాంటిన్ పెట్టువాలనటం కేసీఆర్కు తగదని హితవు పలికారు. తెలంగాణ ఏర్పడితే జలపంపకాల కోసం పాకిస్తాన్తో మాట్లాడనట్లు చేయాల్సి ఉంటుందన్నారు. హైదరాబాద్ నుంచి తాము పోతామని అనలేదని ఆయన పేర్కొన్నారు.