అమరావతి: భూ సేకరణ పునరావాస, పునర్నిర్మాణ చట్టం-2013 ప్రకారం సామాజిక ప్రభావ అంచనా నివేదికపై నిపుణుల కమిటీ మంగళవారం ఉండవల్లిలో సమావేశం అయింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు భారీగా మోహరించారు.
కాగా మీటింగ్ మినిట్స్ రాయాలని రైతులు పట్టుబట్టడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాజధానికి భూములు ఇవ్వాలని తమను బెదిరిస్తున్నారని రైతులు తెలిపారు. తమకు ఏం జరిగినా సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే బాధ్యత వహించాలని వారు అన్నారు.
కాగా ఇప్పటికే ప్రభుత్వం అనేకసార్లు రైతులను మోసం చేస్తూ అప్పటికప్పుడు సమావేశం నిర్వహించడంతో రైతులు ఈ సమావేశాన్ని రైతులు బహిష్కరించిన విషయం తెలిసిందే. అలాగే 20 రోజుల క్రితం జరిగిన భేటీలో సైతం రైతులు అడిగిన ప్రశ్నలకు నిపుణుల కమిటీ సమాధానాలు చెప్పలేక అర్థాంతరంగా ముగించింది.