వైఎస్ జగన్ ఎదుట విలపించిన మహిళలు | AP capital farmers and women explain problems to YS Jagan mohan reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ ఎదుట విలపించిన మహిళలు

Published Tue, Mar 3 2015 11:21 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

వైఎస్ జగన్ ఎదుట విలపించిన మహిళలు - Sakshi

వైఎస్ జగన్ ఎదుట విలపించిన మహిళలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పర్యటిస్తున్నారు.

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం పర్యటిస్తున్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని పంట పొలాలను ఆయన పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా కౌలు రైతులు, కూలీలు, మహిళలు...వైఎస్ జగన్ ఎదుట తమ గోడును విన్నవించుకున్నారు.

ఓ వైపు పంట పొలాలను బలవంతంగా లాక్కుంటూ...మరోవైపు గ్రామాన్ని ఖాళీ చేయాలని అధికారులు బెదిరిస్తున్నారని వారు వైఎస్ జగన్ కు తెలిపారు. భూములు, ఇళ్లు తీసుకుంటే తామెక్కడికి వెళ్లాలంటూ మహిళలు ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఎదుట విలపించారు. అంతకు ముందు వైఎస్ జగన్ ఉండవల్లి గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement