సీఎం అతిథిగృహం సమీపంలో మంటలు | fire broken near chandra babu guest house | Sakshi
Sakshi News home page

సీఎం అతిథిగృహం సమీపంలో మంటలు

Published Mon, Sep 28 2015 1:46 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

లింగమనేని ఎస్టేట్ - Sakshi

లింగమనేని ఎస్టేట్

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి-ఉండవల్లి కరకట్టపై సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. లంకభూముల్లో ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో పక్కనే ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అతిథి గృహం లింగమనేని ఎస్టేట్ లో దట్టమైన పొగలు అలుముకున్నాయి.

అగ్నిమాపక వాహనం లంక భూముల్లోకి వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో అధికారులు మంటలను ఆర్పడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేశిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి అతిథి గృహం వైపు వెళ్లే రోడ్డు మార్గం కూడా నిర్మాణంలో ఉండటంతో తాత్కాలికంగా మూసేశారు. దీంతో మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement