ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావుపై కాంగ్రెస్ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ పోరాటం ఎందుకు ఆపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉండవల్లి దిగజారుడు తనం చూస్తే బాధేస్తోందన్నారు. రామోజీరావుకు చెందిన మార్గదర్శి అంశం వెలుగులోకి తెచ్చిన తరువాత ఆయన పాపులర్ అయ్యాడని తెలిపారు. రామోజీ విషయంలో ఉండవల్లి అస్త్ర సన్యాసం చేశారా? అని అడిగారు. లేకపోపే ఉండవల్లిని రామోజీ బెదిరించారా అన్న అనుమానం ఆయన వ్యక్తం చేశారు. రామోజీరావును ఉండవల్లి క్షమాపణలు కోరారా? అని అడిగారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై రాష్ట్ర ప్రజలకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని అంబటి చెప్పారు. వైఎస్ఆర్ మరణానికి సోనియానే కారణం అని ఎవరన్నారో ఉండవల్లి చెప్పాలన్నారు. కాంగ్రెస్ నేతలు రాజశేఖర రెడ్డిని విమర్శించినప్పుడు ఉండవల్లి ఎందుకు మాట్లాడలేదని అడిగారు. తోటి నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటే ఎక్కడ దాక్కున్నావని ప్రశ్నించారు. వి.హనుమంతరావు, మధుయాష్కీ, సర్వే సత్యనారాయణ, శీలం, పాల్వాయి విమర్శించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని అడిగారు. ఉండవల్లి నమ్మక ద్రోహిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు వాద్రా ఆస్తుల గురించి చర్చించడానికి సిద్దంగా ఉన్నారా? అని ఉండవల్లకి ఆయన సవాల్ విసిరారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, ఎంపిలు లగడపాటి రాజగోపాల్, వివేక్లు వ్యాపారాలు చేయడంలేదా? వారికి వేల కోట్ల రూపాయలు లేవా? అని అడిగారు. జగన్మోహన రెడ్డి వ్యాపారాలు చేయకూడదా? ఆయన ఆస్తులు సంపాదించుకోకూడదా? అని ప్రశ్నించారు. సిబిఐపై సుప్రీం కోర్టు అన్న వ్యాఖ్యలు ఉండవల్లి ఎందుకు ప్రస్తావించలేదని అడిగారు.
Published Thu, Jul 11 2013 5:21 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement