
సాక్షి, ఉండవల్లి : టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై ప్రభుత్వం కొరడా ఝళిపించిన విషయం తెలిసిందే. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమంగా నిర్మించిందేనని నిర్ధారించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నివాసానికి బయటవైపు గోడకు లింగమనేని రమేష్ పేరుతో అధికారులు నోటీసులు అంటించారు. లింగమనేని ఎస్టేట్‌కు సీఆర్‌డీఏ నోటీసులు ఇస్తే... చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేపట్టింది. టీడీపీ నేతలు మరో అడుగు ముందుకేసి... చంద్రబాబుకు సంఘీభావం తెలిపినట్లు రైతుల ముసుగులో పార్టీ కార్యకర్తలను రంగంలోకి దించారు. అక్రమ కట్టడం నుంచి చంద్రబాబును తరలిస్తే ఊరుకునేది లేదంటూ హంగామా చేశారు.
చదవండి : చంద్రబాబు ఇంటికి నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment