
సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌజ్‌కు సీఆర్‌డీఏ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. లింగమనేని రమేశ్ పేరుతో..గెస్ట్‌హౌజ్ గోడకు అధికారులు శనివారం నోటీసులు అంటించారు. వారం రోజుల్లోగా ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులో పేర్కొన్నారు. కాగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ లింగమనేని గెస్ట్‌హౌజ్‌కు గతంలో కూడా సీఆర్‌డీఏ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో లింగమనేని రమేశ్ అధికారులకు వివరణ ఇచ్చారు. అయితే ఆయన వివరణ సంతృప్తికరంగా లేదని పేర్కొన్న అధికారులు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా గ్రౌండ్‌ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మింగ్‌పూల్, ఫస్ట్‌ఫ్లోర్ డ్రెస్సింగ్ రూం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని మరోసారి నోటీసులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment