lingamaneni guest house
-
‘కరకట్ట నివాసం జప్తు’ పిటిషన్.. ఇరువైపులా ముగిసిన వాదనలు
సాక్షి, కృష్ణా: కరకట్టపై చంద్రబాబు అక్రమ నివాసాన్ని(లింగమనేని గెస్ట్‌హౌజ్) జప్తునకు అనుమతి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ(శుక్రవారం) వాదనలు కొనసాగాయి. వాస్తవానికి ఇవాళ తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే.. విజయవాడ ఏసీబీ కోర్టులో ఇప్పటికే సీఐడీ వాదనలు పూర్తి కాగా.. తమ వాదనలూ వినాలని లింగమనేని తరపు న్యాయవాది కోరడంతో కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో.. లింగమనేని తరపున అడ్వొకేట్ అశ్వినీ కుమార్ ఇవాళ(జూన్ 2, 2023 శుక్రవారం) వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లో సీఐడీ తరపున అడ్వొకేట్ వివేకానంద వాదించారు. ఇరు పక్షాల వాదనలు నేటికి పూర్తి కావడంతో జూన్ 6వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. అదే రోజు ఈ పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. కరకట్టపై లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్‌ను చంద్రబాబు అక్రమంగా పొందారనేది ఏపీసీఐడీ ప్రధాన అభియోగం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లలో లింగమనేనికి లబ్ది చేకూర్చి బదులుగా ఆయన ఇంటిని గెస్ట్ హౌస్‌గా పొందారని సీఐడీ చెబుతోంది. ఇదీ చదవండి: చంద్రబాబు అద్దె కొంప కహానీ ఇదీ! -
అది ముమ్మాటికీ అక్రమ కట్టడమే : ఆర్కే
సాక్షి, అమరావతి: చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని అతిథి గృహం ముమ్మాటికీ అక్రమ నిర్మాణమేనని, చంద్రబాబు, లింగమనేని రమేశ్‌కు దమ్ముంటే ఈ అంశంపై చర్చకు రావాలని వైఎస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సవాల్ విసిరారు. అది అక్రమ కట్టడమని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆర్కే మాట్లాడారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు, అప్రతిష్ట పాలు చేసేందుకు లింగమనేనిపై ఒత్తిడి తెచ్చి ఆయనతో చంద్రబాబు సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాయించారన్నారు. గతంలో హైకోర్టు నోటీసులు ఇచ్చినా స్పందించని లింగమనేని ముఖ్యమంత్రికి లేఖ ఎలా రాశారని ప్రశ్నించారు. దేవినేని ఉమా 2014లో కృష్ణా నదిలో తిరిగి మరీ నదీ గర్భంలోని నిర్మాణాలన్నీ అక్రమ కట్టడాలని చెప్పలేదా? అని నిలదీశారు. తాడేపల్లి తహసీల్దార్ లింగమనేనికి నోటీసులు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. 271 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి–కృష్ణా నది అని అడంగల్‌లో ఉందని, అలాగే 271–1బి ప్రభుత్వ భూమి డొంక అని రికార్డుల్లో ఉందని వివరించారు. ఇలాంటి ప్రభుత్వ భూమిలో నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరానని లింగమనేని చెప్పడం ఏమిటన్నారు. ఇటీవల సీఆర్డీఏకి రాసిన లేఖలో తనవి 254, 250 సర్వే నెంబర్లు అని ఆయన పేర్కొన్నారని, వాస్తవానికి అవి లింగమనేనివి కానే కావన్నారు. ఆయన ఎక్కడా అనుమతులు తీసుకోలేదని.. తాను గ్రామ పంచాయతీ రికార్డులన్నింటినీ చూసి చెబుతున్నానని, పంచాయతీ అనుమతులుంటే తీసుకు రావాలని కోరారు. ఈతకొలను నిర్మాణానికి మాత్రమే అనుమతి తీసుకుని ఏకంగా ఇల్లే కట్టారన్నారు. ఉడా అనుమతి ప్రకారం పట్టా భూమిలో నిర్మాణం చేయాల్సి ఉండగా ఏకంగా ప్రభుత్వ భూమిలోనే కట్టేశారన్నారు. ఇంటి అద్దె కింద రూ.1.2 కోట్లు తీసుకున్నారు చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ ఇంటి అద్దె కింద శాసనసభ, శాసనమండలి నుంచి రూ.1.2 కోట్లు తీసుకున్నారని.. నిజంగా వారు ఇంటి అద్దె చెల్లించారా? చెల్లించి ఉంటే దాన్ని ఆదాయపు పన్ను చెల్లింపులో చూపించారా? అని ఎమ్మెల్యే ఆర్కే అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ లింగమనేని తన అతిథి గృహాన్ని ఉచితంగా ఇచ్చి ఉంటే మరి వారు ఇంటి అద్దెను ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. లింగమనేని ఎలాంటి ప్రతిఫలం లేకుండానే అతిథి గృహాన్ని చంద్రబాబుకు ఇచ్చారా? అని నిలదీశారు. రాజధాని ల్యాండ్‌పూలింగ్‌ను లింగమనేని భూముల వద్దకు వచ్చేటప్పటికే ఎందుకు ఆపేశారో చెప్పాలన్నారు. తానున్న అతిథి గృహం ప్రభుత్వ ఆస్తి అని గతంలో చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారని.. ఇప్పుడు మాత్రం మాట మార్చి అద్దెకు ఉంటున్నానని చెబుతున్నారని మండిపడ్డారు. లింగమనేని కూడా ఆ అతిథిగృహం తనది కాదని.. ఎప్పుడో ప్రభుత్వానికి ఇచ్చేశానని చెప్పారని, ఇప్పుడేమో తనదేనని ప్రభుత్వానికి లేఖ రాశారని ధ్వజమెత్తారు. అనుమతులు లేకుండా నిర్మించారని ఆధారాలతో సహా ఉన్నప్పుడు ఐపీసీ 420, 468, 471 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని, మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబు ఇంటికి మరోసారి నోటీసులు
సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌజ్‌కు సీఆర్డీఏ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. లింగమనేని రమేశ్ పేరుతో..గెస్ట్‌హౌజ్ గోడకు అధికారులు శనివారం నోటీసులు అంటించారు. వారం రోజుల్లోగా ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులో పేర్కొన్నారు. కాగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ లింగమనేని గెస్ట్‌హౌజ్‌కు గతంలో కూడా సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లింగమనేని రమేశ్ అధికారులకు వివరణ ఇచ్చారు. అయితే ఆయన వివరణ సంతృప్తికరంగా లేదని పేర్కొన్న అధికారులు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా గ్రౌండ్‌ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మింగ్‌పూల్, ఫస్ట్‌ఫ్లోర్ డ్రెస్సింగ్ రూం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని మరోసారి నోటీసులో పేర్కొన్నారు. -
టీడీపీ నాయకులపై కేసు నమోదు
తాడేపల్లి రూరల్ (మంగళగిరి): కృష్ణా కరకట్ట వెంబడి ఉండవల్లిలోని మాజీ సీఎం చంద్రబాబు నివాసం వద్ద తమ విధులకు ఆటంకం కలిగించిన టీడీపీ నాయకులపై తాడేపల్లి పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. ఈ నెల 16వ తేదీన చంద్రబాబు నివాసంలోకి వరద నీరు చేరిన విషయం తెలిసిందే. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అదే రోజు అక్కడికి చేరుకొని వరద ఉధృతిని పరిశీలించారు. అయితే వరద నీరు రాకున్నా ఎమ్మెల్యే ఆర్కే అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ టీడీపీ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకొని గొడవకు దిగారు. డ్రోన్ కెమెరాతో చంద్రబాబు నివాసాన్ని వీడియో చిత్రీకరిస్తున్నారంటూ ధర్నాకు దిగారు. వరద ఉధృతిని పరిశీలించడానికి అన్ని ప్రాంతాల్లో తామే డ్రోన్ వాడుతున్నామని ఇరిగేషన్ అధికారులు చెప్పినప్పటికీ టీడీపీ నేతలు పట్టించుకోలేదు. అధికారులు పంపిన యువకులపై దాడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో, అప్పటికే అక్కడకు చేరుకున్న టీడీపీ నాయకులు దేవినేని ఉమ, దేవినేని అవినాష్, జనార్దన్, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఆలపాటి రాజా, తెనాలి శ్రావణ్‌కుమార్ రెచ్చిపోయి తమ అనుచరులతో పోలీసుల వాహనాలపై దాడి చేయడం, పోలీసులను కొట్టడం చేశారు. దీంతో పోలీసులు ఆ రోజు ధర్నాలో పాల్గొన్న తాడేపల్లి నాయకులతోపాటు, విజయవాడ నుంచి వచ్చిన కొంత మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: టీడీపీ ‘డ్రోన్’ రాద్ధాంతం) -
టీడీపీ ‘డ్రోన్’ రాద్ధాంతం
సాక్షి, అమరావతి బ్యూరో/తాడేపల్లి రూరల్/గుంటూరు: గుంటూరు జిల్లా ఉండవల్లిలో కృష్ణా నది కరకట్టపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్ వద్ద శుక్రవారం తెలుగుదేశం పార్టీ నేతలు హల్చల్ చేశారు. నదిలో వరద పరిస్థితిని అంచనా వేసేందుకు డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తుండగా దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇరిగేషన్ శాఖ అధికారుల ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్న ఇద్దరు యువకులను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా, మీడియాను పిలిపించి నానా యాగీ చేశారు. వరద ముంపు ప్రాంతాలను, నీటి ఉధృతిని డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్నామని అధికారులు చెబుతున్నా వినిపించుకోకుండా ఇందులో వైఎస్సార్సీపీ నాయకుల ప్రమేయం ఉందంటూ ఆందోళనకు దిగారు. పోలీసులు రెండు గంటల పాటు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినకుండా ముఖ్యమంత్రిని దూషిస్తూ రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నాయకులు కుట్ర పన్నుతున్నారని, అందుకే ఆయన నివాసాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, టీడీపీ నేతలు దేవినేని అవినాష్, అశోక్‌బాబు, బచ్చుల అర్జునుడు ఆరోపించారు. డ్రోన్ కెమెరా ఆపరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని, పోలీసు స్టేషన్‌కు తరలిస్తుండగా వారి జీపును, మరో బస్సు అద్దాలను ధ్వంసం చేసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకొని, ఇద్దరు ఆపరేటర్లను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు మరోసారి ధర్నాకు దిగి, పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. పోలీసులు లాఠీచార్జి చేసి వారిని దూరంగా తరిమేశారు. మంత్రులను అడ్డుకున్న బాబు ఇంటి భద్రతా సిబ్బంది ప్రకాశం బ్యారేజీకి వరద భారీగా పెరుగుతుండడంతో కృష్ణా కరకట్ట వెంబడి ఉన్న పంటలు, నిర్మాణాలను మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్ యాదవ్, వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు పరిశీలించారు. శుక్రవారం సాయంత్రం ఉండవల్లి కరకట్ట వెంబడి ఉన్న ఎన్ఆర్ఐ ఆస్పత్రికి సంబంధించిన తులసివనం అతిథి గృహాన్ని పరిశీలించారు. అనంతరం ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి వద్ద వరద తాకిడి ఎలా ఉందో పరిశీలించేందుకు వెళ్లారు. అయితే, చంద్రబాబు ఇంటి వద్ద ఉన్న భద్రతా సిబ్బంది మంత్రులను లోపలికి అనుమతించలేదు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. వరదలను కూడా రాజకీయం చేయడం తగదన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో కరకట్ట పక్కన ఉన్న మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి ఇరువైపులా ఉన్న గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్, చందనా బ్రదర్స్ గెస్ట్‌హౌస్, తులసి నివాసాలు నీట మునిగిన దృశ్యం లింగమనేని గెస్ట్‌హౌస్‌ను చుట్టుముట్టిన వరద ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం ఉదయం 9 గంటల సమయానికి ఉండవల్లి కరకట్ట వెంబడి ఉన్న పంట పొలాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అరటి, మునగ, కంద, దొండ తదితర పొలాల్లో నీరు నిలిచింది. మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అతిథి గృహం, ఎన్ఆర్ఐ ఆస్పత్రికి చెందిన తులసి వనం గెస్ట్‌హౌస్‌లోకి వరద పారింది. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్ వద్ద ఉన్న రివర్ వ్యూ ఇప్పటికే మునిగిపోయింది. అక్కడ ఉన్న వరండా పైనుంచి వరద పారుతోంది. లింగమనేని గెస్ట్‌హౌస్‌కు ముందు వైపు, వెనక వైపు వరద చుట్టుముట్టింది. చంద్రబాబు ఇంటికి ముందు వంద మీటర్ల దూరంలో, వెనక వైపు రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న పంటపొలాల్లోకి అడుగు మేర వరద వచ్చింది. చంద్రబాబు ఇంటిని రక్షించేందుకు అక్కడి సిబ్బంది మట్టి, ఇసుక, కంకరను సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే తాడేపల్లి రెవెన్యూ అధికారులు కరకట్ట వెంబడి ఉన్న 26 అతిథి గృహాలను ఖాళీ చేయాలని ఆదేశించారు. అయినా చంద్రబాబు నివాసాన్ని ఖాళీ చేయకుండా మొండికేస్తుండడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమతి లేకుండా డ్రోన్లు వినియోగించొద్దు: ఐజీ కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో వరద కొనసాగుతోందని గుంటూరు రేంజ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ శుక్రవారం చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లోని నివాసాలకు వరద ముప్పు పొంచి ఉందన్నారు. సహాయక చర్యల్లో నిమగ్నమైన ప్రభుత్వ శాఖల సిబ్బందికి, పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్లు వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తప్పనిసరిగా వినియోగించాల్సి వస్తే సంబంధిత జిల్లా పోలీస్ అధికారి నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. గేట్లకు బోట్లు అడ్డుపెట్టి వరద తెప్పించారు నా ఇంటిని ముంచేయడానికే ఇలా చేశారు: చంద్రబాబు ప్రకాశం బ్యారేజీ గేట్లకు బోట్లను అడ్డుగా పెట్టి, తన ఇల్లు మునిగిపోయేలా చేశారని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయన శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో మకాం వేసిన టీడీపీ నేతలతో పలుమార్లు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. బ్యారేజీలో నీళ్లు వెనక్కి తన్నడం కోసమే గేట్లకు బోట్లు అడ్డం పెట్టారని అన్నారు. సక్రమంగా వరద నిర్వహణ చేపడితే నీళ్లు వెనక్కి వచ్చేవి కావని, వరద ప్రవాహం నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. వరద నిర్వహణపై ముఖ్యమంత్రి ఒక్క సమీక్ష కూడా చేయలేదని ధ్వజమెత్తారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను నిర్వహించే విధానం ప్రభుత్వానికి తెలియలేదన్నారు. బ్యారేజీ నుంచి మూడు లక్షల క్యూసెక్కుల నీటిని ముందే వదిలితే వరద ఉండేది కాదని చెప్పారు. తనపై ద్వేషంతో వరదలతో ఆటలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై అక్కసుతో ప్రజలను వరదల్లో ముంచుతున్నారని, బ్యారేజీలో నీళ్లు నిల్వ ఉంచి అకస్మాత్తుగా దిగువకు వదిలారని అన్నారు. ఉండవల్లిలోని తన నివాసాన్ని టార్గెట్ చేశారని దుయ్యబట్టారు. హై సెక్యూరిటీ జోన్లో ఉన్న తన ఇంటిపై డ్రోన్లు ఎందుకు ఎగురవేశారని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రినైన తన నివాసంపై డ్రోన్లు తిప్పడం ఏమిటని నిలదీశారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబు ఇంటిపై డ్రోన్లు నడిపేముందు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారో లేదో చెప్పాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై శనివారం డీజీపీని కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. -
అక్రమాల గని.. ‘లింగమనేని’
సాక్షి, మంగళగిరి: లింగమనేని... ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారు లేరు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లుగా నివాసం ఉంటున్నది లింగమనేని గెస్ట్‌హౌస్‌లోనే. ఈ గెస్ట్‌హౌస్ యజమానులు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామ సమీపంలో కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ఈ ఇంటిని చంద్రబాబుకు అద్దెకు ఇచ్చి, ప్రతిఫలంగా తమ విలువైన భూములను రాజధాని భూసమీకరణ నుంచి తప్పించేలా జాగ్రత్త పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. 1994కు ముందు విజయవాడలో చిన్నస్థాయి రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పనిచేసే లింగమనేని సంస్థ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, రూ.కోట్లకు పడగలెత్తిందన్న ఆరోపణలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. అధికారం అండతో భూములను సొంతం చేసుకోవడంతోపాటు నిబంధనలను బేఖాతర్ చేయడం లింగమనేని సంస్థకు పరిపాటిగా మారింది. ఏసీసీ భూములతో ప్రారంభం గుంటూరు జిల్లా మంగళగిరి, పెదకాకాని, తాడికొండ మండలాల పరిధిలోని నిడమర్రు, నంబూరు, కంతేరు, చినకాకాని, కాజా గ్రామాల్లో ఏసీసీ కంపెనీకి చెందిన 148 ఎకరాల భూములున్నాయి. గుంటూరు–విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ భూములపై 2001లో లింగమనేని రియల్ ఎస్టేట్ సంస్థ కన్ను పడింది. వాటిని లింగమనేనికి విక్రయించేందుకు ఏసీసీ కంపెనీ ముందుకు రాలేదు. అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ అండతో లింగమనేని సంస్థ అధినేత లింగమనేని భాస్కరరావు వీజీటీఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని(ఉడా) రంగంలోకి దించారు. ప్రజావసరాల కోసం అంటూ ఏసీసీకి చెందిన భూములను ఉడా సేకరించింది. 2002లో నంబూరు గ్రామానికి చెందిన 69.81 ఎకరాలు, కాజా గ్రామానికి చెందిన 38.47 ఎకరాలు, కంతేరు గ్రామానికి చెందిన 7.63 ఎకరాలను రూ.4.90 కోట్లకు సేకరించింది. ఆ భూముల్లో జాతీయ రహదారి వెంట టౌన్షిప్ నిర్మిస్తామని పేర్కొంది. కానీ, ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అవే భూములను లింగమనేని సంస్థకు బహిరంగ వేలం పేరుతో విక్రయించింది. బహిరంగ వేలంలో విజయవాడకు చెందిన సహారా ఇండియా కమర్షియల్ కార్పొరేట్ సంస్థ, గుంటూరుకు చెందిన బీఎన్కే రియల్ ఎస్టేట్ సంస్థ, లింగమనేని సంస్థ పాల్గొన్నాయి. అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో సహారా, బీఎన్కే సంస్థలు వేలం నుంచి తప్పుకున్నాయి. చివరకు లింగమనేని సంస్థ 115.90 ఎకరాలను రూ.8.96 కోట్లకు దక్కించుకుంది. అప్పటికే ఆక్కడ ఎకరం విలువ రూ.40 లక్షలకు పైగానే పలుకుతోంది. ఉడా మాత్రం లింగమనేని సంస్థకు ఎకరా కేవలం రూ.7.75 లక్షల చొప్పున కట్టబెట్టింది. ఏసీసీకి చెందిన భూములు మొత్తం 148 ఎకరాలుండగా, ఉడా 115.90 ఎకరాలను సేకరించి, లింగమనేనికి విక్రయినట్లు చెబుతుండగా మిగిలిన 31.10 ఎకరాల భూమి ఏమైందనేది ప్రశ్నార్థకంగా మారింది. వాటి విలువ ప్రస్తుతం రూ.450 కోట్ల పైమాటే. అక్రమాలను ప్రశ్నించిన గ్రామ కార్యదర్శి సస్పెండ్ ఉడా నుంచి నామమాత్రపు ధరకే విలువైన భూములను కొట్టేసిన లింగమనేని సంస్థ అప్పటి టీడీపీ సర్కారు అండతో నిబంధనలకు పాతరేసి, అందులో నిర్మాణాలను ప్రారంభించింది. కామన్ సైట్, సెట్ బ్యాక్స్ వంటి నిబంధనలను పాటించలేదు. దీనిపై నంబూరు గ్రామ కార్యదర్శి అబ్దుల్లా రియల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. లింగమనేని ఒత్తిడితో సదరు గ్రామ కార్యదర్శిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలి లింగమనేని అక్రమ నిర్మాణాలపై స్థానికులు న్యాయ పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా లోకాయుక్తను ఆశ్రయించారు. నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు సాగించిన రియల్ ఎస్టేట్ సంస్థపై చర్యలు తీసుకోవాలని లోకాయుక్త 2012లో అప్పటి కలెక్టర్ సురేష్‌కుమార్‌ను ఆదేశించింది. స్పందించిన కలెక్టర్ సురేష్‌కుమార్ దీనిపై విచారణ చేపట్టారు. నిబంధనల ఉల్లంఘన నిజమేనని తేల్చారు. లింగమనేని సంస్థపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని ఉడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చర్యలు తీసుకుంటున్నామని 2013లో లోకాయుక్తకు సమాధానమిచ్చిన ఉడా 2014లో మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ వ్యవహారాన్ని అటకెక్కించిందని ఫిర్యాదుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటికే ఉడా సహకారంతో వందలాది ఎకరాలను లాక్కున్న లింగమనేని సంస్థ చినకాకాని, కాజా, నిడమర్రు, కంతేరు, నంబూరు గ్రామ పంచాయతీల్లో దాదాపు 1,200 ఎకరాల భూములను దక్కించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని భూ సమీకరణ నుంచి ఈ భూములను మినహాయించింది. లింగమనేని అక్రమాలపై తక్షణమే పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
చంద్రబాబు ఇంట్లో సమావేశమైన టీడీపీ నేతలు
-
యనమల చెప్పేదేమైనా భగవద్గీతా..
సాక్షి, విజయనగరం: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న భవనం సీఆర్డీఏ పరిధిలో లేదని చెప్పడానికి యనమల రామకృష్ణుడు ఎవరంటూ రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సూటిగా ప్రశ్నించారు. కృష్ణానది కరకట్టపై నిర్మించిన లింగమనేని ఎస్టేట్ అక్రమ నిర్మాణం అంటూ సీఆర్డీఏ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యనమల, లోకేష్ వ్యాఖ్యలపై స్పందించిన బొత్స సత్యనారాయణ..యనమల చెప్పేదేమైనా..భగవద్గీతా..? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని ఎస్టేట్ అక్రమంగా కట్టారని, అందుకే నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. అక్రమ కట్టడాలు నిర్మించిన ప్రతీ ఒక్కరికి నోటీసులు ఇస్తామని తెలిపారు. అది మాజీ సీఎం అయినా సామాన్యుడైనా ఒకటేనన్నారు. తాము ఎవరిపైనా రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడటం లేదని బొత్స ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. చదవండి : చంద్రబాబు ఇంటికి నోటీసులు గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాలన్నీ లోకేష్, చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయంటూ బొత్స ఎద్దేవా చేశారు. చంద్రబాబు విద్యుత్ కోనుగోళ్ల ఎంఓయూలతో రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో విద్యుత్ రేట్లు ఒక్క పైసా కూడా పెంచలేదని గుర్తు చేశారు. బాబు హయాంలో ఎప్పుడూ దోచేద్దామా అన్నట్టుగా పాలన చేశారంటూ గత ప్రభుత్వ తీరును ఎండగట్టారు. విద్యుత్ రేట్లు పెంచిన బాబు ఐదేళ్లలో ఎంత విద్యుత్ ఉత్పత్తిని పెంచారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎవరెంత గగ్గోలు పెట్టినా ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష, ద్వేషం లేదని, అక్రమాలకు తావు లేకుండా సుపరిపాలన సిద్ధించడం కోసమే చర్యలు తీసుకుంటున్నామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. -
చంద్రబాబు ఇంటి ముందు హంగామా
సాక్షి, ఉండవల్లి : టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై ప్రభుత్వం కొరడా ఝళిపించిన విషయం తెలిసిందే. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమంగా నిర్మించిందేనని నిర్ధారించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నివాసానికి బయటవైపు గోడకు లింగమనేని రమేష్ పేరుతో అధికారులు నోటీసులు అంటించారు. లింగమనేని ఎస్టేట్‌కు సీఆర్డీఏ నోటీసులు ఇస్తే... చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్లు ఎల్లో మీడియా ప్రచారం చేపట్టింది. టీడీపీ నేతలు మరో అడుగు ముందుకేసి... చంద్రబాబుకు సంఘీభావం తెలిపినట్లు రైతుల ముసుగులో పార్టీ కార్యకర్తలను రంగంలోకి దించారు. అక్రమ కట్టడం నుంచి చంద్రబాబును తరలిస్తే ఊరుకునేది లేదంటూ హంగామా చేశారు. చదవండి : చంద్రబాబు ఇంటికి నోటీసులు -
చంద్రబాబు నివాసంతో సహా 28 ఇళ్లకు నోటీసులు
-
చంద్రబాబు ఇంటికి నోటీసులు
సాక్షి, అమరావతి: కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమంగా నిర్మించిందేనని నిర్ధారించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నివాసానికి బయటవైపు గోడకు లింగమనేని రమేష్ పేరుతో అధికారులు నోటీసులు అంటించారు. చంద్రబాబు నివాసంతోపాటు 28 భవనాలకు నోటీసులు ఇచ్చారు. చట్టపరమైన అనుమతి పొందకుండా మొదటి అంతస్తు గదులు, భవన నిర్మాణం చేపట్టారని సీఆర్డీఏ సెక్షన్ 115(1)&115(2) కింద నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని, సంజాయిషీ సరిగ్గా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇలాంటి నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. అక్రమ కట్టడమైన ప్రజావేదికను ఆయన ఆదేశాల మేరకు ఇప్పటికే తొలగించారు. -
అక్రమ నిర్మాణదారులకు షోకాజ్ నోటీసులు!
సాక్షి, అమరావతి: కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇలాంటి నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. చట్టాలను ఉల్లంఘిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా కరకట్ట లోపల నిర్మించిన నిర్మాణాలన్నింటికీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) నోటీసులను సిద్ధం చేసింది. ఏ క్షణమైనా అక్రమ నిర్మాణదారులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇల్లు కూడా అక్రమంగా నిర్మించిందేనని సీఆర్డీఏ నిర్ధారించింది. చంద్రబాబు సహా ఆ భవన యజమాని లింగమనేని రమేష్‌కు సైతం నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. కరకట్ట లోపల నిర్మించిన మిగిలిన అన్ని భవనాల యజమానులకు నోటీసులు ఇవ్వనున్నారు. అక్రమ కట్టడమైన ప్రజావేదికను జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే తొలగించారు. దీనికి కొనసాగింపుగా అన్ని అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు సీఆర్డీఏ నడుం బిగించింది. అక్రమ నిర్మాణానికి ప్రజల సొమ్ముతో హంగులు కృష్ణా నదీ తీరంలో లింగమనేని రమేష్ కొన్నేళ్ల క్రితం నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి అతిథిగృహం నిర్మించగా, 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని లీజుకు తీసుకుని అందులో నివసిస్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే అక్రమ కట్టడంలో నివాసం ఉండడం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నించినా చంద్రబాబు లెక్కచేయలేదు. పైగా ప్రభుత్వ నిధులతో ఆ భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జీ+1 భవనంలో అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు అక్రమ కట్టడాలను ప్రోత్సహించడంతో కరకట్ట లోపల చాలామంది అక్రమ నిర్మాణాలు చేశారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సామాన్యుడికి ఒక నిబంధన, పెద్దలకు ఒక నిబంధన ఉండదని, అన్ని అక్రమ నిర్మాణాలను తొలగించేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు నివాసంలో అన్నీ అతిక్రమణలే చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ అతిథి గృహంలో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన జీ+1 భవనం, ఇతర నిర్మాణాలను వారం రోజుల్లో తొలగించాల్సి ఉందని, వాటిని ఎందుకు నిర్మించారో వివరణ ఇవ్వాలని సీఆర్డీఏ నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. సీఆర్డీఏ నుంచి అనుమతి తీసుకోకపోవడం, ఏపీ బిల్డింగ్ రూల్స్–2012, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2015లో జారీ చేసిన ఉత్తర్వులు, అమరావతి క్యాపిటల్ సిటీ జోనింగ్ రెగ్యులేషన్–2016కి విరుద్ధంగా ఈ నిర్మాణాలు ఉన్నట్లు సీఆర్డీఏ గుర్తించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలోని డి.నెం.250, 254, 272, 274, 790/1లో ఎకరం ఆరు సెంట్ల స్థలంలో అనుమతి లేని ఈ నిర్మాణాలను గుర్తించారు. తమ నోటీసులపై వారం రోజుల్లో స్పందించి వివరణ ఇవ్వాలని, లేకపోతే సంబంధిత భవనాన్ని తొలగిస్తామని నోటీసుల్లో స్పష్టం చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ సంజాయిషీ ఇచ్చినా, అది సంతృప్తికరంగా లేకపోయినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. కృష్ణానది కరకట్టపై వంద మీటర్ల లోపు 50కి పైగా భవనాలను అక్రమంగా నిర్మించినట్లు సీఆర్డీఏ అధికారులు గుర్తించారు. వాటన్నింటికీ నోటీసులు అందజేయనున్నారు. నోటీసుల్లో ఇచ్చిన గడువులోపు భవన యజమానులు, అద్దెదారులు వివరణ ఇవ్వకపోయినా, అది సరిగ్గా లేకపోయినా నిబంధనలకు అనుగుణంగా వాటిని కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నారు. -
అక్రమాల కట్టడం కేరాఫ్ లింగమనేని గెస్ట్ హౌజ్
-
రేంజ్ దెబ్బతినకుండా రాజధాని రవాణా మార్గం
తాడేపల్లి(గుంటూరు జిల్లా): ఫైరింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు చెప్పారు. బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని అమరావతి కరకట్టపై ఉన్న సీఎం అతిథి గృహం లింగమనేని గెస్ట్ హౌస్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం ఉండవల్లిలోని ఫైరింగ్ రేంజిను పరిశీలించిన డీజీపీ విలేకరులతో మాట్లాడారు. రేంజ్‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాన్స్‌పోర్టు, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్, వెహికిల్ పార్కింగుల కోసం స్థల పరిశీలన కోసం తాను వచ్చినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ఏకైక ఫైరింగ్ రేంజ్ ఇదొక్కటేనని, దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తమ శాఖకు సంబంధించిన స్థలాలను పరిశీలించామని ఆయన తెలిపారు. పోలీసు శాఖకు సంబంధించి తాత్కాలిక కార్యాలయం విజయవాడలోనే ఉందని, దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోనున్నట్టు పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులను రోల్ మోడల్‌గా చేయనున్నట్టు ఆయన తెలిపారు. సీఎం అతిథి గృహం వద్ద భద్రతా చర్యలు పటిష్టం చేస్తామని తెలిపారు. -
అతిథి గృహం సందర్శించిన భువనేశ్వరి
తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం సిద్ధం అవుతున్న లింగమనేని అతిథి గృహాన్ని ఆయన సతీమణి భువనేశ్వరి నిన్న సందర్శించారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు అక్కడకు వచ్చిన ఆమె మధ్యాహ్నం ఒంటిగంట వరకూ అక్కడే ఉండి అన్ని గదులను పరిశీలించారు. భువనేశ్వరి పర్యటన రహస్యంగా జరగడంతో స్థానిక అధికారులకు, నాయకులకు ఈ సమాచారం తెలియలేదు. కాగా తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి కరకట్టపై ఏర్పాటు చేసుకోనున్న అధికారిక నివాసం వద్ద పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అత్యంత గోప్యంగా ఈ పనులు జరుగుతున్నాయి.