తాడేపల్లి(గుంటూరు జిల్లా): ఫైరింగ్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర డీజీపీ జె.వి.రాముడు చెప్పారు. బుధవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని అమరావతి కరకట్టపై ఉన్న సీఎం అతిథి గృహం లింగమనేని గెస్ట్ హౌస్‌ను ఆయన పరిశీలించారు. అనంతరం ఉండవల్లిలోని ఫైరింగ్ రేంజిను పరిశీలించిన డీజీపీ విలేకరులతో మాట్లాడారు. రేంజ్‌కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాన్స్‌పోర్టు, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్, వెహికిల్ పార్కింగుల కోసం స్థల పరిశీలన కోసం తాను వచ్చినట్టు చెప్పారు.
రాష్ట్రంలో ఉన్న ఏకైక ఫైరింగ్ రేంజ్ ఇదొక్కటేనని, దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తమ శాఖకు సంబంధించిన స్థలాలను పరిశీలించామని ఆయన తెలిపారు. పోలీసు శాఖకు సంబంధించి తాత్కాలిక కార్యాలయం విజయవాడలోనే ఉందని, దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోనున్నట్టు పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులను రోల్ మోడల్‌గా చేయనున్నట్టు ఆయన తెలిపారు. సీఎం అతిథి గృహం వద్ద భద్రతా చర్యలు పటిష్టం చేస్తామని తెలిపారు.
రేంజ్ దెబ్బతినకుండా రాజధాని రవాణా మార్గం
Published Wed, Aug 19 2015 8:10 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM
Advertisement