సాక్షి, అమరావతి: కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమంగా నిర్మించిందేనని నిర్ధారించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
నివాసానికి బయటవైపు గోడకు లింగమనేని రమేష్ పేరుతో అధికారులు నోటీసులు అంటించారు. చంద్రబాబు నివాసంతోపాటు 28 భవనాలకు నోటీసులు ఇచ్చారు. చట్టపరమైన అనుమతి పొందకుండా మొదటి అంతస్తు గదులు, భవన నిర్మాణం చేపట్టారని సీఆర్‌డీఏ సెక‌్షన్ 115(1)&115(2) కింద నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని, సంజాయిషీ సరిగ్గా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇలాంటి నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. అక్రమ కట్టడమైన ప్రజావేదికను ఆయన ఆదేశాల మేరకు ఇప్పటికే తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment