karakatta
-
‘అక్రమ కట్టడం.. అధికారిక నివాసమా?.. ఇది సబబేనా బాబూ?’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అధికారిక నివాసం అక్రమ కట్టడమని.. నదీ పరీవాహకంలో ఎలాంటి నివాసాలు ఏర్పాటు చేయకూడదని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మరి చట్టాలు తయారు చేసేవారే అక్రమ నివాసాల్లో ఉండటం సబబేనా? అంటూ ప్రశ్నించారు.‘‘అక్రమ నివాసాన్ని అధికారిక నివాసంగా ఎలా నిర్ణయిస్తారు?. 2014లోనే ఇది అక్రమ కట్టడం అని అధికారికంగానే తేల్చారు. రాష్ట్ర విభజన అనంతరం కొత్త ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వంలోని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇది అక్రమ కట్టడం అని చెప్పారు. దీన్ని కూల్చాలంటూ ప్రకటన కూడా చేశారు. మేథాపాట్కర్, రాజేంద్రసింగ్ వంటి పర్యావరణ వేత్తలు ఈ ప్రాంతాన్ని సందర్శించి అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేశారు’’ అని శివశంకర్ గుర్తు చేశారు.‘‘నదీ పరివాహక చట్టం ప్రకారం వంద మీటర్ల లోపు ఎలాంటి కట్డడాలు చేయకూడదు. కానీ చంద్రబాబు నివాసం నదీ పరివాహకంలోనే ఉంది. లోకాయుక్త సైతం 2015లో ఈ అక్రమ కట్టడాలను తొలగించాలని ఆదేశించింది. అయినాసరే ఆ అక్రమ నివాసాన్ని కూల్చకుండా చంద్రబాబు నివాసం ఉంటున్నారు. ఇటీవల వచ్చిన వరదలతో చంద్రబాబు ఇల్లు ఖాళీ చేసి విజయవాడ కలెక్టరేట్లో తల దాచుకున్నారు. ఈ అక్రమ కట్టడాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు బుడమేరు వరదని విజయవాడ మీదకు తిప్పారు’’ అని శివశంకర్ పేర్కొన్నారు.ఇదీ చదవండి: బాబుకది షరా మామూలే!‘‘ఆ ఇంటిని ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుందని.. ఓనరు లింగమనేని రమేష్ ప్రకటించారు. కానీ చంద్రబాబు మాత్రం అసెంబ్లీలో ఆ బిల్డింగ్‌కి అద్దె కడుతున్నానని చెప్పారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో అబద్దం చెప్పారు. చంద్రబాబు నివాసం అక్రమ కట్టడమే’’ అని పుత్తా శివశంకర్ దుయ్యబట్టారు. -
ప్రమాదకరంగా చంద్రబాబు కరకట్ట నివాసం..
-
చంద్రబాబు అధికార నివాసంగా కరకట్ట..
సాక్షి, విజయవాడ: కరకట్ట నివాసాన్ని సీఎం చంద్రబాబు అధికార నివాసంగా ప్రభుత్వం ప్రకటించింది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు గృహాన్ని సీఎం అధికారిక నివాసంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జూన్ 12 నుంచి సీఎం అధికారిక నివాసంగా గుర్తిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇదే కరకట్ట నివాసంపై అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.ఇది అక్రమ నిర్మాణం అంటూ గతంలో మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రకటించారు. అదే అక్రమ నివాసాన్ని అధికారిక నివాసంగా ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణ నది కరకట్ట లోపల ఈ నివాసాన్ని లింగమనేని రమేష్ నుంచి చంద్రబాబు తీసుకున్నారు.ఇదీ చదవండి: కూటమి సర్కార్ ‘రాజకీయ’ కక్ష.. మహిళను అవమానించేలా..కాగా, చంద్రబాబు ఉంటున్న కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మించారనే ఆరోపణలున్నాయి. లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ నివాసంలో గత కొన్నేళ్లుగా నివసిస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదాలోనూ, సీఎం హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు నివసిస్తున్నారు.ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్.. చంద్రబాబుకు వ్యక్తిగతంగానే ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజధాని మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లలో కుంభకోణం ద్వారా భారీగా ప్రయోజనం కల్పించినందున క్విడ్ ప్రోకోలో భాగంగానే కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు ఇచ్చేరనే విమర్శలు ఉన్నాయి. -
చంద్రబాబు కరకట్ట ఇంటికి కొత్త హంగులు.. భారీగా ఖర్చు!
సాక్షి, విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి కొత్త హంగులు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు కరకట్ట నివాసానికి వీవీఐపీ సదుపాయాల కోసం భారీ ఖర్చు చేస్తున్నారు. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.కరకట్టపై ఉన్న సీఎం చంద్రబాబు ఇంటి హంగులకు 1.44 రూపాయల కోట్లు ఖర్చు చేయనున్నారు. కరకట్ట నివాసంలో వీవీఐపీ సదుపాయాలు కోసం భారీ ఖర్చు చేస్తున్నారు. కరకట్ట నివాసానికి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు కోసం 21 లక్షలు ఖర్చు చేయనున్నారు. అలాగే, కరకట్ట నివాసం లోపల, బయట నిఘా కోసం 81 లక్షలతో సీసీ కెమెరాల ఏర్పాటు. సీఎం ఇంటికి వచ్చే వాహనాల తనిఖీ, నియంత్రణ, యూవీఎస్ఎస్, హైడ్రాలిక్ బోలార్డ్స్ కోసం 42 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
కరకట్ట కొంపలో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు.. విజయవాడకు పారిపోయిన చంద్రబాబు
-
వరదలపై చంద్రబాబు విచిత్ర వ్యాఖ్యలు
అమరావతి, సాక్షి: వాతావరణ శాఖ హెచ్చరికలను పట్టించుకోకుండా ముంపు పరిస్థితికి కారణమైన చంద్రబాబు సర్కార్.. ఇప్పుడు సహాయక చర్యల విషయంలోనూ అలసత్వం ప్రదర్శిస్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. నాలుగు రోజులు గడిచినా.. ఇంకా విజయవాడ జలదిగ్బంధంలోనే ఉండిపోయింది.అయితే స్వయంగా తానే గ్రౌండ్లెవల్లో ఉన్నానంటూ ఫొటోలకు ఫోజులు, బిల్డప్‌లు ఇచ్చుకుంటున్న చంద్రబాబు.. తాజాగా వరదలపై విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ జరిగిన మీడియా సమావేశంలో.. సాక్షి రిపోర్టర్ కరకట్టలోని చంద్రబాబు నివాసం మునిగిన విషయాన్ని ప్రస్తావించారు. అంతటితో ఆగకుండా.. ఆ విజువల్స్, ఫొటోలు చూపించారు. అయితే.. అదంతా అబద్ధం అంటూ సాక్షి విలేఖరికి అంతెత్తు ఎగిరిపడ్డారు సీఎం చంద్రబాబు. విజయవాడలో చాలా ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి. అందరి ఇళ్లలాగే మా ఇంట్లోకి నీళ్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏంటి?.. అంటూ అసహనం ప్రదర్శించారాయన. -
కరకట్ట అతలాకుతలం..
-
ప్రమాదకరంగా చంద్రబాబు కరకట్ట నివాసం
సాక్షి,అమరావతి : ప్రకాశం బ్యారేజ్‌కు రికార్డ్ స్థాయిలో వరద నీరు చేరింది. వరద ఇన్‌ఫ్లో,ఔట్ ఫ్లో 11.43 లక్షల క్యూసెక్కులు దాటింది. దీంతో కరకట్ట మీదగా నీరు ప్రవహించడంతో.. ఆ వరద చంద్రబాబు నివాసంలోపలకి వెళ్లింది. నీరు లోపలికి రాకుండా సిబ్బంది ఆదివారం లారీలతో ఇసుక తరలించి అడ్డుపెట్టారు. అయినప్పటికీ వరద తీవ్రతతో నీరు చంద్రబాబు ఇంటి లోపలికి చేరింది. దీంతో సిబ్బంది ఆరుకు పైగా మోటర్లను ఉపయోగించి వరద నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.చంద్రబాబు నివాసాన్ని చుట్టుముట్టిన వరదఆదివారం రాత్రి 7గంటలకు ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరుతున్న ప్రవాహం 9,17,976 క్యూసెక్కులకు చేరడంతో కృష్ణా నది కరకట్ట లోపల ఉన్న చంద్రబాబు నివాసాన్ని వరద చుట్టుముట్టింది. ఇందులో నారా లోకేష్ గెస్ట్ హౌస్‌గా పేర్కొనే అప్పారావు బంగ్లా కూడా ఉంది. అయితే ఇసుక బస్తాలు వేసి వరద నీరు లోపలికి రాకుండా ఆపే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమైంది. కలెక్టర్ కార్యాలయంలో బాబు బసఆదివారం రాత్రికి కృష్ణా వరద ఉధృతి మరింత పెరుగుతుందని, రాత్రికి ఉండవల్లి నివాసంలో బస చేస్తే ప్రమాదమని సీఎం చంద్రబాబుకు జనవనరుల శాఖ అధికారులు వివరించారు. దీంతో ఆదివారం రాత్రికి విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు బస చేశారు. -
కృష్ణ కరకట్ట ఆక్రమణల తొలగింపు ఎప్పుడు?
-
బాబు కస్టడీకి మరో పిటిషన్: కరకట్ట రీఅలైన్మెంట్ స్కాం ఏంటీ?
సాక్షి, అమరావతి: విజయవాడ ACB కోర్టులో చంద్రబాబు కస్టడీకి మరో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కేసులో కస్టడీ కావాలని ఏపీ సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వమని పిటీషన్లో కోరింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ అలైన్మెంట్ కేసులో చంద్రబాబును A1 ముద్దాయిగా సీఐడీ పేర్కొంది. కరకట్ట ఇన్నర్ రింగ్ స్కాం అసలు కథ ఇదే? టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే అని దర్యాప్తులో తేటతెల్లమవుతోంది. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్‌లో భూములు దక్కాయని తేలిపోయింది. అసలేం జరిగింది? అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ అంతా నాటి సీఎం, ఈ కేసులో ఏ–1 చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన సమయంలో సీఆర్డీయే ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా వ్యవహరించిన చంద్రబాబుకు మాస్టర్‌ప్లాన్ గురించి మొత్తం ముందే తెలుసు. మాస్టర్‌ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకుంది చంద్రబాబే అని పేర్కొంది. అంతేకాదు రాజధాని ఎంపిక, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు ప్రక్రియలో ఆయనకు పూర్తి భాగస్వామ్యం ఉంది. అలైన్మెంట్ మూడుసార్లు మార్పు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారని స్పష్టమయింది. టీడీపీ ప్రభుత్వంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మూడుసార్లు మార్చారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్ అలైన్మెంట్లో మార్పులు జరిగాయి. ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి టీడీపీ ప్రభుత్వం ప్రయోజనం కల్పించిందన్నది ప్రధాన అభియోగం. ఈ కేసులో ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ కుటుంబానికి ఇన్నర్‌రింగ్ రోడ్డు తుది అలైన్‌మెంట్‌ను ఆనుకునే 168.45 ఎకరాలు ఉన్నాయి. అయితే ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేదని, లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలోనే అలైన్‌మెంట్‌ను ఖరారు చేసినట్లు దర్యాప్తులో తేలింది. కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబు ఉంటున్న కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మించారని తేలింది. ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ నివాసంలో ఏడేళ్లుగా నివసిస్తున్నారు. సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు నివసిస్తున్నారు. ఆ నివాసం గురించి ప్రభుత్వంతో లింగమనేని అధికారికంగా ఎలాంటి వ్యవహారాలు నెరపలేదు. అంటే ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు. కరకట్ట నివాసాన్ని లింగమనేని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారంటూ టీడీపీ చేస్తున్న వాదన పూర్తిగా అవాస్తవం. ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ చంద్రబాబుకు వ్యక్తిగతంగానే ఇచ్చారు. రాజధాని మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లలో కుంభకోణం ద్వారా భారీగా ప్రయోజనం కల్పించినందున క్విడ్ ప్రోకోలో భాగంగానే కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. హెరిటేజ్ భూముల లావాదేవీలు గోప్యం లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేస్తున్నట్టు చూపిస్తున్న భూముల బాగోతం కూడా బట్టబయలైంది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు లింగమనేని కుటుంబం భూములు అమ్మినట్టు ఎలాంటి లావాదేవీలను చూపించలేదు. రాజధాని ప్రాంతంలో లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసిన భూములకు సంబంధించి లావాదేవీలను చంద్రబాబు వెల్లడించలేదని తేలింది. లోకేశ్‌దీ కీలక పాత్రే... క్విడ్ ప్రోకో కింద అమరావతిలో లింగమనేని కుటుంబం భూములను హెరిటేజ్‌కు బదలాయించడంలో నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారన్నది బట్టబయలైంది. లింగమనేని కుటుంబం నుంచి భూములు తీసుకునేందుకు హెరిటేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానించారు. హెరిటేజ్ డైరెక్టర్‌గా లోకేశ్ ఆ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మంత్రిగా ఉంటూ చంద్రబాబుతో కరకట్ట నివాసంలోనే నివసించారు. అంటే లింగమనేని కుటుంబానికి భారీగా ప్రయోజనం కల్పించి క్విడ్ ప్రోకో కింద హెరిటేజ్ భూములు దక్కించుకోవడంలో, కరకట్ట నివాసాన్ని సొంతం చేసుకోవడంలోనూ లోకేశ్ క్రియాశీల పాత్ర పోషించారన్నది స్పష్టమైంది. కథ నడిపిన ఏ–2 నారాయణ అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా నారాయణ కుటుంబం నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం పొందినట్లు స్పష్టమైంది. మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల వ్యవహారాలన్నీ నారాయణకు పూర్తిగా తెలుసని, అంతా ఆయన ఆధ్వర్యంలోనే సాగిందని దర్యాప్తులో వెల్లడయింది. ఈ కేసులో ఇప్పటికే నారాయణ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సీడ్ క్యాపిటల్‌లో భూములు కొనుగోలు చేశారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయి. తద్వారా సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో కొనుగోలు చేసిన భూములు సీఆర్డీయేకే భూసమీకరణ కింద ఇచ్చి 75,888 చ.గజాల ప్లాట్లు పొందారని తేలింది. ఆ భూములపై కౌలు కింద రూ.1.92కోట్లు కూడా పొందారని పేర్కొంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కరకట్ట నివాసం, సీడ్ క్యాపిటల్‌లో నారాయణ కుటుంబ సభ్యులకు కేటాయించిన 75,888 చ.గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేసేందుకు కోర్టు కూడా అనుమతినిచ్చింది. -
ఆవనిగడ్డ కరకట్ట కేసు.. ఆ అర్ధరాత్రి ఏం జరిగింది?
సాక్షి, కృష్ణా: చోడవరం వద్ద కరకట్ట కాలువలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో.. గాజుల రత్నభాస్కర్ (47) మృతదేహంగా దొరికిన సంగతి విదితమే. అయితే ఈ కేసు పెద్ద మిస్టరీగా మారడంతో.. చేధించే పనిలో పోలీసులు తలమునకలయ్యారు. ముదినేపల్లికి కారులో వెళ్లాల్సిన భాస్కర్ చోడవరం వైపు వెళ్లడం.. చివరకు శవమై కనిపించడం, పైగా వెంట తీసుకెళ్లిన డబ్బులూ కనిపించకుండా పోవడంతో.. కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అవనిగడ్డ ప్రమాదం కేసు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. కెనాల్లో కారు దూసుకెళ్లిన 36 గంటల తర్వాత(మంగళవారం ఉదయం).. తోట్లవల్లూరు మండలం కళ్లంవారిపాలెం వద్ద నగ్నంగా రత్నభాస్కర్ మృతదేహం తేలింది. మృతుడి కుటుంబ సభ్యులు అవనిగడ్డ నుంచి వచ్చి మృతదేహాన్ని చూసి రత్నభాస్కర్‌దేనని గుర్తించారు. ఒంటిపై గాయాలు - ఎలాంటి క్లూ లేకపోవడంతో ఏం జరిగిందన్నది నిర్ధారించుకోలేకపోయారు పోలీసులు.. మూడు బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేపట్టారు. అర్థరాత్రి ఏం జరిగింది.. రత్నభాస్కర్ ఇంటి నుంచి బయల్దేరిన రోజు అర్ధరాత్రి ఏం జరిగిందనేదే మిస్టరీగా మారింది. ఇంటి నుంచి ఆయన రూ.4 లక్షలతో బయల్దేరినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో.. ఆర్థిక లావాదేవీలు, శత్రువులున్నారా? లేదంటే దొంగల పనా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేపట్టారు. అలాగే.. రత్నభాస్కర్ కారు జర్నీ ఆధారంగా సీసీఫుటేజ్ సేకరిస్తున్నారు. ఈ క్రమంలో రెండు చోట్ల ఒంటరిగానే వెళ్తున్నట్లు కనిపించినట్లు తెలుస్తోంది. పోస్టుమార్టం కీలకం.. రత్నభాస్కర్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహం దొరికినా కేసులో మిస్టరీ మాత్రం వీడలేదు. ఈ కేసులో పోస్టుమార్టం కీలకంగా మారనుంది. నివేదిక వస్తేనే.. ఏం జరిగిందనేదానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జరిగింది ఇదే.. ముదినేపల్లికి చెందిన ఐస్ ఫ్యాక్టరీ యజమాని గాజుల రత్నభాస్కర్ ఆదివారం మచిలీపట్నంలో నిర్వహించిన టీడీపీ సమావేశానికి వెళ్లాడు. అక్కడి నుంచి ముదినేపల్లి ఐస్ ఫ్యాక్టరీ వద్దకు వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన సోమవారం వేకువజామున చోడవరం వద్ద తాను ప్రయాణిస్తున్న కారుతో సహా కేఈబీ కెనాల్లోకి దూసుకువెళ్లాడు. మచిలీపట్నంలో ఉన్న రత్నభాస్కర్ ముదినేపల్లికి వెళ్లకుండా చోడవరం వచ్చి శవమై తేలడంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడాలని కారులోనే దుస్తులు విప్పి కాలువలోకి రత్నప్రసాద్ దిగి మృతి చెందాడా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులో ఉన్న దుస్తులు, సెల్‌ఫోన్ పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. కేసును అన్ని కోణాల నుంచి విచారణ చేస్తామని డీఎస్పీ జయసూర్య తెలిపారు. -
చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ క్విడ్ ప్రోకో బట్టబయలు
-
చంద్రబాబు కరకట్ట నివాసం కేసుపై నేడు విచారణ
-
చంద్రబాబు కరకట్ట నివాసం కేసు.. విచారణ 30కు వాయిదా
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో భూ కుంభకోణాల కేసులో చంద్రబాబు కరకట్ట నివాసాన్ని అటాచ్ చేయాలన్న సీఐడీ పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 30కు వాయిదా వేసింది. ఈ కేసుపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో బుధవారం వాదనలు సందర్భంగా కరకట్ట నివాసానికి సమాన విలువైన ఆస్తిని ష్యూరిటీగా చూపిస్తామని లింగమనేని రమేశ్ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దానిపై సీఐడీ తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇక ఇదే కేసులో నారాయణ కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయడంపై న్యాయస్థానం కోరిన వివరాలను సీఐడీ న్యాయవాది సమర్పించారు. అనంతరం ఈ కేసును న్యాయమూర్తి ఈ నెల 30కు వాయిదా వేశారు. -
‘కరకట్ట నివాసం జప్తు’ పిటిషన్.. ఇరువైపులా ముగిసిన వాదనలు
సాక్షి, కృష్ణా: కరకట్టపై చంద్రబాబు అక్రమ నివాసాన్ని(లింగమనేని గెస్ట్‌హౌజ్) జప్తునకు అనుమతి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ(శుక్రవారం) వాదనలు కొనసాగాయి. వాస్తవానికి ఇవాళ తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే.. విజయవాడ ఏసీబీ కోర్టులో ఇప్పటికే సీఐడీ వాదనలు పూర్తి కాగా.. తమ వాదనలూ వినాలని లింగమనేని తరపు న్యాయవాది కోరడంతో కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో.. లింగమనేని తరపున అడ్వొకేట్ అశ్వినీ కుమార్ ఇవాళ(జూన్ 2, 2023 శుక్రవారం) వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లో సీఐడీ తరపున అడ్వొకేట్ వివేకానంద వాదించారు. ఇరు పక్షాల వాదనలు నేటికి పూర్తి కావడంతో జూన్ 6వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. అదే రోజు ఈ పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. కరకట్టపై లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్‌ను చంద్రబాబు అక్రమంగా పొందారనేది ఏపీసీఐడీ ప్రధాన అభియోగం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లలో లింగమనేనికి లబ్ది చేకూర్చి బదులుగా ఆయన ఇంటిని గెస్ట్ హౌస్‌గా పొందారని సీఐడీ చెబుతోంది. ఇదీ చదవండి: చంద్రబాబు అద్దె కొంప కహానీ ఇదీ! -
ఏపీ సీఐడీ పిటిషన్ పై తీర్పు వాయిదా
-
చంద్రబాబు ‘కరకట్ట నివాసం జప్తు’పై ముగిసిన వాదనలు.. జూన్ 2న తీర్పు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు కరకట్ట నివాసం జప్తు పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బిందుమాధవి.. తీర్పు జూన్ 2న వెలువరించనున్నారు. కాగా కరకట్టపై చంద్రబాబు ఇల్లు జప్తునకు అనుమతి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లలో లింగమనేనికి లబ్ది చేకూర్చి బదులుగా ఆయన ఇంటిని గెస్ట్ హౌస్‌గా పొందారని సీఐడీ అభియోగాలు మోపింది. కరకట్టపై చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ ఇంటిని జప్తు చేసేందుకు అనుమతివ్వాలని కోరింది. చదవండి: ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఈ మేరకు సీఐడీ తరపు న్యాయవాది వివేకానంద మాట్లాడుతూ.. ఏపీ సీఐడీ తరపున 2 పిటిషన్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేశామని తెలిపారు. లింగమనేని రమేష్ ఇల్లు అటాచ్ మెంట్ పిటిషన్ ఒకటి కాగా, మాజీమంత్రి నారాయణ బంధువుల ఆస్తుల జప్తు పిటిషన్ మరొకటని తెలిపారు. 1944 ఆర్డినెన్స్ ప్రకారం తన పిటిషన్‌పై ఆర్డర్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. నేరం జరిగిందా లేదా అనేది తెలుసుకునేందుకు అవసరమైతే అఫిడవిట్ వేసిన అధికారిని కోర్టు విచారణ చేయవచ్చని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ దశలో ప్రతివాదులకు నోటీసు ఇచ్చే అవకాశం లేదని చెప్పినట్లు తెలిపారు. జప్తు ఉత్తర్వులు ఇవ్వటమా, నిరాకరించటమా అనేది ఆదేశాలు వచ్చిన తర్వాత ప్రతివాదులకు నోటీసులు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. చదవండి: మరోసారి ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు.. -
కరకట్టపై చంద్రబాబు నివాసముంటున్న ఇల్లు జప్తునకు సీఐడీ దరఖాస్తు
-
చంద్రబాబు ‘కరకట్ట నివాసం జప్తు’పై నేడు విచారణ
సాక్షి, విజయవాడ: కరకట్టపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నివాసాన్ని జప్తు చేసేందుకు అనుమతివ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది. విజయవాడ ఏసీబీ కోర్టు ఈ పిటిషన్‌పై వాదనలు విననుంది. చంద్రబాబు ఉంటున్న ఆ నివాసం.. లింగమనేని రమేష్ పేరిట(గెస్ట్హౌజ్గా) ఉంది. అయితే.. దానిని చంద్రబాబు అక్రమంగా పొందారని, దానిని జప్తు చేసేందుకు అనుమతి ఉత్తర్వులు ఇవ్వాలంటూ నాలుగురోజుల క్రితం దరఖాస్తు చేసుకుంది సీఐడీ. దీంతో.. విచారణ తర్వాత తీర్పు ఇవ్వనుంది ఏసీబీ కోర్టు. -
కరకట్ట నివాసం ఎవరిది బాబూ?
(సాక్షి, అమరావతి) : ఇంతకీ కరకట్ట నివాసం ఎవరిది? చంద్రబాబుదా... లేక ప్రభుత్వానిదా? ‘‘ఆ ఇంటికి సంబంధించి అవినీతికి తావెక్కడుంది? ఎందుకంటే ఆ ఇల్లు ప్రభుత్వానిది. లింగమనేని రమేశ్ నుంచి ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా తీసుకున్నాం. ఒకవేళ ఇవ్వకపోయి ఉంటే భూసేకరణ ద్వారా తీసుకుని ఉండేవాళ్లం’’ అని నేరుగా చంద్రబాబే.. సాక్షాత్తూ అసెంబ్లీలో చెప్పారు. ఇక లింగమనేని కూడా... ఆ ఇల్లు పూలింగ్‌లో తాను ప్రభుత్వానికి ఇచ్చేశానని, అక్కడ భారీ భవంతులు కడితే తనకెంతో సంతోషమని కూడా చెప్పారు. వీళ్ల మాటలకు వీడియో సాక్ష్యాలూ ఉన్నాయి. ఇక్కడ అసలు ప్రశ్నేమిటంటే... : ఆ ఇల్లు ప్రభుత్వానిది అయినపుడు ప్రభుత్వ రికార్డుల్లో ఆ సంగతి ఉండాలి కదా? ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక కూడా చంద్రబాబు అందులో ఉంటున్నారంటే... అందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి కదా? అసలు ఆ ఇల్లు ప్రభుత్వానిదన్న సంగతి ప్రభుత్వ రికార్డుల్లోనే లేదంటే ఏమనుకోవాలి? వీళ్లంతా కలిసి ఎంతటి దొంగల రాజ్యాన్ని నడిపించారో తెలియటం లేదా? ప్రభుత్వాస్తుల్ని కూడా ప్రయివేటు ఆస్తుల్లా ఎలా మార్చేసుకున్నారో తెలియటం లేదా? చంద్రబాబు చెబుతున్న దాని ప్రకారం అది ప్రభుత్వ ఆస్తే అయినపుడు... : ప్రభుత్వం ఇపుడు ఇన్నర్ రింగ్‌రోడ్ కుంభకోణంలో భాగంగా ఆ ఇంటిని జప్తు చేస్తుంటే ఉలుకెందుకు? అదేదో చంద్రబాబు సొంత ఆస్తిలా ఫీలవుతూ... ‘ఈనాడు’ దుర్మార్గపు రాతలెందుకు? బాబును టార్గెట్ చేస్తున్నారంటూ రామోజీ శోకాలెందుకు? ఇదంతా రాజకీయ కక్ష సాధింపేనంటూ తెలుగుదేశం డ్రామాలెందుకు? ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వం జప్తు చేస్తుంటే వీళ్లంతా ఎందుకింత దుష్ప్రచారానికి తెగిస్తున్నారు? ఇంకెన్నాళ్లు బాబూ ఈ డ్రామాలు? నాడు అసెంబ్లీలో చంద్రబాబు చెప్పిందిదీ.. : ప్రజా వేదిక నాది కాదు. ప్రభుత్వానిది. నేనుంటున్న భవనం నాది కాదు. రమేష్ అనే డెవలపర్‌ది. నేను తాత్కాలికంగా ఉంటున్నాను. నేనొక టెనెంటే (అద్దెకుంటున్న వాడిని). ప్రెస్మీట్లో చంద్రబాబు చెప్పిందిదీ..: గ్యాస్ ఇచ్చామని ప్రతిఫలంగా ఇల్లు ఇచ్చారని ఆరోపించారు. ఇల్లు ఇవ్వడమేంటి? అది గమర్నమెంట్ ఇల్లు. నేనున్నానంటే..అది గవర్నమెంట్ ఇల్లు కాబట్టి ఉన్నాను. నేను మొదటి రోజే చెప్పాను. దిస్ ప్రొపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్. నువ్ ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకుంటాం. ఇస్తే ల్యాండ్ పూలింగ్‌లో తీసుకుంటాం. ఇవ్వకపోతే లాండ్ అక్విజిషన్‌లో తీసుకంటాం. టెంపరరీగా నేను ఉండాలి. కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి కాబట్టి నేను అక్కడ ఉంటున్నా. కట్టకు ఆవతల ఉండే ల్యాండ్ అంతా, కట్టడాలన్నీ పోయి టూరిజం, మిగతావన్నీ వస్తాయి. మాస్టర్ ప్లాన్‌లో కూడా నోటిఫై చేశారు. లింగమనేని రమేష్ విలేకరులతో చెప్పిందిదీ.. : ప్రభుత్వం ఆ భవనాన్ని పూలింగ్‌లో తీసుకుంది. దేశంపై భక్తితో ఇచ్చేశాను. నాకు ఆ భవనంతో ఏ రకమైన సంబంధం లేదు. -
చంద్రబాబు బరితెగింపునకు నిదర్శనం ‘కరకట్ట నివాసం’: సజ్జల
సాక్షి, విజయవాడ: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెనుకబడిన వర్గాల అభివృద్ధి దిశగా పనిచేస్తున్నారని తెలిపారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లెఫ్ట్ పార్టీలు సంపన్నుల వైపు నిలబడతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏజెంట్లా పవన్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ రాజకీయ నిర్ణయాలు చంద్రబాబుకు రాజకీయంగా ఉరితాడు లాంటివని అన్నారు. అందుకే తోడేళ్ల మందలా ఏకమై దాడి చేయాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణసీకారోత్సవ కార్యక్రమం అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. 'రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మేలు చేసేలా సీఎం జగన్ పాలన ఉంది. మేనిఫెస్టోలో 98.2 శాతం హామీలను అమలు చేసి చూపించారు. చంద్రబాబు హయాంలో జరిగిన దేశంలోనే అతిపెద్ద స్కామ్ అమరావతి. బాబు అక్రమాలకు చిరునామా చంద్రబాబు కరకట్ట నివాసం. లింగమనేని రమేష్‌కి, హెరిటేజ్‌కి మధ్య లావాదేవీలు జరిగాయి. చంద్రబాబు బరితెగింపునకు నిదర్శనం ఈ అక్రమ నివాసం. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చట్టం చేసిన వ్యక్తి చంద్రబాబు. డబ్బున్న వాళ్లకోసం పేదలకు ఇవ్వకుండా చేశారు. రియల్ఎస్టేట్ ఏజెంట్ల ద్వారా చంద్రబాబు గొడవ చేయిస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారు.' అని సజ్జల ఫైర్ అయ్యారు. చదవండి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం.. -
చంద్రబాబు బినామీగా ఆస్తులు కూడబెట్టిన లింగమనేని రమేష్
-
కరకట్టపై చంద్రబాబు గెస్ట్ హౌస్ అటాచ్ చేసిన ప్రభుత్వం
-
అక్కడ టీడీపీ, జనసేన లేవు.. సజావుగా అక్రమ కట్టడాల కూలివేత!
కొద్ది రోజుల క్రితం దేశరాజధానికి అల్లంత దూరంలో ఉన్న నోయిడాలోని అతి పెద్ద ట్విన్ టవర్స్‌ను ప్రభుత్వ యంత్రాంగాలే దగ్గరుండి కూల్చివేశాయి. ఇందుకోసం 3,700 కిలోలో పేలుడు పదార్ధాలను వినియోగించాయి. టవర్స్ నిర్మాణానికి కొన్ని ఏళ్లు పడితే వాటిని కూల్చి వేయడానికి కేవలం 9 సెకన్లు మాత్రమే పట్టింది. ఏడున్నర లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ టవర్లలో 900 ఫ్లాట్స్ ఉన్నాయి. కొన్ని వందల కోట్ల రూపాయల విలువజేసే ఆస్తి ఇది. కుతుబ్ మీనార్ కన్నా పొడవైన నిర్మాణం ఇది. ఇంతటి ఆస్తిని కూల్చివేయడానికి కారణం ఒక్కటే. టవర్స్ నిర్మించిన రియల్ ఎస్టేట్ కంపెనీ అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి ఇష్టారాజ్యంగా నిర్మాణం చేసుకుపోయింది. దాంతో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోర్టుకు వెళ్లారు. అన్నీ విన్న అత్యున్నత న్యాయస్థానం ఈ టవర్స్‌ను కూల్చివేయాల్సిందేనని ఆదేశించింది. సుప్రీం తీర్పుతో ఆగస్టు 28న ఈ టవర్స్ ను కూల్చివేశారు. దీనికి రెండేళ్ల క్రితం.. కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో మారాడు గ్రామంలో అద్భుతమైన సరస్సును ఆనుకుని నాలుగు పెద్ద పెద్ద లగ్జరీ అపార్ట్మెంట్లను అధికారులు కూల్చివేశారు. 2020 జనవరి 11న అత్యంత విలాసవంతమైన ఈ అపార్ట్ మెంట్లను పేలుడు పదార్ధాలతో కూల్చివేశారు. దీనికి కారణం లేకపోలేదు. ఈ అపార్ట్ మెంట్ల నిర్మాణంలో పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపణలు ఉన్నాయి. వాటిపై ఫిర్యాదు చేసి అభ్యంతరాలు వ్యక్తం చేసినా భవన నిర్మాణాలు చేపట్టిన సంస్థ పట్టించుకోలేదు. మనల్ని ఎవరేం చేస్తారులే అని ధీమా వారిది. డబ్బుతో దేన్నయినా కొనేయచ్చన్న అహంకారం. వెరసి నిబంధనలను తొక్కి పారేసి అపార్ట్ మెంట్లు కట్టి పారేశారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అదే సమయంలో అపార్ట్ మెంట్లు కొనుకున్న వారు తాము జీవితాంతం కూడబెట్టిన సొమ్ముతో ఇళ్లు కొనుక్కున్నామని వాటిని కూల్చివేయవద్దని విజ్ఞప్తులు చేసుకున్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కోట్లాది రూపాయల డబ్బు ఉన్నా కూడా పర్యావరణ నిబంధనలు అమలు చేయడమే ముఖ్యమని భావించింది. అందుకే ఈ అపార్ట్మెంట్లను కూల్చివేయాల్సిందిగా 2019 డిసెంబరులో తీర్పు నిచ్చింది. కొచ్చిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమకట్టడాల కూల్చివేతకు ఏడు నెలల క్రితం ఆంధ్ర ప్రదేశ్‌లో విజయవాడ లో కృష్ణా నది తీరాన అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి పర్యావరణ నిబంధనలకు పాతరేసి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని సంకల్పించిన నాటి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమార్కులందరికీ ఈ కూల్చివేత అనేది ఓ హెచ్చరికగా ఉండాలని భావించింది. అందుకే అంతకు ముందు అధికారంలో ఉన్న టిడిపి హయాంలో అక్రమంగా నిర్మించిన కట్టడాల్లోనే ఓ కట్టడంలో ప్రభుత్వ కార్యకలాపాలు మరో కట్టడాన్ని సాక్ష్యాత్తూ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నివాసంగా ఉంచుకోగా మరి కొందరు అక్రమ కట్టడాల్లో రక రకాల కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చారు. కూల్చివేత అనేది ముందుగా అక్రమంగా నిర్మించిన ప్రభుత్వ భవనంతోనే మొదలు పెట్టడం పద్ధతిగా ఉంటుంది కాబట్టి ప్రజావేదిక ను కూల్చివేశారు. దీంతో పాటే కృష్ణా కరకట్టపై అక్రమంగా నిర్మించిన కట్టడాలకు సంబంధించిన యజమానులందరికీ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. అందులో చంద్రబాబు నాయుడు నివసిస్తోన్న లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఉంది. అంతే ఇక తెలుగుదేశం పార్టీ నేతలు వీధుల్లోకి వచ్చేసి తమపై రాజకీయ కక్ష సాధింపునకు దిగారంటూ గగ్గోలు మొదలు పెట్టింది. తమ ఆర్ధిక మూలాలు దెబ్బతీయడానికే ఈ కుట్ర అంటూ ఆరోపణలు చేసింది. దానర్ధం ఏంటి? ఈ అక్రమ కట్టడాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు వారి వందిమాగధులవేనని తేటతెల్లం అయిపోలా? చిత్రం ఏంటంటే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినపుడు నాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ కృష్ణా నదిలో బోటులో పర్యటిస్తూ కరకట్టపై ఉన్నవన్నీ అక్రమ కట్టడాలేనని.. వాటిని త్వరలోనే కూల్చివేసి తీరతామని స్పష్టం చేశారు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆ తర్వాత ఏమైందో కానీ కరకట్టపై మరికొన్ని అక్రమ కట్టడాలు యధేచ్ఛగా పుట్టుకొచ్చాయి. అందులోని ఓ అక్రమ కట్టడం చంద్రబాబుకు తెగ నచ్చేసింది. అందులోనే తాను ఉంటానని అనడంతో దాని యజమాని కూడా ఉదారంగా ఓకే అనేశారు. కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాలను కూల్చి వేయడం మొదలు పెట్టిన వెంటనే సామాజిక వేత్త, వాటర్ మ్యాన్ గా పేరొందిన రాజేంద్ర సింగ్ తో పాటు పలువురు పర్యావరణ వేత్తలు ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షించారు. టిడిపి హయాంలో కృష్ణా నది గర్భంలో అక్రమంగా ఇసుక తవ్వకాలతో పాటు నదీ తీరాన అక్రమకట్టడాలు చూసి రాజేంద్ర సింగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వాటిపై ఆయన ప్రశ్నించడాన్ని తట్టుకోలేకపోయిన టిడిపి నేతలు రాజేంద్ర సింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపి ఆయనపై దాడికి దిగారు. అధికారం పోయాక ఎల్లో వాయిస్‌లో తేడా వచ్చింది. టిడిపికి మద్దతుగా ఉండే కొందరు ఎల్లో మేథావులు అయితే అక్రమ కట్టడాలైనా కూడా కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టారు కదా..వాటిని ఏదో ఒక పనికి వాడుకోవాలి తప్ప కూల్చివేయడం ఏంటి అంటూ చెత్త లాజిక్ ఒకటి తెరపైకి తెచ్చారు. కొన్ని కోట్లతో కట్టిన ప్రజావేదిక కన్నా.. అక్రమ కట్టడాల కన్నా కూడా కృష్ణా నదికి అక్రమ కట్టడాల వల్ల జరిగిన నష్టం కొన్ని వేల కోట్లకు పైనే ఉంటుందన్న స్పృహ వారిలో లేదు. అసలు పర్యావరణం అంటేనే అది తమకి సంబంధంలేని విషయం అన్నట్లుగానే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ వచ్చారు. నొయిడాలో ట్విన్ టవర్స్‌ను పేల్చినపుడు వందల కోట్ల రూపాయల ఆస్తులను ధ్వంసం చేయడం ఏంటి? అని అక్కడి ప్రతిపక్షాలు గొడవ చేయలేదు. అసలు ఎందుకు కూల్చివేస్తున్నారు? అని ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ప్రజాసంఘం కానీ ప్రశ్నించలేదు. ఇది రాజకీయ కక్షసాధింపేనని ఆ టవర్స్ నిర్మించిన కంపెనీతో అంటకాగే రాజకీయ పార్టీలు ఆరోపించలేదు. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం, జనసేన వంటి బాధ్యతారహిత రాజకీయ పార్టీలు లేవు కాబట్టి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇపుడు మన పొరుగునే ఉన్న కర్ణాటక ప్రభుత్వం కూడా నిబంధనలకు విరుద్ధంగా చెరువులు, నాలాలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని డిసైడ్ అయ్యింది. ప్రత్యేకించి బెంగళూరు నగరాన్ని తాజాగా భారీ వర్షాలు వరదలు ముంచెత్తడంతో చెరువులు, పార్కుల కబ్జాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడి కార్పొరేట్ కార్యాలయాలు కొలువు తీరిన బహుళ అంతస్థుల భవనాలకు అధికారులు నోటీసులు జారీ చేసి కూల్చివేత పనులు మొదలు పెట్టారు. అదృష్టం ఏంటంటే బెంగళూరు లో టిడిపి, జనసేన వంటి పార్టీలు లేవు కాబట్టి కూల్చివేతలపై ఎలాంటి రాజకీయాలు లేకుండా సజావుగా సాగుతున్నాయి. -
కరకట్ట రోడ్డు విస్తరణను వేగంగా పూర్తి చేయండి
సాక్షి, అమరావతి: అసెంబ్లీ, సచివాలయానికి వెళ్లేందుకు వీలుగా కరకట్ట రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని, అనుకున్న సమయం కంటే ముందే పూర్తిచేయాలని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సీఆర్డీఏ అధికారులను అదేశించారు. సచివాలయంలో సోమవారం ఏపీ సీఆర్డీఏ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. విభాగాల వారీగా చేస్తున్న పనులను సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భవనాల నిర్మాణ ప్రగతిపైనా మంత్రి ఆరా తీశారు. పట్టణాభివృద్ధి విభాగంపై నిర్వహించిన సమీక్షలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. 124 యూఎల్బీల్లో చెత్త సేకరణ కోసం ఇప్పటివరకు 1.13 కోట్ల మూడు రంగుల డబ్బాలు పంపిణీ చేశామని, మరో 10 లక్షల డబ్బాల పంపిణీ ఈ నెలాఖరుకు పూర్తవుతుందని వివరించారు. -
కరకట్ట గొడవ.. వాస్తవాలు తెలుసుకోవాలి: డీఐజీ
-
Andhra Pradesh: శాసన రాజధానికి రహదారి
సాక్షి, అమరావతి: ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది కుడి కరకట్ట రోడ్డు విస్తరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. బ్యారేజీ వద్ద కొండవీటి వాగు వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు కరకట్ట రోడ్డును 15.52 కిలోమీటర్ల మేర రూ.150 కోట్ల ఖర్చుతో విస్తరించనున్నారు. కొండవీటి వాగు వరద ఎత్తిపోతల పథకం వద్ద నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. అనంతరం విస్తరణ పనులకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. పూర్తి నాణ్యతతో సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచించారు. కరకట్ట పటిష్టం.. అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నిధులతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో కరకట్ట రోడ్డు విస్తరణ పనులు జరగనున్నాయి. 10 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలుగా ఈ రోడ్డును విస్తరిస్తున్నారు. రెండు లైన్లలో వాహనాలు వెళ్లేందుకు, మరో రెండు వరుసలు ఇరువైపులా నడకదారుల కోసం కేటాయించారు. ఈ రోడ్డులో కొండవీటి వాగు బ్రిడ్జిని పునఃనిర్మించనున్నారు. అమరావతి ఎన్–1, ఎన్–2, ఎన్–3 రహదారులతోపాటు సీడ్ యాక్సెస్ రోడ్డు, గొల్లపూడి – చినకాకాని –విజయవాడ బైపాస్ రోడ్లను కరకట్ట రోడ్డుకు అనుసంధానం చేస్తారు. దీనిద్వారా రాజధాని ప్రాంతానికి పూర్తిస్థాయి రహదారి సౌకర్యం కలుగుతుంది. సచివాలయం, పలు విద్యా సంస్థలతోపాటు ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, హరిశ్చంద్రపురం, వైకుంఠపురం గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. సచివాలయం, హైకోర్టుకు వెళ్లేందుకు ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది. రోడ్డు విస్తరణతో కరకట్ట పటిష్టంగా మారి తరచూ వరదల ముంపు బారిన పడే ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, మందడం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి గ్రామాలకు మేలు జరుగుతుంది. ఈ రోడ్డు వల్ల ప్రధానంగా విజయవాడ వైపు నుంచి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుకు వెళ్లి వచ్చే అధికారులు, ఉద్యోగులు, ప్రజల ట్రాఫిక్ సమస్యలు తీరతాయి. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, అనిల్‌కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, చెరకువాడ శ్రీరంగనాథరాజు, నారాయణస్వామి, సీహెచ్ వేణుగోపాలకృష్ణ, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్, గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలత, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మద్దాలి గిరి, అన్నాబత్తుల శివ, షేక్ ముస్తఫా, గుంటూరు మేయర్ మనోహర్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. -
AP: కృష్ణానది కరకట్ట పనులకు సీఎం జగన్ శంకుస్థాపన
సాక్షి, అమరావతి: ప్రకాశం బ్యారేజి వద్దనున్న కొండవీటి వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు 15.525 కి.మీ. మేర కుడివైపు కృష్ణా నది కరకట్ట పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. కరకట్ట విస్తరణ పనుల కోసం ఏపీ ప్రభుత్వం రూ. 150 కోట్లు ఖర్చు చేయనుంది. అమరావతి స్మార్ట్ అండ్ సస్టెయినబుల్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ నిధులతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో విస్తరణ పనులు జరగనున్నాయి. 10 మీటర్ల వెడల్పుతో రెండు వరుసల రహదారితో పాటు ఇరువైపులా రెండు వరుసల నడకదారులను నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, సూచరిత, రంగనాధ రాజు, నారాయణ స్వామి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్ వివేక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రహదారితో అమరావతిలోని ఎన్-1 నుంచి ఎన్-3 రోడ్లను అలాగే ఉండవల్లి- రాయపూడి- అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్, గొల్లపూడి- చిన్నకాకాని- విజయవాడ బైపాస్ రోడ్లకు అనుసంధానమవుతుంది. కరకట్ట రహదారి నిర్మాణం ద్వారా అమరావతి, సచివాలయం, హైకోర్టు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్ధలు, తాడేపల్లి మండలంలోని ఉండవల్లి, పెనుమాక, తుళ్ళూరు మండలం వెంకటపాలెం, మందడం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, అమరావతి మండలం హరిశ్చంద్రాపురం, వైకుంఠపురం గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడునుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ప్రైవేట్ ఆస్పత్రులు వినియోగించని వ్యాక్సిన్లు రాష్ట్రాలకు ఇవ్వండి -
కరకట్టపై ఘోర రోడ్డు ప్రమాదం
తాడేపల్లి రూరల్: అమరావతి, ఉండవల్లి కరకట్టపై ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వలస కూలీల కుటుంబాన్ని అతి వేగంగా వస్తున్న కారు ఆదివారం ఢీ కొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోట మరియదాసు (35), భార్య యేసుకుమారి, ఇద్దరు కుమారులు తేజ, ప్రవీణ్ (10) అమరావతి మండలం మునుగోడుకు చెందినవారు. లాక్డౌన్ కారణంగా పనులు లేక కుటుంబం గడవడం కష్టం కావడంతో అత్తగారి ఊరైన మైలవరం వెళ్లి పనులు చేసుకుంటుండేవారు. లాక్డౌన్ సడలించడంతో తిరిగి ద్విచక్ర వాహనంపై సొంత ఊరు వస్తుండగా అమరావతి కరకట్టమీద మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద మందడం నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఈ నలుగురు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. బైక్‌పై ప్రయాణిస్తున్న మరియదాసు కుటుంబం పది అడుగుల పైకి లేచి రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డారు. బైక్‌ను ఈడ్చుకుంటూ కారు 15 అడుగుల దూరం వెళ్లింది. మరియదాసు, చిన్న కుమారుడు ప్రవీణ్‌లకు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు 108కు ఫోన్ చేశారు. తీవ్ర గాయాలైన తేజ, యేసుకుమారిలకు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. యేసుకుమారి చికిత్స పొందుతూ గుంటూరు జీజీహెచ్‌లో కన్నుమూసింది. తాడేపల్లి ఎస్ఐ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు యజమాని ఉమా మహేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. చదవండి: ప్రేమికుడిని బంధించి.. యువతిపై అత్యాచారం -
మానవత్వం చాటుకున్న మహిళా మంత్రులు
సాక్షి, తాడేపల్లి : ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడి రాష్ట్ర మహిళా మంత్రులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాలు.. దొండపాడుకు చెందిన నరసింహారావు గురువారం కరకట్ట రోడ్డుపై వెళుతున్న సమయంలో ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరసింహారావుకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న హోంమంత్రి సుచరిత కరకట్టపై గాయాలతో పడిఉన్న నరసింహారావును చూశారు. వెంటనే వాహనాన్ని ఆపి మరో మంత్రి తానేటి వనితతో కలిసి నరసింహారావును తమ కాన్వాయ్‌లో ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం నరసింహారావు పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తక్షణ సహాయం అందించి తన ప్రాణాలను కాపాడినందుకు హోంమంత్రి సుచరిత, మరో మంత్రి తానేటి వనితకు నరసింహారావు కృతజ్ఞతలు తెలిపాడు. -
కరకట్ట నుంచి ఖాళీ చేయండి : మంత్రి అనిల్
-
చంద్రబాబు నివాసం చుట్టూ వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల)/అచ్చంపేట(పెదకూరపాడు): కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. బుధవారంతో పోలిస్తే గురువారం వరద ఉద్ధృతి మరింత పెరిగింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 7.44 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ఆ తర్వాత కాస్త తగ్గింది. సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీలోకి 7,28,934 క్యూసెక్కుల వరద వస్తుండగా.. 70 గేట్లను పూర్తిగా ఎత్తేసి అంతేస్థాయిలో సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేస్తున్న నీటికి.. కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాల ప్రభావం వల్ల కట్టలేరు, మున్నేరు, కొండవాగుల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి వరద పోటెత్తింది. అదేస్థాయిలో దిగువకు వదులుతున్న నేపథ్యంలో గుంటూరు, కృష్ణాజిల్లాల్లో నదీ తీరప్రాంతంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. శుక్రవారం ప్రకాశం బ్యారేజీలోకి వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ చరిత్రలో 2009 అక్టోబర్ 5న తొలిసారిగా గరిష్ఠంగా 11,10,404 క్యూసెక్కుల వరద వచ్చింది. గురువారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 5.30 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా పదిగేట్లను 20 అడుగుల మేర ఎత్తేసి, కుడి విద్యుత్కేంద్రం ద్వారా 5.07 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి నాలుగు లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీటికి మూసీ వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 4.95 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో దిగువకు వదులుతున్నారు. తుంగభద్ర పరీవాహక ప్రాంతంలోనూ భారీవర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర డ్యామ్, సుంకేశుల నుంచి 50 వేల క్యూసెక్కుల మేర నీరు కృష్ణానదిలోకి చేరుతోంది. (చదవండి: మహోగ్ర కృష్ణమ్మ) వంశధారలో స్థిరంగా వరద ఉద్ధృతి ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కురిసిన వర్షాలకు వంశధారలో వరద ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీలోకి 41,253 క్యూసెక్కులు చేరుతుండగా.. 43,197 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గొట్టా బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నాగావళి ప్రధాన ఉపనది అయిన సువర్ణముఖి నదిలో వరద మరింత పెరిగింది. మడ్డువలస ప్రాజెక్టులోకి 25,428 క్యూసెక్కులు చేరుతుండగా.. 27,706 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తుండటంతో నదీ తీరప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ధవళేశ్వరం నుంచి 2.31 లక్షల క్యూసెక్కులు కడలిలోకి గోదావరిలో వరద ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 2.31 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. చంద్రబాబు నివాసం చుట్టూ వరద ప్రకాశం బ్యారేజీలోకి 7.44 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో గురువారం ఎగువ ప్రాంతంలోని కరకట్ట వెంబడి రిజర్వ్ కన్జర్వేటరీలో అక్రమంగా నిర్మించిన గెస్ట్‌హౌస్‌ల చుట్టూ వరదనీరు చేరింది. కొన్ని గెస్ట్‌హౌస్‌లు వరదనీటిలో మునిగిపోయాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నివాసం చుట్టూ రహదారుల్లో తప్ప నాలుగువైపులా నీళ్లు చుట్టుముట్టాయి. హెలీప్యాడ్ సగం వరకు మునిగిపోయింది. గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్, చందన బ్రదర్స్ గెస్ట్‌హౌస్ ఐదడుగుల వరకు నీళ్లలో మునిగిపోగా, ఆక్వా డెవిల్స్‌లో కరకట్ట వరకు నీళ్లు చేరాయి. ఇసుక ర్యాంప్ వద్ద ఉన్న మత్స్యకారుల ఇళ్లు మునిగిపోవడంతో అధికారులు వారిని అక్కడినుంచి ఖాళీ చేయించారు. గురువారం రాత్రి మరింత వరద వస్తుందని సమాచారం అందటంతో ముందు జాగ్రత్తగా కరకట్ట లోపల ఉన్న గెస్ట్‌హౌస్‌ల వారిని ఖాళీచేయాలని అధికారులు ఆదేశించారు. మేం ఉంటే గంటగంటకూ టెలీకాన్ఫరెన్స్‌లు: చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: తాము అధికారంలో ఉంటే వరదల సమయంలో గంట గంటకు అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించేవాళ్లమని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టేవాళ్లమన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి గురువారం టీడీపీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘తీరం దాటే సమయాన్ని, తాకే ప్రదేశాన్ని ముందే అంచనా వేసేవాళ్లం. ఏ ప్రాంతంలో ఎంత నష్టం వాటిల్లుతుందో ఆర్టీజీఎస్ ద్వారా అంచనా వేసి ప్రజల్ని ముందే అప్రమత్తం చేసేవాళ్లం. ప్రాణనష్టం, ఆస్తినష్టం నివారించేవాళ్లం. అధికార యంత్రాంగమంతా అక్కడే మకాం వేసేలా చూసేవాళ్లం. సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాకే తిరిగి వచ్చేవాళ్లం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆ చొరవ, స్ఫూర్తి లేవు. ప్రజల ప్రాణాలన్నా, ఆస్తినష్టం అన్నా వైఎస్సార్సీపీకి లెక్కేలేదు’ అని చంద్రబాబు మండిపడ్డారు. -
చంద్రబాబు నివాసానికి నోటీసులు
సాక్షి, విజయవాడ: భారీ వర్షాలు, వరదలతో విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహంఉండగా.. అది 6 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణా నది కరకట్ట లోపలవైపు ఉన్న 36 అక్రమ కట్టడాలకు వరద ప్రమాద హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. కరకట్ట లోపలవైపు ఉన్న భవనాలు ఖాళీ చేసి.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కరకట్ట లోపల ఉన్న చంద్రబాబు నివాసానికి కూడా అధికారులు నోటీసులు అందజేశారు. ఏ క్షణాన్నయినా ఇళ్లల్లోకి నీరు రావొచ్చని అధికారులు అలర్ట్ చేశారు. (చదవండి: వాగులో కొట్టుకుపోయిన యువకుడు) -
సంతాప సభ పెట్టడానికి వెళ్లారా?
సాక్షి, తాడేపల్లి : కరకట్టపై టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారని, కరోనా సమయంలో నిరసనలకు అనుమతి లేదని తెలిసి కూడా ఎల్లో మీడియాలో కనిపిండం కోసమే ప్రజావేదిక దగ్గరకి వెళ్లారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగిరమేష్ విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజావేదిక నిర్మిస్తే కూల్చివేయయరా అని ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఆందోళనపై నిషేదం ఉన్నా టీడీపీ నేతలు ప్రజావేదిక దగ్గరకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. (చదవండి : కరకట్టపై టీడీపీ నేతల ఓవర్‌యాక్షన్) టీడీపీ అవినీతి పాలన అంతమై ఏడాది పూర్తయిన సందర్భంగా సంతాప సభ పెట్టడానికి వెళ్లారా అని నిలదీశారు. ఎల్లో మీడియాలో కనిపించాలనే తపన తప్ప టీడీపీ నేతలకు మరేపని లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఉంటున్న ఇంటికి నోటీసులు ఇచ్చిన సిగ్గు లేకుండా అక్రమ కట్టడంలో ఉంటున్నారని విమర్శించారు. చంద్రబాబు సిగ్గుంటే అక్రమ కట్టడం నుంచి బైటకు వెళ్లాలని సవాల్ చేశారు. విధ్వంసానికి ఏడాది అని చంద్రబాబు ట్వీట్ చేశారని, కానీ అది దోపిడీ అంతానికి ఏడాది పూర్తయ్యిందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షం పోరాడటానికి సమస్యల్లేవని, సీఎం జగన్ సుస్థిరమైన పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఇళ్ల స్థలాలు వస్తున్నాయని పేదలు సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఫలించవని ఎమ్మెల్యే జోగి రమేష్ వ్యాఖ్యానించారు. -
కరకట్టపై టీడీపీ నేతల ఓవర్‌యాక్షన్
సాక్షి, తాడేపల్లి: కరకట్టపై ఓవర్‌యాక్షన్ చేసిన టీడీపీ నేతలను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజా వేదిక వద్ద నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వదానికి దిగారు. అయితే కరోనా నేపథ్యంలో నిరసనలకు అనుమతి లేదని పోలీసులు వారికి తెలిపారు. కానీ టీడీపీ నేతలు పోలీసులు మాట లెక్కచేయకుండా.. ప్రజా వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అక్రమ నివాసం నుంచి ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి ఏడాది అయిన చంద్రబాబు నాయుడు మాత్రం ఇంకా అక్కడే ఉంటున్నారు. -
కరకట్ట బంగ్లాలోనే కుంభకోణాల మూలాలు
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడ ఐటీ సోదాలు, ఈడీ దాడులు జరిగినా వాటి మూలాలు ప్రతిపక్ష నేత చంద్రబాబు కరకట్ట నివాసంలో బయట పడుతున్నాయని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు ఐదేళ్లలో దోచుకున్న సొమ్మును దాచుకుని దేశం దాటించేందుకు ఎస్ బ్యాంక్‌ను వాడుకున్నారని ఆరోపించారు. ఆ బ్యాంకు అవినీతి మూలాలు చంద్రబాబు దగ్గర తేలుతున్నాయన్నారు. ఎస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణాకపూర్‌తో కలసి చంద్రబాబు హవాలా వ్యాపారం చేశారన్నారు. టిట్కో ద్వారా చదరపు అడుగుకు రూ.1,100 చొప్పున నిర్మించాల్సిన పేదల ఇళ్లకు రూ.2,400 ప్రకారం చెల్లించి చంద్రబాబు రూ.వేల కోట్ల ముడుపులు తీసుకున్నారని ధ్వజమెత్తారు. ఆ సొమ్ము ఎస్ బ్యాంకు ద్వారా విదేశాలకు హవాలా రూపంలో తరలినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. - బీసీలు జడ్జీలుగా పనికిరారని లేఖలు రాసిన చంద్రబాబు ఓట్ల కోసం ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. - స్థానిక ఎన్నికల్లో బీసీలకు పార్టీ తరపున 34 శాతం సీట్లు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించాకే గత్యంతరం లేక చంద్రబాబు అదే దారి అనుసరించారు. - తిరుమల శ్రీవారి సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు ఎస్ బ్యాంక్‌లో రూ.1,300 కోట్లు డిపాజిట్ చేయించారు. - ఢిల్లీలో ఎస్ బ్యాంక్‌తో కలిసి చంద్రబాబు గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ నిర్వహిస్తే పెట్టుబడులు రాలేదు. టూరిజం మిషన్ డాక్యుమెంట్ తయారీకి రూ.లక్షల్లో ఫీజు చెల్లించారు. - ఇవన్నీ చాలా చిన్నవి. చంద్రబాబు ఐదేళ్లలో దోచుకున్న మొత్తాన్ని దేశం బయటకు తరలించేందుకు ఎస్ బ్యాంక్‌ను వాడుకున్నారు. - ఆర్థిక నేరగాడు రాణాకపూర్ నెలకోసారి చంద్రబాబు వద్దకు వచ్చి రాత్రంతా కరకట్ట బంగ్లాలో గడిపేవారు. - తనకు నోటీసులు వస్తాయని భయపడుతున్న చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చొని పెద్ద లాయర్లతో చర్చిస్తున్నారు. - పవన్ రోజుకో మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రజలను మోసగించడం మానుకోవాలి. -
కరకట్ట భవన యజమానులకు మరోసారి హైకోర్టు నోటీసులు
సాక్షి, అమరావతి: కష్ణానది ఒడ్డున వెలసిన అక్రమ నిర్మాణాల విషయంలో వివరణ ఇవ్వాలని హైకోర్టు శుక్రవారం ఆ నిర్మాణాల యజమానులను ఆదేశించింది. ఇందులో భాగంగా వారికి మరోసారి నోటీసులు జారీ చేస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంది. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టు నుంచి నోటీసులు అందుకున్న యజమానులు, ప్రభుత్వాధికారులు తదుపరి విచారణకల్లా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ మంతోజు గంగారావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కష్ణానది ఒడ్డున తాడేపల్లి మండలం, ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని వివిధ సర్వే నెంబర్లలో పలువురు ప్రముఖులు పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపట్టారని, దీనిపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకష్ణారెడ్డి 2017లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో లింగమనేని రమేశ్, ఇతర నిర్మాణాల యజమానులు, పలువురు అధికారులతో సహా 49 మంది ప్రతివాదులుగా ఉన్నారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. నోటీసులు అందని వారికి మరోసారి నోటీసులు ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది. -
‘చంద్రబాబు అక్కడ ఎందుకు ఉంటున్నాడో అర్థం కావట్లే’
సాక్షి, న్యూఢిల్లీ : కృష్ణా కరకట్టపై నివాసం ఉంటున్న చంద్రబాబు ఇంకా ఎందుకు అక్కడ ఉంటున్నాడో అర్థం కావడం లేదని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. కరకట్టపై చంద్రబాబు తన నివాసాన్ని వెంటనే ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. తానైతే ఆ ఇంట్లో అసలు ఉండేవాడిని కాదని తేల్చి చెప్పారు. ఆ నిర్మాణాన్ని ప్రభుత్వం కూల్చి వేస్తే బాబు సానుభూతి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. పోలవరం రివర్స్ టెండరింగ్‌లో ప్రజాధనం ఆదా చేయడం మంచి విషయమని ప్రశంసించారు. అయితే ఈ విధానంతో అవినీతిని ఏ రకంగా ఆదా చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని సుజనా చౌదరి కోరారు. -
కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడం కూల్చివేత
సాక్షి, గుంటూరు, కృష్ణా : తాడేపల్లి మండల పరిధిలో ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో నదీ తీరప్రాంతంలో కరకట్ట లోపల నీటి ప్రవాహానికి అడ్డంగా ఏర్పాటుచేసిన ఓ కట్టడాన్ని సీఆర్డీఏ ఏడీ నరేంద్రనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కూల్చివేశారు. కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో 29 అక్రమ కట్టడాలను గుర్తించి అనేకసార్లు నోటీసులు జారీచేశారు. అయినప్పటికీ అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి నుంచి సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో పాతూరు కోటేశ్వరరావు కృష్ణానది లోపలికి చొచ్చుకెళ్లేలా నిర్మించిన కట్టడాన్ని అధికారులు తొలగించారు. -
టీడీపీ నాయకులపై కేసు నమోదు
తాడేపల్లి రూరల్ (మంగళగిరి): కృష్ణా కరకట్ట వెంబడి ఉండవల్లిలోని మాజీ సీఎం చంద్రబాబు నివాసం వద్ద తమ విధులకు ఆటంకం కలిగించిన టీడీపీ నాయకులపై తాడేపల్లి పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. ఈ నెల 16వ తేదీన చంద్రబాబు నివాసంలోకి వరద నీరు చేరిన విషయం తెలిసిందే. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అదే రోజు అక్కడికి చేరుకొని వరద ఉధృతిని పరిశీలించారు. అయితే వరద నీరు రాకున్నా ఎమ్మెల్యే ఆర్కే అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ టీడీపీ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకొని గొడవకు దిగారు. డ్రోన్ కెమెరాతో చంద్రబాబు నివాసాన్ని వీడియో చిత్రీకరిస్తున్నారంటూ ధర్నాకు దిగారు. వరద ఉధృతిని పరిశీలించడానికి అన్ని ప్రాంతాల్లో తామే డ్రోన్ వాడుతున్నామని ఇరిగేషన్ అధికారులు చెప్పినప్పటికీ టీడీపీ నేతలు పట్టించుకోలేదు. అధికారులు పంపిన యువకులపై దాడికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో, అప్పటికే అక్కడకు చేరుకున్న టీడీపీ నాయకులు దేవినేని ఉమ, దేవినేని అవినాష్, జనార్దన్, డొక్కా మాణిక్యవరప్రసాద్, ఆలపాటి రాజా, తెనాలి శ్రావణ్‌కుమార్ రెచ్చిపోయి తమ అనుచరులతో పోలీసుల వాహనాలపై దాడి చేయడం, పోలీసులను కొట్టడం చేశారు. దీంతో పోలీసులు ఆ రోజు ధర్నాలో పాల్గొన్న తాడేపల్లి నాయకులతోపాటు, విజయవాడ నుంచి వచ్చిన కొంత మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: టీడీపీ ‘డ్రోన్’ రాద్ధాంతం) -
కరకట్ట లోపల భవనాలను పరిశీలించిన మంత్రులు
సాక్షి, గుంటూరు : కృష్ణా నదిలో వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు, మంత్రులు పరివాహక ప్రాంతంలో తాజా పరిస్థితిని అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు కరకట్ట లోపల ఉన్న భవనాలను పరిశీలించారు. కరకట్ట లోపల ఉన్న గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్‌తోపాటు, తులసి వనం మంతెన సత్యనారాయణ రాజు ఆశ్రమం, నీటి మునిగిన పొలాలను మంత్రుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా బొత్స మీడియాతో మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాన్ని ఖాళీ చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వరద నీరు కరకట్టపైన ఉన్న నివాసాల్లోకి రావడంతో.. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకే క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టామని చెప్పారు. ఈ అంశాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకోవద్దని హితవు పలికారు. ఇదిలా ఉంటే ఇప్పటికే కరకట్టపై ఉన్న నివాసాల్లోకి నీరు ప్రవేశించిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి ప్రజల భద్రతపై అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరోవైపు వరదలను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రాజకీయం చేసేందుకు వాడుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాబు నివాసం కూడా కరకట్టపైనే ఉండటం.. అక్కడ టీడీపీ శ్రేణులు హంగామా సృష్టించడం అందులో భాగమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముంపు బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటాం.. అనంతరం మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ కృష్ణ లంకలోని ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ బొప్పన భవకుమార్ మంత్రులకు ముంపు సమస్యను వివరించారు. టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తమకు ఈ దుస్థితి వచ్చిందని ముంపు బాధితులు మంత్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రిటైనింగ్ వాల్ నిర్మాణంలో జాప్యం చేసి టీడీపీ ప్రభుత్వం తమ కొంపలు ముంచిందని మండిపడ్డారు. బాధితుల సమస్యలపై స్పందించిన మంత్రి బొత్స.. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ముంపు బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వర్షాలే రాని చంద్రబాబు పాలనలో వరదలు అంటే ఎవరికి తెలియవు.. అలాంటి మాజీలు ఫ్లడ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో ప్రజా సంక్షేమం లేకే ఈ ప్రాంతవాసులు ముంపుకు గురయ్యారని విమర్శించారు. నష్ట నివారణకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. -
‘సిగ్గు లేకుండా రాజకీయం చేస్తున్నారు’
సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో వరద ఇంకా ఉదృతమయ్యే అవకాశముందని అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీ నుంచి 6 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారని తెలిపారు. కరకట్టలో డ్రోన్ వినియోగానికి టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంపై ఆయన ధీటుగా స్పందించారు. ప్రజలను కాపాడటానికి, ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడానికే అధికారులు డ్రోన్‌ను వినియోగించారని స్పష్టం చేశారు. డ్రోన్ల ద్వారా కరకట్టలో నిర్మాణాలు, ఇతర ముంపు ప్రాంతాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. టీడీపీలో అక్రమ కట్టడాన్ని సమర్థించుకోడానికి ఆ పార్టీ నేతలు డ్రామాలు ఆడుతున్నారన్నారు. కరకట్ట లోపల నిర్మించిన చంద్రబాబు నివాసం అక్రమ కట్టడం కాదా? అని నాగిరెడ్డి ప్రశ్నించారు. ముంపు వస్తుందనే ముందు జాగ్రత్తతో బాబు హైదరాబాద్ వెళ్లిపోయాక కూడా టీడీపీ నేతలు దిగజారిపోయి మరీ ధర్నాలు చేస్తున్నారని నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అసహ్యించుకునేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముంపు కష్టాలను గాలికి వదిలేసి... ఇంట్లో ఎవరూ లేని అక్రమ కట్టడం కోసం టీడీపీ నేతలు ధర్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా చంద్రబాబు అక్రమ నివాసాన్ని మర్యాదగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. -
మీ ఇల్లు మునిగి పోవడమేంటయ్యా?
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన అపచారాలకు ఆగ్రహించి కృష్ణమ్మ జల కొరడా ఝుళిపించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కరకట్ట లోపల నిర్మించిన ఇంటికి వరద ముప్పు ఉందని తెలియడంతో ఆయన హైదరాబాద్ పారిపోయారన్నారు. చంద్రబాబుకు వచ్చిన కష్టాలు పగవాడికి కూడా రాకూడదని ఎద్దేవా చేశారు. ఇసుక దోపిడీ, నదిని పూడ్చి దీవుల ఏర్పాటు, గెస్ట్ హౌస్ నిర్మాణం వంటి చర్యలతో బ్యారేజిలో నీటి నిల్వను కుదించేశారని మండిపడ్డారు. అందుకే ఇప్పుడు ఉప్పొంగిన నదిని చూసి ప్రజలు సంతోషిస్తుంటే చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో దాక్కున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కరకట్ట లోపల నిర్మించిన ఇంటి ఆవరణలోని కార్లు, విలువైన సామాగ్రిని మరో చోటకి తరలించిన చంద్రబాబుకు... నదిని పూడిస్తే ప్రకృతి ప్రకోపం ఎలా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందా అని ప్రశ్నించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మీ ఇల్లు మునిగి పోవడమేంటయ్యా? ‘‘మీరు ఓడిపోవడమేంటయ్యా’ అని అప్పడు మహిళా కార్యకర్తలతో ఉత్తుత్తి శోకాలు పెట్టించారు. ఇప్పడు మీ ఇల్లు మునిగి పోవడమేంటయ్యా? వరదలో కొట్టుకుపోతే పోయింది. మా ఇంట్లో వచ్చి ఉండండయ్యా అని వందలాది మంది బాబును బతిమాలుతున్నట్టు వ్యంగ్య చిత్రాలతో సోషల్ మీడియా ఆడుకుంటోంది. నదులు, వాగులను తవ్వి ఏ ఇసుక నుంచి ధనరాశులు పోగు చేసుకున్నాడో ఇప్పుడు అవే ఇసుక బస్తాలతో కరకట్ట కొంపను వరద నుంచి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విధి ఎంత విచిత్రంగా ఆడుకుంటుందో ఈ ఒక్క ఉదంతం చాలు. ప్రకృతితో పెట్టుకుంటే మటాశే బాబూ’ అని విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు తీరును ఎండగట్టారు. ‘ఐదేళ్లుగా బాబు గారు మూసి ఉంచిన ప్రకాశం బ్యారేజి గేట్లు తెరవడమే ఒక పెద్ద కుట్ర అని రాస్తుందేమో ఎల్లో మీడియా? రాష్ట్రంలో ఎక్కడా భారీ వర్షాలు లేకున్నా, బాబు గారు నదుల అనుసంధానం ఇంకా మొదలు కాకున్నా ఇంత వరద ఎలా వస్తుందని చర్చలు పెట్టినా పెడతారు పే రోల్ మేధావులు’ అని ఎల్లో మీడియా తీరుపై విమర్శలు గుప్పించారు. కాగా కృష్ణానది కరకట్టపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నిర్మాణానికి వరద ముప్పు పొంచి ఉండటంతో.. ఆయన నివాసంలోకి నీరు చేరకుండా సిబ్బంది ఇసుక బస్తాలు వేసిన విషయం తెలిసిందే. -
‘కృష్ణమ్మ చంద్రబాబును పారిపోయేటట్లు చేసింది’
సాక్షి, గుంటూరు : వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వర్షాలు పడుతుంటే టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. టీడీపీ హయాంలో వ్యవస్థలన్నింటినీ చంద్రబాబు నిర్వీర్యం చేశారని, బాబు చేసిదంతా అవినీతేనని మండిపడ్డారు. కరకట్టపై ఉన్న చంద్రబాబును కృష్ణమ్మ పారిపోయేటట్లు చేసిందని ఎద్దేవా చేశారు. అనేక ప్రాజెక్టులను రూపకల్పన చేసిన ఘనత వైఎస్సార్‌ది అని, చంద్రబాబు ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తిచేయలేదని దుయ్యబట్టారు. నదుల అనుంసంధానం అంటూ బాబు కోట్ల రూపాయలు దోచుకున్నారని, పోలవరంలో అవినీతి జరిగిందని ప్రాజెక్టు అథారిటీయే చెప్పిందని స్పష్టం చేశారు. రౌడీలు, గుండాలంటూ రాయలసీమ ప్రజలను బాబు అవమానిస్తున్నారని, సీమ ప్రజలంటే బాబుకు ఎందుకంత ఈర్ష్య అని గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ నేతలు హత్యలు చేస్తుంటే చంద్రబాబు పంచాయతీలు చేస్తూ కూర్చున్నారని విమర్శించారు. గత ఐదేళ్లో చంద్రబాబు చేసినవన్నీ పంచాయతీలేనని,శాంతిభద్రతల పరిరక్షణ కోసం బాబు చేసిందేమీ లేదని ఆరోపించారు. కరకట్ట వద్ద రాజకీయ లబ్ది కోసమే కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి ప్రజావేదిక నిర్మించారని స్పష్టం చేశారు. అక్కడ నిర్మిస్తే దిగువ ప్రాంతంలో నివాసం ఉండే వారికి ఇబ్బంది అని ఇంజనీర్లు చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదన్నారు. బ్యారేజీ గేట్లు ఎత్తడం రెండు గంటలు ఆలస్యమైతే బాబు ఇంటి వద్ద పరిస్థితి ఊహించలేమని, చంద్రబాబు వరదల్లో చిక్కుకునేవారని, అధికారులు రాత్రింబవళ్లు అక్కడే పనిచేయాల్సి వచ్చేదని పేర్కొన్నారు. ఇప్పుడు ఖాళీ చేస్తే తనను అందరూ అసహ్యించుకుంటున్నారని భావించి.. సామాన్లను, కార్లను వేరే చోటికి పంపి ఆయన హైదరాబాద్‌కు పారిపోయారని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తిని నమ్ముకుంటే రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదని, చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరిచి తన తప్పును ఒప్పుకోవాలని సూచించారు. -
ముంపు ముప్పులో చంద్రబాబు కరకట్ట నివాసం..!
సాక్షి, అమరావతి : కష్ణమ్మ పరవళ్లతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో నీటమునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇక కృష్ణా నది కరకట్టపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నిర్మాణానికి వరద ముప్పు పొంచి ఉంది. దీంతో నివాసంలోకి నీరు చేరకుండా సిబ్బంది ఇసుక బస్తాలు వేస్తున్నారు. వరదల నేపథ్యంలో ఇప్పటికే బాబు కాన్వాయ్‌ను హ్యాపీ రిసార్ట్స్‌కి తరలించారు. ఇంట్లోని కింది గదుల్లో ఉన్న సామాన్లను మేడపైకి తరలించారు. వరద ముప్పును ముందే గ్రహించిన చంద్రబాబు కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు పయనమైనట్టు సమాచారం. పులిచింతల ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌లో నీటిమట్టం 12.3 అడుగులకు చేరుకుంది. 3.07 టీఎంసీల సామర్థ్యమున్న బ్యారేజీ పూర్తిగా నిండిపోయింది. ఇన్‌ఫ్లో 4.12 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4.12 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరదలు ఇలాగే కొనసాగితే కరకట్ట పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నారు. -
గోకరాజు వాదనల్లో ఏ మాత్రం వాస్తవం లేదు..
సాక్షి, అమరావతి: కృష్ణానది, కరకట్ట సమీపంలో ఉండవల్లి గ్రామ పరిధిలో డోర్ నెంబర్ 30(పీ)లో బీజేపీ నేత, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఎటువంటి అనుమతి తీసుకోకుండానే భవంతిని నిర్మించారని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) హైకోర్టుకు నివేదించింది. విజయవాడ–గుంటూరు–తెనాలి–మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ (వీజీటీఎం–యుడీఏ) నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతనే భవంతి నిర్మించామన్న గోకరాజు వాదనల్లో ఏ మాత్రం వాస్తవం లేదంది. అనుమతి పొందిన ప్లాన్‌ను కూడా సమర్పించలేదని స్పష్టం చేసింది. అలాగే డోర్ నెంబర్ 223(పీ)లో అనుమతి పొందిన ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టలేదని తెలిపింది. అంతేకాకుండా ఈ భవంతిపైన ఆర్సీసీ రూఫ్‌తో మరో అంతస్తు, నిబంధనలకు విరుద్ధంగా స్విమ్మింగ్ ఫూల్ నిర్మించారంది. భవన క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్) నుంచి రాజధాని ప్రాంతాన్ని మినహాయించామని వివరించింది. అందువల్ల గతంలో సమర్పించిన క్రమబద్ధీకరణ దరఖాస్తులు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నీ తిరస్కరణకు గురైనట్లేనని పేర్కొంది. పర్యావరణ, నదీ పరీవాహక ప్రాంతాల పరిరక్షణకు విరుద్ధంగా ఏ స్థానిక సంస్థలకు కూడా అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించే అధికారం లేదని తేల్చిచెప్పింది. కరకట్ట సమీపంలోని నిర్మాణాలు కృష్ణానది సహజ నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. దీని వల్ల కృత్రిమ వరద ఏర్పడే పరిస్థితి వచ్చిందని తెలిపింది. కృష్ణానదికి 100 మీటర్ల మేర బఫర్ జోన్‌ను ఏర్పాటు చేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, ఈ ఆదేశాలను తూచా తప్పక అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందంది. హైకోర్టును ఆశ్రయించిన గోకరాజు కృష్ణానది, కరకట్ట సమీపంలో చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే భవంతులు నిర్మించారని, వీటిని ఎందుకు కూల్చరాదో వివరణ ఇవ్వాలంటూ సీఆర్డీఏ అధికారులు జారీ చేసిన షోకాజ్ నోటీసులను సవాలు చేస్తూ గోకరాజు గంగరాజు హైకోర్టును ఆశ్రయించారు. షోకాజ్ నోటీసులను కొట్టేయడంతోపాటు, తమ భవంతి విషయంలో ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా సీఆర్డీఏ అధికారులను ఆదేశించాలని కోరుతూ ఆయన ఇటీవల హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సీఆర్డీఏ డైరెక్టర్ కోనేరు నాగసుందరి రెండు కౌంటర్లు దాఖలు చేశారు. ‘చట్ట నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పిటిషనర్ వంటి వ్యక్తుల విషయంలో హైకోర్టు తన విచక్షణాధికారాన్ని ఉపయోగించరాదు. పర్యావరణానికి జరుగుతున్న హాని విషయంలో ఏ రకంగానూ రాజీ పడకూడదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టంగా చెప్పింది. మేం లేవనెత్తిన ఉల్లంఘనలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకునేందుకే పిటిషనర్ ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్ సీనియర్ సిటిజన్ అని, ఆయన కుమారుడు సింగపూర్‌లో ఉన్నారని, నిర్మాణాలకు సంబంధించిన పూర్తి వివరాల సమర్పణకు 10 రోజుల గడువు కావాలంటూ ఈ నెల 16న పిటిషనర్ తరఫు న్యాయవాదులు మెమో దాఖలు చేశారు. అయితే ఆ గడువు లోపు ఎటువంటి ఆధారాలు సమర్పించకుండా పిటిషనర్ నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. చట్టం నుంచి తప్పించుకునేందుకే ఇలా చేశారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని గంగరాజు దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టేయండి’ అని నాగసుందరి తన కౌంటర్లలో కోర్టును అభ్యర్థించారు. -
కాలువను మింగేసిన కరకట్ట!
సాక్షి, జలుమూరు (శ్రీకాకుళం): కరకట్టల నిర్మాణ పనుల పుణ్యమా అని నగిరికటకం వద్ద ఉన్న వంశధార ఓపెన్ హెడ్ కాలువ కనుమరుగు కానుంది. బ్రిటీష్ కాలంలో (1865) తవ్విన ఈ కాలువ పొడవు 16.7కిలో మీటర్లు. సుమారు 2,720 ఎకరాలకు సాగునీరు అందేది. వంశధార నదిని కరకవలస వద్ద అనుసంధానం చేసి జలుమూరు మండలం వరకే ఈ కాలువను పరిమితం చేశారు. కరకవలస, శ్రీముఖలింగం, నగిరికటకం, అచ్చుతాపురం, కొమనా పల్లి, తిమడాం, సురవరం, సైరిగాంతోపాటు మరికొన్ని గ్రామాల్లో రెండు పంటలకు నీరందించేదని ఆయా గ్రామాల రైతులు చెబుతున్నారు. 1982లో వంశధార నది వరదలు, నీటి ప్రవాహం ఎక్కువ అవ్వడంతో కరకవలస వద్ద కొంత అడ్డుకట్ట వేశారు. 10 ఆర్, 7 ఆర్, 11 ఆర్, 12 ఆర్, మురికి కాలువలు నుంచి ప్రవహించే నీరు ఈ కాలువలో కలిసి పంట పొలాలను వరద బారీ నుంచి రక్షించేది. ప్రస్తుతం ఈ కాలువ కనుమరుగవ్వడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు కిలో మీటర్ల మేర కప్పేశారు.. సుమారు రూ.56 కోట్లతో వంశధార కరకట్ట నిర్మాణం 2010 నుంచి జరుగుతోంది. ఈ కరకట్టల నిర్మాణంలో డిజైన్లు కూడా సరిగ్గా చూడకుండా ఆమోదం తెలిపారు. రైతుల అభ్యర్థనలు కనీసం సంబంధిత గుత్తేదారు పట్టించుకోకుండా 150 ఎళ్ల చరిత్ర గల ఈ కాలువకు కరకట్టతో కప్పేసి పూర్తిగా తెరమరుగు చేయడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ కాలువ కరకవలస నుంచి శ్రీముఖలింగం వరకు సుమారు ఐదు కిలో మీటర్లు కప్పేశారు. నెట్వర్క్ సిస్టంతో అభివృద్ధి జరిగేనా? నరసన్నపట డివిజన్ పరిధిలోని ఐదు ప్రధాన ఓపెన్ హెడ్ కాలువలతోపాటు బైరి ఓపెన్ హెడ్ కాలవ, మేజర్ కాలువ, అనుబంధ కాలువల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.68 కోట్లు మంజూరైంది. కాలువల్లో ఆక్రమణలు తొలగించడం, పురాతన కాలువలను సైతం అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు చేశారు. ఈ పనుల్లో నగిరికటకం కాలువ కూడా ఉంది. ఈ కాలువ అభివృద్ధికి సుమారు 2.88 కోట్లు మంజూరయ్యాయి. గత పదేళ్లుగా ఈ కాలువ అభివృద్ధికి నిధులు మంజూరవ్వడం, సాంకేతిక సమస్యలు రావడం, అంచనాలు పెంచడం వంటివి జరిగాయి. గత టీడీపీ ప్రభుత్వంలో కూడా కొంత వరకు పనులు చేశారే తప్ప.. కాలువ కనుమరుగు అవుతుందని రైతులు చెప్పినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. ఇంత జరుగుతున్నా వంశధార అధికారులు నగిరికటకం కాలువ పరిస్థితి చూడలేదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల సూచనలు పాటిస్తాం.. కరకట్టతో కప్పేసిన కాలువ పనులు మళ్లీ ఎలా చేస్తారు? రైతులకు ఎలా సాగు నీరందిస్తారని హిరమండలం డివిజన్ డీఈఈ ప్రభకరరావును సాక్షి వివరణ కోరింది. అక్కడ అంచనాలు తయారు చేసే సమయంలో తాను లేనని చెప్పారు. ఉన్నాతాధికారుల సూచనలతో పనులు చేస్తామన్నారు. అదేచోట వంశధార నదికి అనుసంధానంగా కాలువను తెరిపించేందుకు ప్రయత్నిస్తామన్నారు. -
అక్రమాల గని.. ‘లింగమనేని’
సాక్షి, మంగళగిరి: లింగమనేని... ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పేరు తెలియని వారు లేరు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత ఐదేళ్లుగా నివాసం ఉంటున్నది లింగమనేని గెస్ట్‌హౌస్‌లోనే. ఈ గెస్ట్‌హౌస్ యజమానులు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు. గుంటూరు జిల్లా ఉండవల్లి గ్రామ సమీపంలో కృష్ణా నది కరకట్టపై అక్రమంగా నిర్మించిన ఈ ఇంటిని చంద్రబాబుకు అద్దెకు ఇచ్చి, ప్రతిఫలంగా తమ విలువైన భూములను రాజధాని భూసమీకరణ నుంచి తప్పించేలా జాగ్రత్త పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. 1994కు ముందు విజయవాడలో చిన్నస్థాయి రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా పనిచేసే లింగమనేని సంస్థ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, రూ.కోట్లకు పడగలెత్తిందన్న ఆరోపణలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. అధికారం అండతో భూములను సొంతం చేసుకోవడంతోపాటు నిబంధనలను బేఖాతర్ చేయడం లింగమనేని సంస్థకు పరిపాటిగా మారింది. ఏసీసీ భూములతో ప్రారంభం గుంటూరు జిల్లా మంగళగిరి, పెదకాకాని, తాడికొండ మండలాల పరిధిలోని నిడమర్రు, నంబూరు, కంతేరు, చినకాకాని, కాజా గ్రామాల్లో ఏసీసీ కంపెనీకి చెందిన 148 ఎకరాల భూములున్నాయి. గుంటూరు–విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ భూములపై 2001లో లింగమనేని రియల్ ఎస్టేట్ సంస్థ కన్ను పడింది. వాటిని లింగమనేనికి విక్రయించేందుకు ఏసీసీ కంపెనీ ముందుకు రాలేదు. అప్పట్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ అండతో లింగమనేని సంస్థ అధినేత లింగమనేని భాస్కరరావు వీజీటీఎం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని(ఉడా) రంగంలోకి దించారు. ప్రజావసరాల కోసం అంటూ ఏసీసీకి చెందిన భూములను ఉడా సేకరించింది. 2002లో నంబూరు గ్రామానికి చెందిన 69.81 ఎకరాలు, కాజా గ్రామానికి చెందిన 38.47 ఎకరాలు, కంతేరు గ్రామానికి చెందిన 7.63 ఎకరాలను రూ.4.90 కోట్లకు సేకరించింది. ఆ భూముల్లో జాతీయ రహదారి వెంట టౌన్షిప్ నిర్మిస్తామని పేర్కొంది. కానీ, ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అవే భూములను లింగమనేని సంస్థకు బహిరంగ వేలం పేరుతో విక్రయించింది. బహిరంగ వేలంలో విజయవాడకు చెందిన సహారా ఇండియా కమర్షియల్ కార్పొరేట్ సంస్థ, గుంటూరుకు చెందిన బీఎన్కే రియల్ ఎస్టేట్ సంస్థ, లింగమనేని సంస్థ పాల్గొన్నాయి. అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో సహారా, బీఎన్కే సంస్థలు వేలం నుంచి తప్పుకున్నాయి. చివరకు లింగమనేని సంస్థ 115.90 ఎకరాలను రూ.8.96 కోట్లకు దక్కించుకుంది. అప్పటికే ఆక్కడ ఎకరం విలువ రూ.40 లక్షలకు పైగానే పలుకుతోంది. ఉడా మాత్రం లింగమనేని సంస్థకు ఎకరా కేవలం రూ.7.75 లక్షల చొప్పున కట్టబెట్టింది. ఏసీసీకి చెందిన భూములు మొత్తం 148 ఎకరాలుండగా, ఉడా 115.90 ఎకరాలను సేకరించి, లింగమనేనికి విక్రయినట్లు చెబుతుండగా మిగిలిన 31.10 ఎకరాల భూమి ఏమైందనేది ప్రశ్నార్థకంగా మారింది. వాటి విలువ ప్రస్తుతం రూ.450 కోట్ల పైమాటే. అక్రమాలను ప్రశ్నించిన గ్రామ కార్యదర్శి సస్పెండ్ ఉడా నుంచి నామమాత్రపు ధరకే విలువైన భూములను కొట్టేసిన లింగమనేని సంస్థ అప్పటి టీడీపీ సర్కారు అండతో నిబంధనలకు పాతరేసి, అందులో నిర్మాణాలను ప్రారంభించింది. కామన్ సైట్, సెట్ బ్యాక్స్ వంటి నిబంధనలను పాటించలేదు. దీనిపై నంబూరు గ్రామ కార్యదర్శి అబ్దుల్లా రియల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. లింగమనేని ఒత్తిడితో సదరు గ్రామ కార్యదర్శిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలి లింగమనేని అక్రమ నిర్మాణాలపై స్థానికులు న్యాయ పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా లోకాయుక్తను ఆశ్రయించారు. నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు సాగించిన రియల్ ఎస్టేట్ సంస్థపై చర్యలు తీసుకోవాలని లోకాయుక్త 2012లో అప్పటి కలెక్టర్ సురేష్‌కుమార్‌ను ఆదేశించింది. స్పందించిన కలెక్టర్ సురేష్‌కుమార్ దీనిపై విచారణ చేపట్టారు. నిబంధనల ఉల్లంఘన నిజమేనని తేల్చారు. లింగమనేని సంస్థపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని ఉడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చర్యలు తీసుకుంటున్నామని 2013లో లోకాయుక్తకు సమాధానమిచ్చిన ఉడా 2014లో మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ వ్యవహారాన్ని అటకెక్కించిందని ఫిర్యాదుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పటికే ఉడా సహకారంతో వందలాది ఎకరాలను లాక్కున్న లింగమనేని సంస్థ చినకాకాని, కాజా, నిడమర్రు, కంతేరు, నంబూరు గ్రామ పంచాయతీల్లో దాదాపు 1,200 ఎకరాల భూములను దక్కించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం రాజధాని భూ సమీకరణ నుంచి ఈ భూములను మినహాయించింది. లింగమనేని అక్రమాలపై తక్షణమే పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
కరకట్టపై అక్రమ కట్టడాలు
కృష్టానది కరకట్ట తరహాలో గూడూరు పట్టణంలో ఇరిగేషన్ కాలువల కరకట్టలపై టీడీపీ నేతలు అధికారం అండతో అక్రమంగా భారీ భవంతులు నిర్మించారు. కాలువలను కబ్జా చేసి బహుళ అంతస్తుల కళాశాల, కల్యాణ మండపాల భవనాలు నిర్మించారు. అప్పట్లో మంత్రి హోదాలో ఉన్న పొంగూరు నారాయణ అక్రమ నిర్మాణాలను అధికారంతో చట్టబద్ధం చేసుకున్నారు. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా కాలువలు, నదులపై నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతకు చర్యలు చేపట్టడంతో పట్టణ ప్రజల దృష్టి గూడూరులో కాలువల కరకట్టలపై నిర్మించిన అక్రమ కట్టడాలపై పడింది. సాక్షి, గూడూరు: 2012 భవంతుల నిర్మాణ నిబంధనల మేరకు నదుల కరకట్టల నుంచి 500 మీటర్ల వరకూ ఎలాంటి నిర్మాణాలు చేపట్ట కూడదు. 10 మీటర్లపైన వెడల్పు ఉన్న కాలువల నుంచి 100 మీటర్ల వరకూ ఎలాంటి నిర్మాణాలు చేపట్ట కూడదనే నిబంధనలు ఉన్నాయి. ప్రముఖ విద్యా సంస్థల అధినేత నారాయణ ప్రత్యక్ష రాజకీయ ప్రవేశం చేయకముందే ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా తన కళాశాల భవంతులను నిర్మించారు. ఇరిగేషన్ కాలువ కరకట్టను ఆనుకుని ప్రహరీ నిర్మాణంతో పాటు, 100 మీటర్లలోపు ఉన్న ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టేశారు. కరకట్ట పక్కనే కళాశాలకు చెందిన ఆట స్థలం, వాహనాల పార్కింగ్‌ను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. ఇంత జరుగుతున్నా అటు ఇరిగేషన్, ఇటు మున్సిపల్ ఉన్నతాధికారులు గానీ వాటి పైపు కన్నెత్తి చేసి, పట్టించుకున్న దాఖలా లేదు. ఈ నేపథ్యంలో 2012లో వచ్చిన నిబంధనల ప్రకారం మున్సిపల్ అధికారులు, నిబంధనలకు విరుద్ధంగా ఆ భవంతులు ఏర్పాటు చేశారని కళాశాల యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. అప్పటి మున్సిపల్ అధికారులకు ఆయన ద్వారా భారీగా నజరానాలు అందడంతో ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టేశారు. 2014 టీడీపీ అధికారంలోకి రావడంతో మున్సిపల్‌శాఖా మంత్రి పదవి దక్కించుకున్న నారాయణ తన అక్రమ భవనాలను అధికారం అండతో సక్రమం చేయించుకున్నారు. మున్సిపల్ అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు పెంచి, మానసికంగా వేధింపులకు గురిచేసి వారి ద్వారా చట్టబద్ధం చేసుకున్నారు. మినీ బైపాస్ ప్రాంతంలో ఉన్న ఇరిగేషన్ కాలువను చదును చేసి, ఆ ప్రాంతంలోనే బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించేశారు. నారాయణను ఆదర్శంగా తీసుకుని.. నారాయణ అక్రమ కట్టడాలను అడ్డుకోవాల్సిన ఇరిగేషన్, మున్సిపల్ శాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. దీంతో ఆయన అడుగుజాడల్లోనే ఐసీఎస్ రోడ్డు ప్రాంతంలో అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి వనజాకృష్ణ కల్యాణ మండపం పేరుతో తనుకున్న 12 అంకణాల స్థలాన్ని అడ్డుపెట్టుకుని, కోట్ల రూపాయల విలువ చేసే 99 అంకణాల ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాన్ని చేపట్టేశారు. ఈ నిర్మాణంతో చెరువుకు సాగునీరు పారే నాయుడుకాలువ ఆక్రమణతో కుంచించుకుపోయింది. ఈ అక్రమ కట్టడంపై పట్టణానికి చెందిన కొందరు లోకాయుక్తలో కూడా ఫిర్యాదు చేశారు. వారు అక్రమ నిర్మాణాలను తొలగించాలని కూడా ఆదేశించారు. కానీ తన రాజకీయ పలుకుబడితో జిల్లా రింగ్ లీడర్స్ అయిన బీద బ్రదర్స్, అప్పటి ఎమ్మెల్యే ద్వారా అధికారులను భయభ్రాంతులకు గురి చేయడంతో వారు అటు వైపు కన్నెత్తి చూసిన దాఖలా లేదు. దీంతో అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు చెలరేగిపోయారు. కోట్లాది రూపాయల విలువ చేసే నీటి పారుదల శాఖ కాలువపైనే దుకాణ సముదాయం ఏర్పాటుతో పాటు, మరో వ్యక్తి సొంత స్థలాన్ని అడ్డుపెట్టుకుని, సుమారు 15 అంకణాల కాలువ స్థలాన్ని ఆక్రమించేసి, బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించేశారు. ఆ బహుళ అంతస్తులో ఆంధ్రా బ్యాంకు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు అద్దెలకు ఇచ్చి జేబులు నింపుకుంటున్నారు. ఈ కాలువ వెడల్పు 25 అడుగులకుపైగా ఉండాల్సి ఉండగా, కాలువ పొడవునా ఆక్రమణలతో కుంచించుకుపోయి, ప్రస్తుతం అది డ్రెయినేజీ కాలువలా మారింది. దీంతో చెరువుకు వర్షపు నీరు పారే పరిస్థితి లేక గత నాలుగేళ్లుగా ఆయకట్టు పండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడూరుకు వరద ముంపు ముప్పు గూడూరు పట్టణంలో నుంచి వెళ్తున్న భారీ నీటిపారుదల కాలువలను ఆక్రమించి భారీ భవంతులు నిర్మించడంతో కాలువ కుచించుకుపోయింది. ప్రస్తుతం పైతట్టు ప్రాంతాల్లోని వర్షపు నీరంతా ఈ కాలువల ద్వారా చెరువులకు నీరు చేరాల్సి ఉంది. కాలువలు ఆక్రమణల్లో ఉండడంతో నీరు ముందు సాగే పరిస్థితి లేక గూడూరు పట్టణం ముంపునకు గురయ్యే ముప్పు ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2015లో వచ్చిన భారీ వరదల్లో నీటి ప్రవాహం కిందికు వెళ్లలేక, నారాయణ ఆక్రమించి కట్టిన కళాశాల వసతి గృహం ముంపునకు గురైంది. దీంతో అందులో ఉంటున్న వందలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీని కారణంగా అప్పట్లో జాతీయ రహదారిపై వరద నీరు పారడంతో ఒత్తిడి పెరిగి రోడ్డు కొట్టుకుపోయింది. ఈ ఏడాది భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతుండడంతో గూడూరు పట్టణ ప్రజలు హడలిపోతున్నారు. భారీ వానలు కురిస్తే భారీగా వరదలు వస్తాయని, లోతట్టు ప్రాంతాలే కాక, మిట్ట ప్రాంతాలు కూడా నీటి ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. -
జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంలోని అక్రమ కట్టడాల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని ఏపీ బీజేవైఎం అధ్యక్షుడు రమేష్ నాయుడు తెలిపారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరకట్టపై ఉన్న అన్ని అక్రమ కట్టడాలను కూల్చి వేయాలని డిమాండ్ చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేత విషయంలో ప్రభుత్వానికి బీజేపీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు చేరువులు, దేవాలయాల భూములు కబ్జా చేశారని రమేష్ నాయుడు ఆరోపించారు. వీటిన్నంటిని కూడా కూల్చివేయాలని.. అలా చేస్తే జగన్‌కు పుష్పాభిషేకం చేస్తామని పేర్కొన్నారు. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ ఇలా ఎవరు అక్రమ కట్టడాలు కట్టినా కూల్చివేయాలని రమేష్ నాయుడు డిమాండ్ చేశారు. విభజనలో ఆంధ్రప్రదేశ్ నష్టపోయిందన్నారు రమేష్ నాయుడు. ఏపీ విషయంలో కేసీఆర్ కొంత పట్టువిడుపులు ప్రదర్శించాలని కోరారు. రాయల సీమ కరువుతో అల్లాడుతోందన్నారు. నీటి పంపకాల విషయంలో రెండు రాష్ట్రాలు అనుమానాలకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు వర్తింప జేయాలని.. ప్రైవేట్ స్కూల్లకు రెండో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. -
చంద్రబాబు నివాసంతో సహా 28 ఇళ్లకు నోటీసులు
-
చంద్రబాబు ఇంటికి నోటీసులు
సాక్షి, అమరావతి: కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ అక్రమంగా నిర్మించిందేనని నిర్ధారించిన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) శుక్రవారం నోటీసులు జారీ చేసింది. నివాసానికి బయటవైపు గోడకు లింగమనేని రమేష్ పేరుతో అధికారులు నోటీసులు అంటించారు. చంద్రబాబు నివాసంతోపాటు 28 భవనాలకు నోటీసులు ఇచ్చారు. చట్టపరమైన అనుమతి పొందకుండా మొదటి అంతస్తు గదులు, భవన నిర్మాణం చేపట్టారని సీఆర్డీఏ సెక్షన్ 115(1)&115(2) కింద నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని, సంజాయిషీ సరిగ్గా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇలాంటి నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. అక్రమ కట్టడమైన ప్రజావేదికను ఆయన ఆదేశాల మేరకు ఇప్పటికే తొలగించారు. -
అక్రమ నిర్మాణదారులకు షోకాజ్ నోటీసులు!
సాక్షి, అమరావతి: కృష్ణానది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇలాంటి నిర్మాణాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఆదేశించిన సంగతి తెలిసిందే. చట్టాలను ఉల్లంఘిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా కరకట్ట లోపల నిర్మించిన నిర్మాణాలన్నింటికీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్డీఏ) నోటీసులను సిద్ధం చేసింది. ఏ క్షణమైనా అక్రమ నిర్మాణదారులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇల్లు కూడా అక్రమంగా నిర్మించిందేనని సీఆర్డీఏ నిర్ధారించింది. చంద్రబాబు సహా ఆ భవన యజమాని లింగమనేని రమేష్‌కు సైతం నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది. కరకట్ట లోపల నిర్మించిన మిగిలిన అన్ని భవనాల యజమానులకు నోటీసులు ఇవ్వనున్నారు. అక్రమ కట్టడమైన ప్రజావేదికను జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే తొలగించారు. దీనికి కొనసాగింపుగా అన్ని అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు సీఆర్డీఏ నడుం బిగించింది. అక్రమ నిర్మాణానికి ప్రజల సొమ్ముతో హంగులు కృష్ణా నదీ తీరంలో లింగమనేని రమేష్ కొన్నేళ్ల క్రితం నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి అతిథిగృహం నిర్మించగా, 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని లీజుకు తీసుకుని అందులో నివసిస్తున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే అక్రమ కట్టడంలో నివాసం ఉండడం ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నించినా చంద్రబాబు లెక్కచేయలేదు. పైగా ప్రభుత్వ నిధులతో ఆ భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. జీ+1 భవనంలో అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇందుకోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు అక్రమ కట్టడాలను ప్రోత్సహించడంతో కరకట్ట లోపల చాలామంది అక్రమ నిర్మాణాలు చేశారు. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సామాన్యుడికి ఒక నిబంధన, పెద్దలకు ఒక నిబంధన ఉండదని, అన్ని అక్రమ నిర్మాణాలను తొలగించేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు నివాసంలో అన్నీ అతిక్రమణలే చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేష్ అతిథి గృహంలో నిబంధనలకు విరుద్ధంగా కట్టిన జీ+1 భవనం, ఇతర నిర్మాణాలను వారం రోజుల్లో తొలగించాల్సి ఉందని, వాటిని ఎందుకు నిర్మించారో వివరణ ఇవ్వాలని సీఆర్డీఏ నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. సీఆర్డీఏ నుంచి అనుమతి తీసుకోకపోవడం, ఏపీ బిల్డింగ్ రూల్స్–2012, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2015లో జారీ చేసిన ఉత్తర్వులు, అమరావతి క్యాపిటల్ సిటీ జోనింగ్ రెగ్యులేషన్–2016కి విరుద్ధంగా ఈ నిర్మాణాలు ఉన్నట్లు సీఆర్డీఏ గుర్తించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి పరిధిలోని డి.నెం.250, 254, 272, 274, 790/1లో ఎకరం ఆరు సెంట్ల స్థలంలో అనుమతి లేని ఈ నిర్మాణాలను గుర్తించారు. తమ నోటీసులపై వారం రోజుల్లో స్పందించి వివరణ ఇవ్వాలని, లేకపోతే సంబంధిత భవనాన్ని తొలగిస్తామని నోటీసుల్లో స్పష్టం చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ సంజాయిషీ ఇచ్చినా, అది సంతృప్తికరంగా లేకపోయినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. కృష్ణానది కరకట్టపై వంద మీటర్ల లోపు 50కి పైగా భవనాలను అక్రమంగా నిర్మించినట్లు సీఆర్డీఏ అధికారులు గుర్తించారు. వాటన్నింటికీ నోటీసులు అందజేయనున్నారు. నోటీసుల్లో ఇచ్చిన గడువులోపు భవన యజమానులు, అద్దెదారులు వివరణ ఇవ్వకపోయినా, అది సరిగ్గా లేకపోయినా నిబంధనలకు అనుగుణంగా వాటిని కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నారు. -
ఇంకా చంద్రబాబు పెత్తనమేనా?
సాక్షి, అమరావతి : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లి–అమరావతి కరకట్ట వెంట కృష్ణాతీరంలో రిజర్వ్ కన్జర్వేటరీలో నిబంధనలకు విరుద్ధంగా నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆయన నివాసం వైపు రాత్రి వేళల్లో వాహనాలు వెళ్లనీయకుండా నిలుపుదల చేశారు. అయితే ఎన్నికలు ముగిసి, తెలుగుదేశం పార్టీ ఓడిపోయి, చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయి, ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమితమైనప్పటికీ ఇప్పటికీ కూడా రాత్రి 10 గంటలు దాటిన తర్వాత చంద్రబాబు నివాసం వైపు ప్రయాణికులను, రైతులను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు ఆయన ఇంటికి మూడు వైపులా దారులు మూసివేశారు. మరోవైపు కృష్ణానదిలో మత్స్యకారులను వెళ్లనీయకుండా నిరంతరం పోలీసులు కాపలా కాస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సీతానగరం కొండవీటివాగు హెడ్‌స్లూయిస్ నుంచి చంద్రబాబు నివాసానికి 3 కి.మీ.ల దూరం ఉంటుంది. కొండవీటి వాగుకి, కరకట్టకు మధ్య సుమారు 500 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి. ఈ పంట పొలాల్లో ఎక్కువ శాతం పూల తోటలు, కూరగాయలు ఉండటంతో రైతులు తెల్లవారుజామున ఒంటిగంట నుంచి మూడు గంటల సమయంలో పొలాలకు వెళుతుంటారు. రైతులను పొలాలకు వెళ్లనీయకుండా పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అధికారం కోల్పోయినా చంద్రబాబునాయుడు పెత్తనం చెలాయిస్తున్నాడని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. ఈ విషయమై ఆ ప్రాంత రైతులు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, చంద్రబాబు నాయుడు అక్రమ కట్టడంలో దౌర్జన్యంగా నివాసం ఉంటున్నాడని, కష్టపడే రైతు పంట పొలానికి వెళ్లనీయకపోతే సహించేది లేదని, రెండు మూడు రోజుల్లో పోలీసులు బారికేడ్లు తొలగించకపోతే, ఆయన ఇంటిముందే కూర్చుంటానని ఎమ్మెల్యే ఆర్కే ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు. -
సీఎం చంద్రబాబు ఇంటి సమీపంలో అగ్నిప్రమాదం
-
చంద్రబాబు నివాసం సమీపంలో అగ్నిప్రమాదం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం సమీపంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. కరకట్ట పక్కనే ఉన్న ఎండుగడ్డి తగులబడి పొలాల్లోకి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో చుట్టుపక్కల ప్రాంతం అంతా దట్టమైన పొగ అలుముకుంది. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరైనా కావాలనే ఎండుగడ్డిని తగులబెట్టారా? లేక ప్రమాదవశాత్తూ జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘అవసరమైతే చంద్రబాబు నివాసాన్ని తొలగిస్తాం’
సాక్షి, అమరావతి: పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా లేకపోతే కృష్ణానది కరకట్ట లోపల ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసాన్ని తొలగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కరకట్ట లోపల నది నుంచి వంద మీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదని, సీఎం నివాసం వంద మీటర్ల లోపుంటే తొలగిస్తామని చెప్పారు. విజయవాడలోని తన నివాసంలో ఆయన నిన్న (శుక్రవారం) మీడియాతో మాట్లాడారు. జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఇచ్చిన తీర్పు ప్రకారం కరకట్టలోపల ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదు కదా, ప్రస్తుతమున్న నిర్మాణాల పరిస్థితి ఏమిటని విలేకరులు ప్రశ్నించగా.. మంత్రి బదులిస్తూ నది నుంచి వంద మీటర్ల లోపు ఉన్న నిర్మాణాలన్నింటినీ తొలగించాల్సిందేనన్నారు. ఏ నిర్మాణాలు ఈ పరిధిలో ఉన్నాయో చూస్తామని, సీఎం నివాసం కూడా ఈ పరిధిలోపు ఉందో లేదో చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాజధాని నిర్మాణానికి హరిత ట్రిబ్యునల్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం శుభపరిణామమన్నారు. పర్యావరణ అనుమతులు తీసుకునే సమయంలో రాష్ట్రప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడుతూ రాజధాని నిర్మాణం చేపడతామని ఒక సవివర నివేదిక(డీపీఆర్)ను సంబంధిత మంత్రిత్వశాఖకు ఇచ్చిందని, దాన్ని తూచా తప్పక పాటించాలని ట్రిబ్యునల్ స్పష్టం చేసిందని తెలిపారు. 1,691 ఎకరాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసి సింగపూర్ కంపెనీలకిస్తాం..: రాజధానిలో 1,691 ఎకరాల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుపై సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో చర్చించామని చెప్పారు. సింగపూర్‌ది కేంద్ర ప్రభుత్వం, తమది రాష్ట్రప్రభుత్వం కావడంతో ఒప్పందం అమలులో కొన్ని ఇబ్బందులున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా కేంద్రం ద్వారానే చేయాలని, ఈ చిక్కుల్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 1,691 ఎకరాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసి సింగపూర్ కంపెనీలకు ఇస్తామని, వారు లేఅవుట్లు వేసి జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు వాటిని విక్రయిస్తాయన్నారు. -
ఎమ్మెల్యే గౌతు శివాజీకి మళ్లీ అవమానం
అమరావతి: నిన్న కరకట్ట... ఇవాళ ఏపీ అసెంబ్లీ ఎదుట శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే, అధికారపార్టీ సభ్యుడు గౌతు శ్యామ్ సుందర్ శివాజీకి సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. శుక్రవారం శాసనసభ సమావేశాలకు హాజరు అవుతున్న ఆయనను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్యేనని చెప్పినా సిబ్బంది ఎమ్మెల్యే శివాజీని అసెంబ్లీ లోపలకి అనుమతించలేదు. అయితే ఐడీకార్డు చూపించి తనిఖీ చేసిన తర్వాతే ఆయనను లోనికి అనుమతించారు. కనీసం పీఏ కూడా లేని తనలాంటి వారిని సెక్యూరిటీ సిబ్బంది ఆపుతున్నారని, అదే సుమారు ఓ 15మందిని వెంట తీసుకొచ్చే బోండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్నల లాంటివారికి మాత్రం సెల్యూట్ కొడతారని ఎమ్మెల్యే శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆయన నాలుగురోజుల క్రితం కరకట్టపై నుంచి అసెంబ్లీకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దాంతో శివాజీ పోలీసుల వైఖరికి నిరసనగా కరకట్ట దగ్గర రోడ్డుపైనే సుమారు గంటపాటు ధర్నా చేశారు. -
పలాస ఎమ్మెల్యే గౌతు శివాజీకి తీవ్ర అవమానం!
విజయవాడ: శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే, గౌతు శ్యామ్ సుందర్ శివాజీకు తీవ్ర అవమానం జరిగింది. సోమవారం ఉదయం ఆయన కరకట్టపై నుంచి అసెంబ్లీకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ముఖ్యమంత్రి ఈ మార్గంలో వస్తున్నందున ఎమ్మెల్యే శివాజీ వెళ్ళేందుకు వీలులేదని పోలీసులు ఆపేశారు. దాంతో ఆయన పోలీసుల వైఖరిని నిరసిస్తూ కరకట్ట దగ్గర రోడ్డుపైనే సుమారు గంటపాటు ధర్నాకు దిగారు. అయితే పోలీసు ఉన్నతాధికారులు శాసనసభ్యునికి నచ్చజెప్పి ఉండవల్లి మార్గంలో శాసనసభకు పంపించారు. దాంతో పాలీసుల వైఖరిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకే ఇటువంటి పరిస్థితి ఎదురైతే, సామాన్యుడి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. పోలీసులు ఇప్పటికైనా తమ వైఖరి మార్చుకోకుంటే ఈ ఘటనపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు ఎమ్మెల్యే శివాజీ తెలిపారు. కాగా గతంలోనూ ఎమ్మెల్యే శివాజీకి ఇటువంటి ఘటనలే ఎదురయ్యాయి. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ఆయనను హెలిప్యాడ్ వద్దకు పోలీసులు అనుమతించలేదు. దాంతో శివాజీ అక్కడే నిరసనకు దిగిన విషయం తెలిసిందే. -
ఎమ్మెల్యే గౌతు శివాజీకి తీవ్ర అవమానం!
-
కరకట్ట పటిష్టతపై సర్వే
పెదకళ్లేపల్లి (మోపిదేవి): కృష్ణాకరకట్ట పటిష్టతపై సర్వే చేపట్టినట్లు క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ ఎంపీ రాజు తెలిపారు. మోపిదేవి వార్పు నుంచి పెదకళ్లేపల్లి కృష్ణానది కరకట్ట బలాన్ని పరిశీలించేందుకు గురువారం ఇంజనీరింగ్ అధికారులు మండలంలో పర్యటించారు. ఎస్ఈ మాట్లాడుతూ ఇటీవల కృష్ణానదికి వదిలిన 1.60 లక్షల క్యూసెక్కుల వరదనీటిని తట్టుకునే సామర్థ్యం ఎంతవరకు కరకట్టకు ఉందనే విషయంపై సర్వేచేపట్టినట్లు తెలిపారు. గతంలో 2009లో కృష్ణానదికి అధిక మొత్తంలో వరదనీరు రావడంతో కరకట్ట తెగి గుంటూరు జిల్లాను ముంచెత్తినందున ముందు జాగ్రత్త తీసుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో 2009 నాటి వరద పునరావృత్తమైతే చేపట్టాల్సిన చర్యలతో పాటు పూర్తిస్థాయిలో సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు వివరించారు. ఈఈ ఉమామహేశ్వరావు, ఆర్సీ ఏఈ చలపతిరావు, ఎంపీటీసీ సభ్యులు యక్కటి హనుమాన్‌ప్రసాద్ ఉన్నారు. -
కర‘కట్’
హంసలదీవి సమీపంలో సముద్ర కరకట్టకు భారీ కోత వరద నీటితో ఉధతంగా ప్రవహిస్తున్న కష్ణమ్మ తీరప్రాంతాల ప్రజల్లో ఆందోళన కోడూరు:సముద్రం బారి నుంచి దివిసీమ ప్రజలను రక్షించి కాపాడుతున్న ‘దివి రక్షణ’ కవచమైన కష్ణా కరకట్ట భారీస్థాయిలో కోతకు గురవుతోంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని తీరప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. భారీ వర్షాలతో నిండుకుండలా మారిన ప్రకాశం బ్యారేజీ నుంచి పెద్దఎత్తున వరద నీటిని సముద్రంలోకి వదలడంతో కష్ణానదిలో నీటి ఉధతి గంటగంటకు పెరుగుతోంది. బ్యారేజీ దగ్గర వదిలిన నీరు మొత్తం మండల పరిధిలోని హంసలదీవి సమీపంలోని సాగరసంగమం వద్ద సముద్రంలో కలుస్తాయి. అయితే ఈ వరద నీరు మొదట అవనిగడ్డలోని పులిగడ్డ అక్విడెట్ చేరుకొని అక్కడ నుంచి ఉల్లిపాలెం మీదగా సముద్రంలో కలవాల్సి ఉంది. వరదలు, ఉప్పెనలు వచ్చినప్పుడు నీరు ఊళ్ల మీద పడకుండా 2004వ సంవత్సరంలో నాగాయలంక మండలం గుల్లమోద నుంచి ఉల్లిపాలెం వరకు రూ.25కోట్ల వ్యయంతో కరకట్టను నిర్మించారు. అయితే 2008 సంవత్సరంలో వచ్చిన భారీ వరదల ప్రభావానికి ఉల్లిపాలెం సమీపంలో కరకట్టకు భారీ కోత ఏర్పడింది. ఆ కోత ప్రాంతంలో భారీ కొండరాళ్లతో రివిట్మెంట్ వేశారు. మళ్లీ పక్కనే మరో కోత.. మళ్లీ అక్కడే సముద్రం అటుపోట్లతో రెండు నెలల క్రితం కరకట్టకు కోత ఏర్పడింది. తాజా వరద ఉధతికి కోత మరింత ఎక్కువై ఎప్పడైనా గండిపడే ప్రమాదం పెరిగింది. రెండు నెలల నుంచి సమస్యను ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోలేదని ప్రజలు వాపోతున్నారు. ఇక్కడ ఉపద్రవాలు సంభవించక ముందే అధికారులు రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
నీర్వికుంటే 9న రాస్తారోకో
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు భవానీపురం : హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 7వ తేదీ లోపు కరెంటు, నీటి సరఫరాను పునరుద్ధరించకపోతే 9న రాస్తారోకోకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు పిలుపునిచ్చారు. బాధితులందరూ ప్రతిఘటిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. నదీ తీరం సుందరీకరణ పేరుతో విజయవాడ భవానీపురం కరకట్టపైగల కొన్ని ఇళ్లను ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే. తమకు సముచితమైన నష్టపరిహారం ఇచ్చేవరకు ఇళ్లను తొలగించేందుకు వీలులేదంటూ దాదాపు 70 మంది కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. వారికి కరెంటు, తాగునీటిని బంద్ చేసి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. రెండు నెలలకుపైగా కరెంటు, నీళ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్న బాధితులు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. వారం రోజులలోపు బాధితులకు కరెంటు, నీటి వసతిని పునరుద్ధరించాలని ఈనెల 1వ తేదీన ఉత్తర్వులు జారీచేసింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చి ఆరు రోజులైనా బాధితులకు న్యాయం జరకపోవడంతో సోమవారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్ కరకట్టకు వచ్చి బాధితులతో మాట్లాడారు. మధు మాట్లాడుతూ బాధితులకు 100 గజాల స్థలం, నష్టపరిహారం ఇచ్చి వారి ఇళ్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 8 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యను ప్రతిపక్షాలు లేవనెత్తాలని కోరారు. సీపీఎం నగర కార్యదర్శి కాశీనాథ్ మాట్లాడుతూ కోర్టు ఉత్తర్వులను ధిక్కరించిన అధికారులను అరెస్ట్ చేయాలన్నారు. వెస్ట్ జోన్ నాయకులు యువీ రామరాజు మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న చంద్రబాబు, పేద ప్రజలు అదే కోర్టు నుంచి తెచ్చుకున్న స్టే ఆర్డర్‌ను ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ స్థానిక నాయకులు ఎల్.మోహన్‌రావు, ఎస్ సుబ్బారెడ్డి బాధితులు పాల్గొన్నారు. -
తోటవల్లూరు కరకట్టపై రెండు కార్లు ఢీ..
కృష్ణా(తోటవల్లూరు): కృష్ణా జిల్లా తోటవల్లూరు కరకట్టపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఆదివారం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, పది మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. రెండు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. -
'కృష్ణా కరకట్ట అక్రమ కట్టడాలపై చర్యలేవి?'
విజయవాడ : కృష్ణానది కరకట్టపై అక్రమ కట్టడాలను సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు శుక్రవారం పరిశీలించారు. అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు నిర్మించినవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ కట్టడాలను పరిశీలించాన్నారు. అక్రమాలకు పాల్పడినవారు ఎంతటి వారైనా శిక్షించాల్సిందేనని రాఘవులు వ్యాఖ్యానించారు. రైతులకు ఓ న్యాయం, బడా బాబులకు మరో న్యాయమా అని రాఘవులు ప్రశ్నించారు. సీఆర్డీఏ పరిధిలో నిర్మాణాలకు అనుమతులివ్వమని చెబుతున్న ఏపీసర్కార్ ..బిజెపి కార్యాలయానికి ఎలా అనుమతిస్తుందని ప్రశ్నించారు. కృష్ణా తీరంలో అక్రమ నిర్మాణాలపై సమగ్ర నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తామని ఆయన తెలిపారు. అక్రమ కట్టడాలపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తదుపరి కార్యాచరణ చేపడతామని రాఘవులు హెచ్చరించారు.