సాక్షి, విజయవాడ: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెనుకబడిన వర్గాల అభివృద్ధి దిశగా పనిచేస్తున్నారని తెలిపారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లెఫ్ట్ పార్టీలు సంపన్నుల వైపు నిలబడతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏజెంట్‌లా పవన్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం జగన్ రాజకీయ నిర్ణయాలు చంద్రబాబుకు రాజకీయంగా ఉరితాడు లాంటివని అన్నారు. అందుకే తోడేళ్ల మందలా ఏకమై దాడి చేయాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణసీకారోత్సవ కార్యక్రమం అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు.
'రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి మేలు చేసేలా సీఎం జగన్ పాలన ఉంది. మేనిఫెస్టోలో 98.2 శాతం హామీలను అమలు చేసి చూపించారు. చంద్రబాబు హయాంలో జరిగిన దేశంలోనే అతిపెద్ద స్కామ్ అమరావతి. బాబు అక్రమాలకు చిరునామా చంద్రబాబు కరకట్ట నివాసం. లింగమనేని రమేష్‌కి, హెరిటేజ్‌కి మధ్య లావాదేవీలు జరిగాయి. చంద్రబాబు బరితెగింపునకు నిదర్శనం ఈ అక్రమ నివాసం. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చట్టం చేసిన వ్యక్తి చంద్రబాబు. డబ్బున్న వాళ్లకోసం పేదలకు ఇవ్వకుండా చేశారు. రియల్‌ఎస్టేట్ ఏజెంట్ల ద్వారా చంద్రబాబు గొడవ చేయిస్తున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకుంటున్నారు.' అని సజ్జల ఫైర్ అయ్యారు.
చదవండి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం..
Comments
Please login to add a commentAdd a comment