
సాక్షి, తాడేపల్లి: కరకట్టపై ఓవర్‌యాక్షన్ చేసిన టీడీపీ నేతలను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజా వేదిక వద్ద నిరసన తెలిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వదానికి దిగారు. అయితే కరోనా నేపథ్యంలో నిరసనలకు అనుమతి లేదని పోలీసులు వారికి తెలిపారు. కానీ టీడీపీ నేతలు పోలీసులు మాట లెక్కచేయకుండా.. ప్రజా వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అక్రమ నివాసం నుంచి ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి ఏడాది అయిన చంద్రబాబు నాయుడు మాత్రం ఇంకా అక్కడే ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment