
గుంటూరు, సాక్షి: మంగళగిరిలోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయం వద్ద మంగళవారం మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఆందోళనకు దిగారు. తాడికొండ అసెంబ్లీ సీట్లు మాదిగలకే కేటాయించాలంటూ నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. ఒకవేళ తాడికొండ(గుంటూరు) సీటును మాదిగలకు ఇవ్వకపోతే తగిన బుద్ధి చెప్తామని మాదిగ నాయకులు టీడీపీ అధిష్టానానికి హెచ్చరికలు జారీ చేశారు.
తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తెనాలి శ్రావణ్ కుమార్‌ను టీడీపీ అధిష్టానం ఈ మధ్యే నిర్ణయించింది. అయితే అది ఏకపక్షంగా జరిగిన ప్రకటన అంటూ మాదిగ నేతలు రంగంలోకి దిగారు. ఆ సీటు తమ సామాజిక వర్గానికే ఇవ్వాలంటూ నిరసనకు దిగడం చంద్రబాబుకు ఊహించని షాక్ అనే చెప్పాలి. సీనియర్ నేత టీడీ జనార్ధన్ ప్రస్తుతం వాళ్లను బుజ్జగించే యత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment