సాక్షి,అమరావతి : ప్రకాశం బ్యారేజ్‌కు రికార్డ్ స్థాయిలో వరద నీరు చేరింది. వరద ఇన్‌ఫ్లో,ఔట్ ఫ్లో 11.43 లక్షల క్యూసెక్కులు దాటింది. దీంతో కరకట్ట మీదగా నీరు ప్రవహించడంతో.. ఆ వరద చంద్రబాబు నివాసంలోపలకి వెళ్లింది. నీరు లోపలికి రాకుండా సిబ్బంది ఆదివారం లారీలతో ఇసుక తరలించి అడ్డుపెట్టారు. అయినప్పటికీ వరద తీవ్రతతో నీరు చంద్రబాబు ఇంటి లోపలికి చేరింది. దీంతో సిబ్బంది ఆరుకు పైగా మోటర్లను ఉపయోగించి వరద నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.
చంద్రబాబు నివాసాన్ని చుట్టుముట్టిన వరద
ఆదివారం రాత్రి 7గంటలకు ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరుతున్న ప్రవాహం 9,17,976 క్యూసెక్కులకు చేరడంతో కృష్ణా నది కరకట్ట లోపల ఉన్న చంద్రబాబు నివాసాన్ని వరద చుట్టుముట్టింది. ఇందులో నారా లోకేష్ గెస్ట్ హౌస్‌గా పేర్కొనే అప్పారావు బంగ్లా కూడా ఉంది. అయితే ఇసుక బస్తాలు వేసి వరద నీరు లోపలికి రాకుండా ఆపే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమైంది.
కలెక్టర్ కార్యాలయంలో బాబు బస
ఆదివారం రాత్రికి కృష్ణా వరద ఉధృతి మరింత పెరుగుతుందని, రాత్రికి ఉండవల్లి నివాసంలో బస చేస్తే ప్రమాదమని సీఎం చంద్రబాబుకు జనవనరుల శాఖ అధికారులు వివరించారు. దీంతో ఆదివారం రాత్రికి విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు బస చేశారు.
Comments
Please login to add a commentAdd a comment