సాక్షి, విజయవాడ: కరకట్టపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నివాసాన్ని జప్తు చేసేందుకు అనుమతివ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది. విజయవాడ ఏసీబీ కోర్టు ఈ పిటిషన్‌పై వాదనలు విననుంది.
చంద్రబాబు ఉంటున్న ఆ నివాసం.. లింగమనేని రమేష్ పేరిట(గెస్ట్‌హౌజ్‌గా) ఉంది. అయితే.. దానిని చంద్రబాబు అక్రమంగా పొందారని, దానిని జప్తు చేసేందుకు అనుమతి ఉత్తర్వులు ఇవ్వాలంటూ నాలుగురోజుల క్రితం దరఖాస్తు చేసుకుంది సీఐడీ. దీంతో.. విచారణ తర్వాత తీర్పు ఇవ్వనుంది ఏసీబీ కోర్టు.
Comments
Please login to add a commentAdd a comment