lingamaneni Ramesh
-
నీకింత..నాకింత...భూ‘దండు’ పాళ్యం బ్యాచ్–4
చంద్రబాబుది పైకి అభివృద్ధి మంత్రం.. లోన కుట్ర, కుతంత్రం. అరచేతిలో సింగపూర్‌ను చూపించి.. అమరావతిని చంద్రబాబు అండ్ కో ముక్కలు చేసి పంచుకుంది. పచ్చదండు బినామీలు పచ్చని భూముల్ని గద్దల్లా తన్నుకుపోయారు. ఈ డ్రామాలో నారాయణ, లింగమనేని ఇలా ఎవరికి వారే వీర లెవల్లో రక్తి కట్టించారు. క్విడ్ ప్రోకోతో అనుమానం రాకుండా కథంతా నడిపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు పేరిట లింగమనేనికి భూముల లబ్ధి, నారాయణ కోసం అష్టవంకర్లుగా రింగ్ రోడ్డు ఎసిసోడ్ ఈ డ్రామాకే హైలైట్. బాబు, నారాయణ ద్వయం లింగమనేని రమేశ్‌తో ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్లో బేరం కుదుర్చుకుని క్విడ్ ప్రోకోకు బరితెగించారు. తిలా పాపం.. తలా పిడికెడు.. అన్నట్లు ఈ దోపిడీలో తన దత్తపుత్రుడికీ చంద్రబాబు కొద్దిపాటి వాటా పంచారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను తమకు భూములు కానుకగా ఇచ్చిన వారికి అనుకూలంగా చేయడమే ఈ క్విడ్ ప్రోకో కథ. ప్రతిఫలంగా హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు, బాబుకు కరకట్టపై బంగ్లా కానుక. రాజధానిలో కాగితాలపై ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్‌మెంట్‌ను ఇష్టమొచ్చినట్టుగా మెలికలు తిప్పుతూ తమ భూముల ధరలు వేల కోట్లకు పెంచుకోవడంలో చంద్రబాబు బరితెగింపునకు బాబోయ్ అనాల్సిందే. లింగమనేని రమేశ్ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి రూ.887.50 కోట్లకు.. రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చేశారు. ఈ కుంభకోణాన్ని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం పూర్తి ఆధారాలతో సహా వెలికితీసి చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేశ్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ కేపీవీ అంజని కుమార్, హెరిటేజ్ ఫుడ్స్, ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్, నారా లోకేశ్‌లపై కేసు నమోదు చేసింది. సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి పేరుతో చంద్రబాబు సాగించిన దోపిడీ కాండ గురించి రెండు మూడు సీజన్లతో వెబ్ సిరీస్ తీయొచ్చు. ఈ కుంభకోణంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పుల ఘట్టం అత్యంత కీలకం. సీఆర్డీఏ అధికారుల 94 కి.మీ. అలైన్మెంట్ ప్రకారం లింగమనేని, నారాయణ కుటుంబాలకు చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి ఐఆర్ఆర్ నిర్మించాలి. అయితే చంద్రబాబు ఆదేశాలతో సీఆర్డీఏ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. చంద్రబాబు, లింగమనేని కుటుంబాలకు చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన 13 ఎకరాలను ఆనుకుని ఐఆర్ఆర్ నిర్మించేలా అలైన్మెంట్ ఖరారు చేశారు. దీనిని గోప్యంగా ఉంచిన చంద్రబాబు, నారాయణలు తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేశ్ తన సంస్థల పేరిట ఇన్నర్ రింగ్ రోడ్డుకు అటూ ఇటూ భారీగా భూములు కొన్నారు. అనంతరం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చారు. అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్‌ను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు. అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించారు. మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే డిజైన్ ఉండాలని ఈ కన్సల్టెన్సీకి షరతు విధించారు. అంటే... అప్పటికే సీఆర్డీఏ అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీని అడ్డం పెట్టుకొని ఆమోదించేలా చేశారు. ఇదేం పని నారాయణ! సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాలి. గుంటూరు జిల్లాలోని నూతక్కి – కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించి అక్కడ నుంచి తాడిగడప – ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డు కొనసాగిస్తారు. ఇలాగైతే నారాయణ విద్యా సంస్థల భవనాలను భూసేకరణ కింద తొలగించాలి. దీంతో సీఆర్డీఏ అధికారులపై నారాయణ తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఆదేశాలతో అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. దీని ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రపురం– కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మిస్తారు. అక్కడి నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మిస్తారు. హెరిటేజ్‌కు భూ సంతర్పణ అలైన్‌మెంట్‌ను మెలికలు తిప్పి లింగమనేని కుటుంబానికి కల్పించిన ప్రయోజనానికి క్విడ్ ప్రోకోగా హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు సమకూరాయి. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకునే కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్‌కు 10.4 ఎకరాల లబ్ధి కలిగింది. 2014 జూన్–సెపె్టంబర్ మధ్యలో ఈ భూములను హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసినట్టు చూపించారు. ఈ వ్యవహారంలో హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేశ్ ఉన్నారు. లింగమనేని కుటుంబం నుంచి మరో 4.55 ఎకరాలను కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. ఇదిలా ఉండగా క్విడ్ ప్రో కోలో భాగంగా లింగమనేని రమేశ్ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న తమ బంగ్లాను చంద్రబాబుకు బహుకరించారు. పవన్ కల్యాణ్‌కు ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌కు సమీపంలోనే 2.4 ఎకరాలు ధారాదత్తం చేశారు. ఐఆర్ఆర్లో అవినీతి విశ్వరూపం ఐఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారుకు ముందు ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.50 లక్షలుండేది. ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు తర్వాత ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి పూర్తయితే ఎకరా విలువ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో రూ.4 కోట్లకు చేరుతుందని చంద్రబాబు అప్పట్లోనే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని ఆయన అంచనా వేశారు. అమరావతి నిర్మాణం పూర్తయితే లింగమనేని కుటుంబ సభ్యులకు చెందిన 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. మార్కెట్ ధర ప్రకారం హెరిటేజ్ ఫుడ్స్ 10.4 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి పూర్తయితే అది రూ.54 కోట్లకు చేరుతుందని లెక్క తేలింది. హెరిటేజ్ ఫుడ్స్‌తో ఒప్పందం చేసుకున్న మరో 4.5 ఎకరాల విలువ సైతం రూ.24 కోట్లకు చేరుతుంది. -
ఓం భూం స్వాహా!
‘నా పరిశీలనకు వచ్చిన, తెలియవచ్చిన విషయాల్ని ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని చెబుతూ 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కుర్చిలో కూర్చున్నాక.. కుట్రలు చేయడంలో, నమ్మిన ప్రజల్ని మోసగించడంలో సిద్ధ హస్తుడైనచంద్రబాబు ఆ ప్రమాణాన్ని నిస్సిగ్గుగా ఉల్లంఘించారు. అత్యంత కీలకమైన రాజధాని రహస్యాన్ని ఎల్లో గ్యాంగ్‌కు లీక్ చేసి సీఎం పదవికే కళంకం తెచ్చారు. అంతర్జాతీయ రాజధాని అంటూ ప్రధానితో పాటు ప్రముఖుల్ని పిలిచి హడావుడి చేసినప్పుడు.. బాబు కుట్రల్ని జనం పసిగట్టలేకపోయారు. ఇదంతా పేదల అసైన్డ్ భూముల స్వాహాకు, ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం చంద్రబాబు వేసిన ఎత్తులు, జిత్తులని అప్పుడు వారికి తెలియలేదు. ‘రాజధాని ఫైల్స్’ డ్రామాలో పేద రైతుల అసైన్డ్ భూములను బెదిరించి బినామీల రూపంలోసొంతం చేసుకుని కథ నడిపించారు. ఎవరికీ చెందని ప్రభుత్వ అసైన్డ్ భూములు తమ వారివే అంటూ రికార్డులు సృష్టించి స్వాహా చేశారు. తన పని పూర్తయ్యాక.. గ్రాఫిక్స్ రాజధాని కట్టలేక చేత్తులేత్తేసి ఎన్నికల ముందు కొత్త డ్రామాలు అందుకున్నారు. ఈ డ్రామాలో బాబు బృందంలోనిమంత్రులు, ఎమ్మెల్యేలు...ఆయనకు ఆప్తులు అందరూ పాత్రధారులే.. ‘చేసేది నువ్వు.. చేయించేది నేను..’ రాజధాని ఫైల్స్‌లో చంద్రబాబు డైలాగ్ ఇదే. తెరముందు రాజధాని రూపశిల్పి.. తెరవెనుక రాజధాని లీక్స్ సూత్రధారి. అసలు సూత్రధారులు చంద్రబాబు, లోకేశ్ కాగా.. పాత్రధారులు నారాయణ, లింగమనేని రమేష్, ప్రత్తిపాటి పుల్లారావు, సుజనా చౌదరి, వేమూరి రవికుమార్, మాగంటి మురళీ మోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు ఇలా 1,336 మంది బినామీలున్నారు. అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్‌తో రూ.లక్షల కోట్ల భూ దందాకు తెగించారు. అసైన్డ్ దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్‌లో 1,336 మంది బినామీ ‘బాబు’ల బాగోతం సాక్షి, అమరావతి : అమరావతి భూదోపిడీకి కర్త, కర్మ, క్రియ చంద్రబాబే. అసైన్డ్ భూములు, ప్రైవేటు భూములు, క్విడ్ ప్రోకో భూములు, బంగ్లాలు.. ఇలా ఒకటేమిటి.. చంద్రబాబు అక్రమ సామ్రాజ్యంలో అన్నీ భాగమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలతో క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌కు 14 ఎకరాలు దక్కాయి. కృష్ణానది కరకట్ట మీద ఉన్న లింగమనేని బంగ్లా ఆయన పరమైంది. ఎస్సీ, ఎస్టీ, రైతులను భయపెట్టి బినామీల పేరిట కొల్లగొట్టిన వందలాది ఎకరాలు చంద్రబాబు ఖాతాలోకే వెళ్లాయి. సింగపూర్ కంపెనీ పేరిట స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోని భూముల అసలు హక్కుదారూ చంద్రబాబు కుటుంబమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌కు ఇరువైపులా, అమరావతి సీడ్ క్యాపిటల్ పరిధి దాటి బినామీల పేరిట కొనుగోలు చేసిన దాదాపు 5 వేల ఎకరాల అసలు యజమాని చంద్రబాబు కుటుంబమే. చినబాబుది పెద్ద వాటానే అమరావతి భూ కుంభకోణంలో లోకేశ్‌ది పెద్ద వాటానే. తన బినామీ, ఎన్నారై వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించిన వేమూరి రవికుమార్‌తో పాటు మరికొందరు బినామీల పేరిట వేలాది ఎకరాలు దక్కించుకున్నారు. వేమూరి రవికుమార్‌తోపాటు ఆయన భార్య అనూరాధ గోష్పాది గ్రీన్‌ఫీల్డ్స్ పేరిట అమరావతిలోని కోర్ క్యాపిటల్ ప్రాంతంలోనే 500 ఎకరాలకుపైగా స్వాహా చేశారు. అవినీతి తిమింగలం లింగమనేని అమరావతిలో అవినీతి తిమింగలం లింగమనేని రమేశ్. చంద్రబాబు భూ దోపిడీలో ఇతనూ ఒక ప్రధాన పాత్రధారి. ఆయన కుటుంబానికి చెందిన 355 ఎకరాలను ఆనుకునే ఇన్నర్ రింగ్ రోడ్డు నిరి్మంచేలా అలైన్మెంట్ ఖరారు చేశారు. తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట కొనుగోలు చేసిన వందలాది ఎకరాలను భూ సమీకరణ ప్రక్రియ నుంచి తప్పించారు. అమరావతిలో దాదాపు వెయ్యికి పైగా ఎకరాలు లింగమనేని హస్తగతం చేసుకున్నారు. నారాయణ తంత్రం.. సుజనా, ప్రత్తిపాటి భూదందా చంద్రబాబు తరువాత అమరావతి భూ దోపిడీలో రెండో పెద్ద దోపిడీదారు నారాయణ. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కో లో ప్రధాన పాత్రధారు. కృష్ణా నదికి ఇటువైపు.. అటువైపు, కృష్ణా జిల్లా పరిధిలో ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్‌కు దగ్గరలో వేలాది ఎకరాలు కొనుగోలు చేశారు. అక్కడ నారాయణ విద్యా సంస్థల భూములు ఉన్నాయి. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తన ఉద్యోగులను బినామీలుగా చేసి 162 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. అసైన్డ్, ప్రైవేటు భూములు కలిపి దాదాపు 3 వేల ఎకరాల వరకు బినామీల పేరిట గుప్పిట పట్టారు. నారాయణ బినామీ కంపెనీ రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌ది అమరావతి భూ కుంభకోణంలో కీలక పాత్ర. అసైన్డ్ భూముల దోపిడీలో ఆ కంపెనీ ఎండీ అంజనీకుమార్ కీలకంగా వ్యవహరించారు. అమరావతిలో దాదాపు 2 వేల ఎకరాలను బినామీలు, ఉద్యోగుల పేరిట రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ కొల్లగొట్టింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి అమరావతి భూ దోపిడీలో అతిపెద్ద వాటాదారు. ఆయన తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఏకంగా 700 ఎకరాల వరకు కొల్లగొట్టారు. అమరావతి భూదోపిడీలో బినామీల పేరిట అసైన్డ్ భూములతో సహా 196 ఎకరాలు దోచుకున్నారు. -
చంద్రబాబు డాబుగా ఉంటున్న ఇల్లు ఎవరిది..?
-
కరకట్ట సాక్షిగా క్విడ్ ప్రో కో
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో జరిగిన అమరావతి భూకుంభకోణం కచ్చితంగా క్విడ్ ప్రో కోనే అన్నది స్పష్టమైంది. దీనికి కర్త, కర్మ, క్రియ అంతా నాటి సీఎం చంద్రబాబే అన్నది తేటతెల్లమైంది. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కోలో భాగంగానే ఏ–1 చంద్రబాబుకు కరకట్ట నివాసం, ఏ–2 పొంగూరు నారాయణకు సీడ్ క్యాపిటల్‌లో భూములు దక్కాయని తేలిపోయింది. సీడ్ క్యాపిటల్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారులో ఏ–3 లింగమనేని రమేశ్ కుటుంబానికి నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం చేకూర్చినందుకే వారిద్దరికీ ఆ ఆస్తులు దక్కాయనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయస్థానం పేర్కొంది. క్విడ్‌ప్రోకో అభియోగాలను కొట్టివేసేందుకు ఎలాంటి ఆధారాలు లేవని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం స్పష్టం చేసింది. చంద్రబాబు కరకట్ట నివాసం, నారాయణకు అమరావతిలో ఉన్న ప్లాట్లు, కౌలు, బ్యాంకులో ఉన్న నిధుల అటాచ్‌మెంట్‌కు అనుమతినిస్తూ తాజాగా ఇచ్చిన ఉత్తర్వులలో న్యాయస్థానం కీలక అంశాలను వెల్లడించింది. ఈ కుంభకోణంలో చంద్రబాబు, నారాయణ అంతా తామై నడిపిన వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. అంతా ఏ–1 చంద్రబాబే అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ అంతా నాటి సీఎం, ఈ కేసులో ఏ–1 చంద్రబాబు కనుసన్నల్లోనే సాగింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన సమయంలో సీఆర్డీయే ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా వ్యవహరించిన చంద్రబాబుకు మాస్టర్‌ప్లాన్ గురించి మొత్తం ముందే తెలుసని న్యాయస్థానం స్పష్టం చేసింది. మాస్టర్‌ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకుంది చంద్రబాబే అని పేర్కొంది. అంతేకాదు రాజధాని ఎంపిక, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు ప్రక్రియలో ఆయనకు పూర్తి భాగస్వామ్యం ఉందని తేల్చి చెప్పింది. అలైన్మెంట్ మూడుసార్లు మార్పు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా లింగమనేని రమేశ్ కుటుంబంతో చంద్రబాబు, నారాయణ క్విడ్‌ప్రోకోకు పాల్పడటంపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. టీడీపీ ప్రభుత్వంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మూడుసార్లు మార్చారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని స్పష్టంచేసింది. 2015 జూలై 22, 2017 ఏప్రిల్ 4, 2018 అక్టోబరు 31న ఇన్నర్‌రింగ్ అలైన్మెంట్లో మార్పులు చేశారని న్యాయస్థానం వెల్లడించింది. ఆనుకుని లింగమనేనికి 168.45 ఎకరాలు ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మార్చడం ద్వారా లింగమనేని కుటుంబానికి టీడీపీ ప్రభుత్వం ప్రయోజనం కల్పించిందన్నది నిర్ధారణ అయ్యింది. ఈ కేసులో ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ కుటుంబానికి ఇన్నర్‌రింగ్ రోడ్డు తుది అలైన్‌మెంట్‌ను ఆనుకునే 168.45 ఎకరాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించారా లేదా అన్నదానితో దీనికి సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టంగా వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లేని ఇన్నర్‌రింగ్ రోడ్డుపై కేసులు పెట్టడం ఏమిటంటూ టీడీపీ నేతలు ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నారు. అయితే ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించారా లేదా అన్నదానితో నిమిత్తం లేదని, లింగమనేని కుటుంబానికి ప్రయోజనం కల్పించే రీతిలోనే అలైన్‌మెంట్‌ను ఖరారు చేసినట్లు న్యాయస్థానం వ్యాఖ్యల ద్వారా తేటతెల్లమైంది. టీడీపీ 2019లో మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే అదే అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్‌రింగ్ రోడ్డును నిర్మించి లింగమనేని కుటుంబానికి భారీగా లబ్ధి కలిగించేదన్నది స్పష్టం. కరకట్ట కట్టడం.. క్విడ్‌ప్రోకో కిందే చంద్రబాబు ఉంటున్న కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మించారని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఏ–3గా ఉన్న లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ నివాసంలో ఏడేళ్లుగా నివసిస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. సీఎం హోదాలోనూ, ప్రతిపక్ష నేత హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు నివసిస్తున్నారు. ఆ నివాసం గురించి ప్రభుత్వంతో లింగమనేని అధికారికంగా ఎలాంటి వ్యవహారాలు నెరపలేదని న్యాయస్థానం వెల్లడించడం గమనార్హం. అంటే ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వలేదన్నది స్పష్టం. కరకట్ట నివాసాన్ని లింగమనేని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారంటూ టీడీపీ చేస్తున్న వాదన పూర్తిగా అవాస్తవం అని దీంతో తేలిపోయింది. ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్ చంద్రబాబుకు వ్యక్తిగతంగానే ఇచ్చారు. రాజధాని మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లలో కుంభకోణం ద్వారా భారీగా ప్రయోజనం కల్పించినందున క్విడ్ ప్రోకోలో భాగంగానే కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. హెరిటేజ్ భూముల లావాదేవీలు గోప్యం లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేస్తున్నట్టు చూపిస్తున్న భూముల బాగోతం కూడా బట్టబయలైంది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు లింగమనేని కుటుంబం భూములు అమ్మినట్టు ఎలాంటి లావాదేవీలను చూపించలేదని న్యాయస్థానం పేర్కొంది. రాజధాని ప్రాంతంలో లింగమనేని కుటుంబం నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసిన భూములకు సంబంధించి లావాదేవీలను చంద్రబాబు వెల్లడించలేదని వ్యాఖ్యానించింది. లోకేశ్‌దీ కీలక పాత్రే... క్విడ్ ప్రోకో కింద అమరావతిలో లింగమనేని కుటుంబం భూములను హెరిటేజ్‌కు బదలాయించడంలో నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారన్నది బట్టబయలైంది. లింగమనేని కుటుంబం నుంచి భూములు తీసుకునేందుకు హెరిటేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానించారు. హెరిటేజ్ డైరెక్టర్‌గా లోకేశ్ ఆ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మంత్రిగా ఉంటూ చంద్రబాబుతో కరకట్ట నివాసంలోనే నివసించారు. అంటే లింగమనేని కుటుంబానికి భారీగా ప్రయోజనం కల్పించి క్విడ్ ప్రోకో కింద హెరిటేజ్ భూములు దక్కించుకోవడంలో, కరకట్ట నివాసాన్ని సొంతం చేసుకోవడంలోనూ లోకేశ్ క్రియాశీల పాత్ర పోషించారన్నది స్పష్టమైంది. కథ నడిపిన ఏ–2 నారాయణ అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల ద్వారా నారాయణ కుటుంబం నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనం పొందినట్లు స్పష్టమైంది. మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పుల వ్యవహారాలన్నీ నారాయణకు పూర్తిగా తెలుసని, అంతా ఆయన ఆధ్వర్యంలోనే సాగిందని న్యాయస్థానం వెల్లడించింది. నారాయణ కుటుంబ సభ్యులు, సమీప బంధువులు సీడ్ క్యాపిటల్‌లో భూములు కొనుగోలు చేశారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని తెలిపింది. వారు తన కుటుంబ సభ్యులు, బంధువులు అనే విషయాన్ని నారాయణ గోప్యంగా ఉంచారని వ్యాఖ్యానించడం గమనార్హం. తద్వారా సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో కొనుగోలు చేసిన భూములు సీఆర్డీయేకే భూసమీకరణ కింద ఇచ్చి 75,888 చ.గజాల ప్లాట్లు పొందారని తెలిపింది. ఆ భూములపై కౌలు కింద రూ.1.92కోట్లు కూడా పొందారని పేర్కొంది. అంతా క్విడ్ ప్రోకోనే.. అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పుల ద్వారా చంద్రబాబు, నారాయణ లింగమనేని రమేశ్‌తో క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారనడానికి ప్రాథమిక ఆధారాలున్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసులో క్విడ్‌ప్రోకోకు పాల్పడలేదంటూ లింగమనేని రమేశ్ చేసిన వాదనను తోసిపుచ్చింది. ఈ కేసును కొట్టి వేయాలన్న ఆయన వాదనను తిరస్కరించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు కరకట్ట నివాసం, సీడ్ క్యాపిటల్‌లో నారాయణ కుటుంబ సభ్యులకు కేటాయించిన 75,888 చ.గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేసేందుకు అనుమతినిచ్చింది. -
చంద్రబాబు కరకట్ట నివాసం కేసు.. విచారణ 30కు వాయిదా
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో భూ కుంభకోణాల కేసులో చంద్రబాబు కరకట్ట నివాసాన్ని అటాచ్ చేయాలన్న సీఐడీ పిటిషన్‌పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 30కు వాయిదా వేసింది. ఈ కేసుపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో బుధవారం వాదనలు సందర్భంగా కరకట్ట నివాసానికి సమాన విలువైన ఆస్తిని ష్యూరిటీగా చూపిస్తామని లింగమనేని రమేశ్ తరపు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దానిపై సీఐడీ తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇక ఇదే కేసులో నారాయణ కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాలను అటాచ్ చేయడంపై న్యాయస్థానం కోరిన వివరాలను సీఐడీ న్యాయవాది సమర్పించారు. అనంతరం ఈ కేసును న్యాయమూర్తి ఈ నెల 30కు వాయిదా వేశారు. -
‘కరకట్ట నివాసం జప్తు’ పిటిషన్.. ఇరువైపులా ముగిసిన వాదనలు
సాక్షి, కృష్ణా: కరకట్టపై చంద్రబాబు అక్రమ నివాసాన్ని(లింగమనేని గెస్ట్‌హౌజ్) జప్తునకు అనుమతి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ(శుక్రవారం) వాదనలు కొనసాగాయి. వాస్తవానికి ఇవాళ తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే.. విజయవాడ ఏసీబీ కోర్టులో ఇప్పటికే సీఐడీ వాదనలు పూర్తి కాగా.. తమ వాదనలూ వినాలని లింగమనేని తరపు న్యాయవాది కోరడంతో కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో.. లింగమనేని తరపున అడ్వొకేట్ అశ్వినీ కుమార్ ఇవాళ(జూన్ 2, 2023 శుక్రవారం) వాదనలు వినిపించారు. ఈ పిటిషన్లో సీఐడీ తరపున అడ్వొకేట్ వివేకానంద వాదించారు. ఇరు పక్షాల వాదనలు నేటికి పూర్తి కావడంతో జూన్ 6వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. అదే రోజు ఈ పిటిషన్‌పై తుది తీర్పు వెలువడే అవకాశం ఉంది. కరకట్టపై లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్‌ను చంద్రబాబు అక్రమంగా పొందారనేది ఏపీసీఐడీ ప్రధాన అభియోగం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లలో లింగమనేనికి లబ్ది చేకూర్చి బదులుగా ఆయన ఇంటిని గెస్ట్ హౌస్‌గా పొందారని సీఐడీ చెబుతోంది. ఇదీ చదవండి: చంద్రబాబు అద్దె కొంప కహానీ ఇదీ! -
చంద్రబాబు ‘కరకట్ట నివాసం జప్తు’పై నేడు విచారణ
సాక్షి, విజయవాడ: కరకట్టపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నివాసాన్ని జప్తు చేసేందుకు అనుమతివ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది. విజయవాడ ఏసీబీ కోర్టు ఈ పిటిషన్‌పై వాదనలు విననుంది. చంద్రబాబు ఉంటున్న ఆ నివాసం.. లింగమనేని రమేష్ పేరిట(గెస్ట్హౌజ్గా) ఉంది. అయితే.. దానిని చంద్రబాబు అక్రమంగా పొందారని, దానిని జప్తు చేసేందుకు అనుమతి ఉత్తర్వులు ఇవ్వాలంటూ నాలుగురోజుల క్రితం దరఖాస్తు చేసుకుంది సీఐడీ. దీంతో.. విచారణ తర్వాత తీర్పు ఇవ్వనుంది ఏసీబీ కోర్టు. -
కరకట్ట నివాసం ఎవరిది బాబూ?
(సాక్షి, అమరావతి) : ఇంతకీ కరకట్ట నివాసం ఎవరిది? చంద్రబాబుదా... లేక ప్రభుత్వానిదా? ‘‘ఆ ఇంటికి సంబంధించి అవినీతికి తావెక్కడుంది? ఎందుకంటే ఆ ఇల్లు ప్రభుత్వానిది. లింగమనేని రమేశ్ నుంచి ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా తీసుకున్నాం. ఒకవేళ ఇవ్వకపోయి ఉంటే భూసేకరణ ద్వారా తీసుకుని ఉండేవాళ్లం’’ అని నేరుగా చంద్రబాబే.. సాక్షాత్తూ అసెంబ్లీలో చెప్పారు. ఇక లింగమనేని కూడా... ఆ ఇల్లు పూలింగ్‌లో తాను ప్రభుత్వానికి ఇచ్చేశానని, అక్కడ భారీ భవంతులు కడితే తనకెంతో సంతోషమని కూడా చెప్పారు. వీళ్ల మాటలకు వీడియో సాక్ష్యాలూ ఉన్నాయి. ఇక్కడ అసలు ప్రశ్నేమిటంటే... : ఆ ఇల్లు ప్రభుత్వానిది అయినపుడు ప్రభుత్వ రికార్డుల్లో ఆ సంగతి ఉండాలి కదా? ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయాక కూడా చంద్రబాబు అందులో ఉంటున్నారంటే... అందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి కదా? అసలు ఆ ఇల్లు ప్రభుత్వానిదన్న సంగతి ప్రభుత్వ రికార్డుల్లోనే లేదంటే ఏమనుకోవాలి? వీళ్లంతా కలిసి ఎంతటి దొంగల రాజ్యాన్ని నడిపించారో తెలియటం లేదా? ప్రభుత్వాస్తుల్ని కూడా ప్రయివేటు ఆస్తుల్లా ఎలా మార్చేసుకున్నారో తెలియటం లేదా? చంద్రబాబు చెబుతున్న దాని ప్రకారం అది ప్రభుత్వ ఆస్తే అయినపుడు... : ప్రభుత్వం ఇపుడు ఇన్నర్ రింగ్‌రోడ్ కుంభకోణంలో భాగంగా ఆ ఇంటిని జప్తు చేస్తుంటే ఉలుకెందుకు? అదేదో చంద్రబాబు సొంత ఆస్తిలా ఫీలవుతూ... ‘ఈనాడు’ దుర్మార్గపు రాతలెందుకు? బాబును టార్గెట్ చేస్తున్నారంటూ రామోజీ శోకాలెందుకు? ఇదంతా రాజకీయ కక్ష సాధింపేనంటూ తెలుగుదేశం డ్రామాలెందుకు? ప్రభుత్వ ఆస్తిని ప్రభుత్వం జప్తు చేస్తుంటే వీళ్లంతా ఎందుకింత దుష్ప్రచారానికి తెగిస్తున్నారు? ఇంకెన్నాళ్లు బాబూ ఈ డ్రామాలు? నాడు అసెంబ్లీలో చంద్రబాబు చెప్పిందిదీ.. : ప్రజా వేదిక నాది కాదు. ప్రభుత్వానిది. నేనుంటున్న భవనం నాది కాదు. రమేష్ అనే డెవలపర్‌ది. నేను తాత్కాలికంగా ఉంటున్నాను. నేనొక టెనెంటే (అద్దెకుంటున్న వాడిని). ప్రెస్మీట్లో చంద్రబాబు చెప్పిందిదీ..: గ్యాస్ ఇచ్చామని ప్రతిఫలంగా ఇల్లు ఇచ్చారని ఆరోపించారు. ఇల్లు ఇవ్వడమేంటి? అది గమర్నమెంట్ ఇల్లు. నేనున్నానంటే..అది గవర్నమెంట్ ఇల్లు కాబట్టి ఉన్నాను. నేను మొదటి రోజే చెప్పాను. దిస్ ప్రొపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్. నువ్ ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకుంటాం. ఇస్తే ల్యాండ్ పూలింగ్‌లో తీసుకుంటాం. ఇవ్వకపోతే లాండ్ అక్విజిషన్‌లో తీసుకంటాం. టెంపరరీగా నేను ఉండాలి. కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి కాబట్టి నేను అక్కడ ఉంటున్నా. కట్టకు ఆవతల ఉండే ల్యాండ్ అంతా, కట్టడాలన్నీ పోయి టూరిజం, మిగతావన్నీ వస్తాయి. మాస్టర్ ప్లాన్‌లో కూడా నోటిఫై చేశారు. లింగమనేని రమేష్ విలేకరులతో చెప్పిందిదీ.. : ప్రభుత్వం ఆ భవనాన్ని పూలింగ్‌లో తీసుకుంది. దేశంపై భక్తితో ఇచ్చేశాను. నాకు ఆ భవనంతో ఏ రకమైన సంబంధం లేదు. -
Chandrababu: మలుపు తిప్పిన ముఠా! పవన్ కల్యాణ్‌కూ వాటా
సాక్షి, అమరావతి: అమరావతి ముసుగులో నారా చంద్రబాబునాయుడు సాగించిన భూదందాలో ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ అంశం ఓ అవినీతి అధ్యాయమేనని వెల్లడైంది. అలైన్మెంట్ ప్రతి మెలికలోనూ పచ్చ గ్యాంగ్ అవినీతి గుట్టు రట్టవుతోంది. టీడీపీ హయాంలో సీఆర్డీఏ చైర్మన్‌గా ఉన్న చంద్రబాబు, వైస్ చైర్మన్ పొంగూరు నారాయణ అవినీతి బాగోతాలు విస్తుపోయే రీతిలో ఉన్నాయి. చంద్రబాబు సన్నిహితుడైన లింగమనేని రమేష్ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్ల నుంచి వెంటనే రూ.877.50 కోట్లకు... రాజధాని నిర్మాణం అనంతరం ఏకంగా రూ.2,130 కోట్లకు చేరేలా ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడం ఎల్లో గ్యాంగ్ బరి తెగింపు వ్యవహారాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ అవినీతి పాపంలో చంద్రబాబు తన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్‌కు కూడా పిడికెడు వాటా ఇవ్వడం కొసమెరుపు. అవినీతికి బాటలు వేసిన ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ వెనుక సాగిన గూడుపుఠాణీ దశలవారీగా ఇదిగో ఇలా సాగింది..! అలైన్మెంట్ –1 సీఆర్డీఏ తొలుత రూపొందించింది అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ నిర్ణయించేందుకు టెండర్ల ద్వారా కన్సల్టెన్సీతో నిమిత్తం లేకుండా పని ముగించాలని చంద్రబాబు, నారాయణ నిర్ణయించారు. దీంతో సీఆర్డీఏ అధికారులు 94 కి.మీ. పొడవుతో అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను రూపొందించారు. దీన్ని చూసి చంద్రబాబు, నారాయణ మండిపడ్డారు. ఎందుకంటే దాని ప్రకారం ఇన్నర్‌రింగ్ రోడ్డు పెదపరిమి, నిడమర్రు, చినవడ్లపూడి, పెదవడ్లపూడి మీదుగా వెళ్తుంది. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించాల్సి వస్తుంది. దీంతో తమ భూముల విలువ అమాంతం పెంచుకునేందుకు ఆ అలైన్‌మెంట్‌ను మార్చాలని ఆదేశించారు. అలైన్మెంట్ – 2 చంద్రబాబు ఆదేశాలతో రూపొందించారు గత సర్కారు పెద్దల ఆదేశాలతో సీఆర్డీఏ అధికారులు ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్లో కీలక మార్పులు చేశారు. చంద్రబాబు, లింగమనేని కుటుంబానికి చెందిన వందలాది ఎకరాలున్న తాడికొండ, కంతేరు, కాజా ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటూ ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. దక్షిణానికి జరిపారు. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి కంతేరు, కాజాలో ఉన్న భూములను ఆనుకుని మరీ ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించేలా 97.50 కి.మీ. మేర అలైన్‌మెంట్‌ను రూపొందించారు. ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అలైన్మెంట్–3 కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించింది సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీ ద్వారా రూపొందించిన అమరావతి మాస్టర్‌ప్లాన్‌లోనే ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్ డిజైన్‌ను చంద్రబాబు ప్రభుత్వం ముందుగానే చేర్చింది. అంటే అప్పటికే ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ ఎలా ఉండాలన్నది నిర్ధారణ అయిపోయింది. అనంతరం ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను రూపొందించేందుకు ఎస్టీయూపీ అనే ఓ కన్సల్టెన్సీని నియమించారు. మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే అది ఉండాలని నిర్దేశించారు. అప్పటికే సీఆర్డీఏ ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా తెరపైకి తెచ్చి ఆమోదించారు. తాడికొండ, కంతేరు, కాజాలో హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని భూములను ఆనుకునే అలైన్‌మెంట్‌ను ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ఖరారు చేసింది. అలైన్‌మెంట్‌ను ఆనుకుని భూములు ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను మెలికలు తిప్పడం ద్వారా హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని రమేశ్ కుటుంబానికి చెందిన భూముల విలువ భారీగా పెరిగింది. కంతేరు, కాజాలో లింగమనేని కుటుంబానికి 355 ఎకరాలున్నాయి. మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఆ భూములకు 3 కి.మీ. దూరంగా ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించాలి. అలైన్మెంట్ మార్పుతో ఆ భూములను ఆనుకుని ఉండేలా ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు చేశారు. ఆ ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఆనుకునే హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన 9 ఎకరాలు ఒకచోట, ఒప్పందం చేసుకున్న నాలుగు ఎకరాలు మరో చోట ఉండటం గమనార్హం. అమాంతం పెరిగిన విలువ ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.50 లక్షలు ఉంది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇక ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు తరువాత ఎకరం రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకుపైగా పెరిగింది. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. అంటే 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్ ఫుడ్స్ 9 ఎకరాల విలువ రూ.4.50 కోట్ల నుంచి రూ.22.50 కోట్లకు పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే రూ.54 కోట్లకు చేరుతుందని తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకున్న మరో నాలుగు ఎకరాల విలువ కూడా రూ.24 కోట్లకు చేరుతుంది. అక్కడే పవన్ కల్యాణ్‌కు 2.40 ఎకరాలు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా ఈ ఇన్నర్‌రింగ్ రోడ్డు అవినీతి పాపంలో చంద్రబాబు పిడికెడు వాటా ఇచ్చారు. కాజాకు సమీపంలో ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌కు సమీపంలోనే పవన్‌కల్యాణ్‌కు 2.4 ఎకరాలున్నాయి. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్లు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కల్యాణ్‌కు ఇవ్వడం గమనార్హం. కృష్ణా ఇవతలా అవినీతి మెలికలే అమరావతి పరిధిలో ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ద్వారా చంద్రబాబు, లింగమనేని కుటుంబాల భూముల విలువ అమాంతం పెంచుకోగా కృష్ణానదికి ఇవతల విజయవాడ శివారులో నారాయణ తమ ఆస్తుల విలువ భారీగా పెంచుకున్నారు. సీఆర్డీఏ అధికారులు మొదట రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్‌రింగ్ రోడ్డును గుంటూరు జిల్లాలోని అమరావతి నుంచి కృష్ణా జిల్లాలోని నున్న మీదుగా నిర్మించాల్సి ఉంది. అందుకోసం కృష్ణా నదిపై వంతెన నిర్మిస్తారు. గుంటూరు జిల్లాలోని నూతక్కి – కృష్ణా జిల్లా పెద్దపులిపర్రు మధ్య కృష్ణా నదిపై వంతెన నిర్మించి అక్కడ నుంచి తాడిగడప నుంచి ఎనికేపాడు మీదుగా నున్న వరకు ఇన్నర్‌రింగ్ రోడ్డు కొనసాగుతుంది. అయితే అలా నిర్మిస్తే నారాయణ విద్యా సంస్థల భవనాలను భూసేకరణ కింద తొలగించాల్సి వస్తుంది. ఈ అలైన్‌మెంట్‌పై నారాయణ నాడు సీఆర్డీఏ అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సీఆర్డీఏ సమావేశంలో అధికారులను పరుష పదజాలంతో దూషిస్తూ అలైన్‌మెంట్‌ను మార్చాలని ఆదేశించారు. దాంతో ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కి.మీ. తూర్పు దిశగా మార్చారు. ఆ ప్రకారం గుంటూరు జిల్లాలో రామచంద్రాపురం – కృష్ణా జిల్లా చోడవరం మధ్య వంతెన నిర్మించాలని ప్రతిపాదించారు. అక్కడ నుంచి పెనమలూరు మీదుగా నిడమానూరు నుంచి నున్న వరకు ఇన్నర్‌రింగ్ రోడ్డును నిర్మిస్తారు. నారాయణ కుటుంబానికి చెందిన 9 విద్యా సంస్థల భవనాలను ఆనుకుని ఉండేలా ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. తన విద్యా సంస్థల భూముల విలువ అమాంతం పెరిగేలా నారాయణ చక్రం తిప్పారు. అటూ ఇటూ భారీగా కొనుగోలు ఇన్నర్‌రింగ్ రోడ్డును ఎలా నిర్మించనున్నారో ముందుగానే తెలిసిన చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్ తన సంస్థల పేరిట భారీగా భూములు కొన్నారు. అవన్నీ ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్డుకు అటూ ఇటూ ఉండటం గమనార్హం. సీఐడీ అధికారులు మంగళగిరి, పెదకాకాని, తాడికొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లను పరిశీలించగా ఈ విషయం స్పష్టమైంది. -
అమరావతి ల్యాండ్ స్కాంలో స్పీడ్ గా సీఐడీ విచారణ
-
చంద్రబాబు బినామీగా ఆస్తులు కూడబెట్టిన లింగమనేని రమేష్
-
చైతన్య గ్రూప్ కాలేజీస్ ఛైర్మన్ సంచలన ఆరోపణలు
-
లింగమనేని రమేష్ మోసం చేశారు: చైతన్య గ్రూప్ ఛైర్మన్ ఆరోపణలు ఇవే..
సాక్షి, అమరావతి: చైతన్య గ్రూప్ ఆఫ్ కాలేజీస్ ఛైర్మన్ బీఎస్ రావు సంచలన ఆరోపణలు చేశారు. పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చైతన్య విద్యా సంస్థల విస్తరణకు డబ్బు తీసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు లింగమనేని రమేష్. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరకట్టపై ఉన్న తన ఇంటిని చంద్రబాబుకు అప్పగించాడు లింగమనేని రమేష్. కాగా, బీఎస్ రావు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. లింగమనేని రమేష్‌కు 2012-13లో రూ.310 కోట్లు ఇచ్చాం. చైతన్య విద్యా సంస్థల విస్తరణకు డబ్బు తీసుకున్నారు. లింగమనేని కావాలనే మమ్మల్ని మోసం చేశాడు. రమేష్ ఇచ్చిన 10 చెక్కులు చెల్లలేదు. లింగమనేని మోసాలపై హైదరాబాద్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాం. ఆయన మోసాలపై ఆరు ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. తీసుకున్న డబ్బుకు మాకు న్యాయం చేస్తానని పెద్దల సమక్షంలో హామీ ఇచ్చారు. 2016లో ఎంవోయూ రాసి భూములు ఇప్పిస్తా అని హామీ ఇచ్చారు. కానీ, పైసా కూడా ఇవ్వలేదని అన్నారు. లింగమనేని చేసిన మోసాలపై ఇప్పటివరకు 6 FIR లు ఫైల్ అయ్యాయని తెలిపారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు వేయగా.. లింగమనేని చేసిన మోసాలపై నెలవారీగా తనకు వడ్డీతో సహా చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని బీఎస్ రావు తెలిపారు. -
నారాయణ, లింగమనేని పిటిషన్లపై విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో సాగిన భూ దోపిడీపై సీఐడీ నమోదుచేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ కేపీవీ అంజనీకుమార్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ఈ నెల 26కి వాయిదాపడింది. ఈ వ్యవహారంలో పూర్తివివరాలను కోర్టు ముందుంచాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు న్యాయమూర్తి జ స్టిస్ కుంభజడల మన్మధరావు గురువారం ఉత్త ర్వులు జారీచేశారు. సీఐడీ నమోదుచేసిన కేసులో త మను అరెస్ట్ చేస్తే బెయిల్‌పై విడుదల చేసేలా సీఐడీ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను ఆదేశించాలని కోరుతూ నారాయణ తదితరులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
మైనార్టీల భూములపైనా లింగమనేని పంజా
మంగళగిరి: రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఐజేఎం సంస్థ పేరుతో ప్రాచుర్యం పొందిన లింగమనేని రమేష్ చివరకు మైనార్టీల భూములనూ వదల్లేదు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ, చినకాకాని, నిడమర్రు గ్రామాల్లో ఐజేఎం లింగమనేని రియల్ ఎస్టేట్ పేరుతో అపార్ట్మెంట్లు, విల్లాలతో పాటు సుమారు 1,200 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. వాటిలో వందలాది ఎకరాల ప్రైవేటు భూములతో పాటు ప్రభుత్వ పోరంబోకు భూములు కూడా ఉన్నట్టు ఆరోపణలున్నాయి. తాజాగా పీర్ల మాన్యం భూములను లింగమనేని రమేష్ సతీమణి సుమన పేరిట ఉండటాన్ని గుర్తించిన అధికారులు నోటీసులు జారీ చేశారు. కాజ గ్రామంలో రైల్వే గేటుకు అవతల, ఇవతల పీర్ల మాన్యం పేరుతో ఇనాం భూములు 11.25 ఎకరాలు ఉన్నాయి. పూర్వం దాతలు పీర్ల మాన్యం కింద అందజేసిన భూములను కౌలుకు ఇచ్చి.. వాటిపై వచ్చే ఆదాయంతో ముస్లింలు పీర్ల పండుగలను జరుపుకుంటారు. గ్రామంలో సర్వే నంబర్ 287/5లోని 2.06 ఎకరాలు లింగమనేని సుమన పేరున ఉన్నాయి. 287/1ఏ2, 287/1ఏ2ఏ, 287/1ఏ2బీ, 287/1ఏ2సీ, 287/1ఏ2డీ, 287/1బీ సర్వే నంబర్లలో మరో 9.19 పీర్ల మాన్యం భూములు ఉన్నాయి. అవన్నీ శ్యామల మల్లికార్జునరెడ్డి, సింహాద్రి నాగేశ్వరమ్మ, సింహాద్రి ప్రసాద్‌రెడ్డి, మెట్టు వెంకట కాశీ విశ్వనాథం, శ్యామల విజయలక్ష్మి, శ్యామల శ్రీనివాస్‌రెడ్డి, సింహాద్రి సామ్రాజ్యం, సింహాద్రి ప్రసాద్‌రెడ్డి, సింహాద్రి వెంకటరామారెడ్డి ఆ«దీనంలోకి మళ్లాయి. సదరు భూములను పీర్ల మాన్యం కౌలుకు మాత్రమే ఇచ్చి అనుభవించాల్సి ఉండగా భూములకు పట్టాలు, పాస్ పుస్తకాలు పుట్టించి విక్రయాలు జరిపారు. దానికి అప్పటి పీర్ల మేనేజర్ లావాదేవీలు నిర్వహించడం విశేషం. ఎకరం రూ.3 కోట్లకు పైగా పలుకుతోంది. 2013 రెవెన్యూ చట్టం ప్రకారం భూములకు పట్టాలు ఉన్నా, పాస్ పుస్తకాలు ఉన్నా చెల్లవని, తిరిగి వక్ఫ్ బోర్డు స్వాదీనం చేసుకోవచ్చని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై తహసీల్దార్ జీవీ రాంప్రసాద్ వివరణ కోరగా.. ఆర్ఎస్ఆర్ ప్రకారం పీర్ల మాన్యం భూములు 11 ఎకరాలను గుర్తించి ఆ భూముల్లో ఉన్న యజమానులకు నోటీసులు జారీ చేశామని తెలిపారు. నోటీసులు అందుకున్న వారు తమకు అనుకూలంగా కోర్టు తీర్పు ఉందని చెబుతున్నారన్నారు. కోర్టు తీర్పు ఉన్నా చట్ట ప్రకారం పీర్ల మాన్యం భూములు (ఇనాం భూములు) వక్ఫ్ బోర్డుకు చెందుతాయన్నారు. నోటీసులు జారీ చేసి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని, విచారణ అనంతరం నిర్ణయం తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. -
లింగమనేని ఎస్టేట్స్ కార్యాలయంలో ఐటి సోదాలు
-
‘లింగమనేని’పై ఐటీ దాడులు
సాక్షి, అమరావతి: చంద్రబాబు బినామీగా భావిస్తున్న లింగమనేని రమేష్‌కు చెందిన ఎల్ఈపీఎల్ గ్రూపుపై ఢిల్లీ నుంచి వచ్చిన ఆదాయపుపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలోని గాయత్రీనగర్‌లో ఉన్న ఎల్ఈపీఎల్ కార్పొరేట్ ఆఫీసుపై ఐటీ అధికారులు బుధవారం తనిఖీలు జరిపారు. కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మాజీ సీఎం చంద్రబాబు కృష్ణానది తీరాన ఉన్న లింగమనేని గెస్ట్‌హౌస్‌లోనే నివాసం ఉండటంతోపాటు అమరావతి రాజధాని ల్యాండ్‌పూలింగ్‌ను లింగమనేని స్థలాల సరిహద్దు వరకు తీసుకొచ్చి ఆపేసిన సంగతి తెలిసిందే. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన సచివాలయ ఉద్యోగులకు ఎల్‌ఈపీఎల్‌కు చెందిన రెయిన్‌ట్రీ అపార్ట్‌మెంట్స్‌ను కేటాయించడం ద్వారా ఏటా కోట్ల రూపాయల్లో అద్దెలను చెల్లిస్తున్నారు. అంతేగాక జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తోనూ లింగమనేనికి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. విజయవాడ గాయత్రీ నగర్‌లోని ఎల్ఈపీఎల్ కార్యాలయంలో జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడంతోపాటు ఆ పార్టీకి గుంటూరు జిల్లా కాజ వద్ద జాతీయరహదారికి ఆనుకొని ఉన్న అత్యంత విలువైన రెండెకరాల భూమిని కారుచౌకగా ఇచ్చిన విషయమూ తెలిసిందే. ఇలా ఇరు పార్టీలకు అత్యంత సన్నిహితంగా ఉన్న లింగమనేని గ్రూపుపై ఇప్పుడు ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తుండటంతో రెండు పార్టీల నేతల్లో ఆందోళన మొదలైంది. శ్రీచైతన్య గ్రూపు కార్యాలయాల్లో ఐటీ సోదాలు.. కార్పొరేట్ విద్యాసంస్థ శ్రీచైతన్య గ్రూపు కార్యాలయాలపై ఇన్‌కమ్‌ట్యాక్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్‌లో ఉన్న కార్యాలయంతోపాటు విజయవాడ బెంజ్ సర్కిల్లో ఉన్న కార్పొరేట్ కార్యాలయంలోనూ ఈ సోదాలు జరుగుతున్నాయి. రికార్డులను స్వాధీనం చేసుకుని కాలేజీ డైరెక్టర్లు, మేనేజర్లను విచారిస్తున్నారు. ఐటీ తనిఖీలపై ఇటు కాలేజీ యాజమాన్యం కానీ, అటు ఐటీ అధికారులు కానీ స్పందించట్లేదు. -
లింగమనేని కార్యాలయంలో ఐటీ సోదాలు
సాక్షి, విజయవాడ : నగరంలోని లింగమనేని వెంచర్స్ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. బుధవారం లింగమనేని వెంచర్స్ ఆఫీసులో తనిఖీలు చేపట్టిన అధికారులు కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కార్యాలయ సిబ్బందిని విచారిస్తున్నారు. కాగా, రాజధాని భూముల వ్యవహారంలో లింగమనేని వెంచర్స్ యజమాని రమేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. -
దివాలా వార్తలపై క్లారిటీ ఇచ్చిన లింగమనేని
సాక్షి, హైదరాబాద్: ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ దివాలా తీసినట్టు వచ్చిన కథనాలపై ఆ కంపెనీ అధినేత లింగమనేని రమేశ్ క్లారిటీ ఇచ్చారు. లింగమనేని ప్రాజెక్ట్స్ దివాలా తీసినట్టు ప్రకటించాలని తాము కోరలేదని తెలిపారు. జర్మనీకి చెందిన ఓ సంస్థతో ఎయిర్ కోస్తా ఒప్పందంలో కొన్ని సమస్యలొచ్చాయని, వాటిని పరిష్కరించుకునేలోపే సదరు సంస్థ.. జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ దాఖలు చేసిందని లింగమనేని రమేశ్ చెప్పుకొచ్చారు. జర్మన్ సంస్థ పిటిషన్ ఆధారంగా కంపెనీ లా ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ వ్యవహారంతో ఎల్ఈపీఎల్లోని ఇతర కంపెనీలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తమ ఆర్ధిక పరిస్థితులు బాగాలేవంటూ వచ్చిన కథనాలను తోసిపుచ్చిన ఆయన.. ఆర్థికంగా తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పుకొచ్చారు. గతంలో తమ రుణదాతలకు చెల్లింపులు చేయలేని పరిస్ధితి ఎప్పుడూ లేదని అన్నారు. 1996లో విజయవాడలో రిజిస్టరైన లింగమనేని రమేశ్‌కు చెందిన ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ దివాలా తీసినట్టు ఈ నెల 14న కంపెనీ లా ట్రిబ్యునల్ ముందు పిటిషన్ దాఖలైంది. తీసుకున్న రుణాలు చెల్లించలేనంటూ లింగమనేని కంపెనీ చేతులెత్తేయడంతో రుణాలు ఇచ్చిన కంపెనీలకు ఈ నెల 29 వరకు ఎన్సీఎల్టీ అనుమతి ఇచ్చినట్టు కథనాలు వచ్చాయి. లింగమనేనికి చెందిన ఎల్ఈపీఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ దివాలాకు సంబంధించి దినపత్రికల్లో ప్రచురితమైన బహిరంగ ప్రకటన ఇది -
అది ముమ్మాటికీ అక్రమ కట్టడమే : ఆర్కే
సాక్షి, అమరావతి: చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని అతిథి గృహం ముమ్మాటికీ అక్రమ నిర్మాణమేనని, చంద్రబాబు, లింగమనేని రమేశ్‌కు దమ్ముంటే ఈ అంశంపై చర్చకు రావాలని వైఎస్సార్సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సవాల్ విసిరారు. అది అక్రమ కట్టడమని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆర్కే మాట్లాడారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు, అప్రతిష్ట పాలు చేసేందుకు లింగమనేనిపై ఒత్తిడి తెచ్చి ఆయనతో చంద్రబాబు సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాయించారన్నారు. గతంలో హైకోర్టు నోటీసులు ఇచ్చినా స్పందించని లింగమనేని ముఖ్యమంత్రికి లేఖ ఎలా రాశారని ప్రశ్నించారు. దేవినేని ఉమా 2014లో కృష్ణా నదిలో తిరిగి మరీ నదీ గర్భంలోని నిర్మాణాలన్నీ అక్రమ కట్టడాలని చెప్పలేదా? అని నిలదీశారు. తాడేపల్లి తహసీల్దార్ లింగమనేనికి నోటీసులు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. 271 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి–కృష్ణా నది అని అడంగల్‌లో ఉందని, అలాగే 271–1బి ప్రభుత్వ భూమి డొంక అని రికార్డుల్లో ఉందని వివరించారు. ఇలాంటి ప్రభుత్వ భూమిలో నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరానని లింగమనేని చెప్పడం ఏమిటన్నారు. ఇటీవల సీఆర్డీఏకి రాసిన లేఖలో తనవి 254, 250 సర్వే నెంబర్లు అని ఆయన పేర్కొన్నారని, వాస్తవానికి అవి లింగమనేనివి కానే కావన్నారు. ఆయన ఎక్కడా అనుమతులు తీసుకోలేదని.. తాను గ్రామ పంచాయతీ రికార్డులన్నింటినీ చూసి చెబుతున్నానని, పంచాయతీ అనుమతులుంటే తీసుకు రావాలని కోరారు. ఈతకొలను నిర్మాణానికి మాత్రమే అనుమతి తీసుకుని ఏకంగా ఇల్లే కట్టారన్నారు. ఉడా అనుమతి ప్రకారం పట్టా భూమిలో నిర్మాణం చేయాల్సి ఉండగా ఏకంగా ప్రభుత్వ భూమిలోనే కట్టేశారన్నారు. ఇంటి అద్దె కింద రూ.1.2 కోట్లు తీసుకున్నారు చంద్రబాబు, లోకేశ్ ఇద్దరూ ఇంటి అద్దె కింద శాసనసభ, శాసనమండలి నుంచి రూ.1.2 కోట్లు తీసుకున్నారని.. నిజంగా వారు ఇంటి అద్దె చెల్లించారా? చెల్లించి ఉంటే దాన్ని ఆదాయపు పన్ను చెల్లింపులో చూపించారా? అని ఎమ్మెల్యే ఆర్కే అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ లింగమనేని తన అతిథి గృహాన్ని ఉచితంగా ఇచ్చి ఉంటే మరి వారు ఇంటి అద్దెను ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. లింగమనేని ఎలాంటి ప్రతిఫలం లేకుండానే అతిథి గృహాన్ని చంద్రబాబుకు ఇచ్చారా? అని నిలదీశారు. రాజధాని ల్యాండ్‌పూలింగ్‌ను లింగమనేని భూముల వద్దకు వచ్చేటప్పటికే ఎందుకు ఆపేశారో చెప్పాలన్నారు. తానున్న అతిథి గృహం ప్రభుత్వ ఆస్తి అని గతంలో చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారని.. ఇప్పుడు మాత్రం మాట మార్చి అద్దెకు ఉంటున్నానని చెబుతున్నారని మండిపడ్డారు. లింగమనేని కూడా ఆ అతిథిగృహం తనది కాదని.. ఎప్పుడో ప్రభుత్వానికి ఇచ్చేశానని చెప్పారని, ఇప్పుడేమో తనదేనని ప్రభుత్వానికి లేఖ రాశారని ధ్వజమెత్తారు. అనుమతులు లేకుండా నిర్మించారని ఆధారాలతో సహా ఉన్నప్పుడు ఐపీసీ 420, 468, 471 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని, మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. -
వెనుక ఆయన ఉన్నారనే లింగమనేని ధీమా
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు.. లింగమనేని రమేష్‌ను ఆడిస్తున్నారని, బాబు ఆడించినట్టు లింగమనేని ఆడుతున్నారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు, లింగమనేని కలిసే కుట్ర పన్నుతున్నారని అన్నారు. లింగమనేని గెస్ట్‌హౌస్‌కు సంబంధించిన విషయమై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి లింగమనేని రమేష్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రికి లింగమనేని లేఖ రాయటంపై ఎమ్మెల్యే ఆర్కే మంగళవారం స్పందించారు. ఈ విషయంపై బుధవారం మరోసారి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ లింగమనేని ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండానే బాబుకు ఇల్లు ఇచ్చారా? లింగమనేనికి అధికారులు నోటీసులు ఇవ్వలేదా? నోటీసులకు లింగమనేని రమేష్ ఎందుకు స్పందించలేదు. మీ దగ్గర అనుమతులుంటే పేపర్లు చూపండి. ఇంటి ప్లాన్ ఏది, బిల్డింగ్ ఫీజు ఎంత కట్టారు? బిల్డింగ్ నిర్మాణానికి పైసా ఫీజు కట్టలేదు, అనుమతులు రాలేదు. సర్వేనెంబర్ 271,272 ప్రభుత్వ డొంక భూమి అని రికార్డులో ఉంది. ఆ ప్రాంతంలో అనుమతిచ్చే అధికారం ఉండవల్లి పంచాయితీకి లేదు. ఉడా నుంచి కేవలం స్విమ్మింగ్ పూల్ కోసమే అనుమతి తీసుకున్నారు. ప్రహారీ గోడకూడా కట్టరాదని నిబంధన ఉంటే లింగమనేని ఏకంగా ఇళ్లే కట్టేశారు. కరకట్ట మీద అక్రమ నిర్మాణాలు కట్టడం అవాస్తవమా? తనవెనుక చంద్రబాబు ఉన్నారని లింగమనేని ధీమా. ఇంటి అద్దె పేరుతో చంద్రబాబు, లోకేష్ ప్రభుత్వ సొమ్ము రూ. 1.20 కోట్లు తిన్నారు. మంగళగిరి ఖాజాగ్రామంలో 4,5ఎకరాలు కాజేశార’’ని ఆరోపించారు. -
చట్టప్రకారమే అక్రమ కట్టడాలపై చర్యలు : బొత్స
సాక్షి, అమరావతి : కృష్ణానదిలో అక్రమ కట్టడాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. నదీ పరీవాహక చట్టాలకు విరుద్ధంగా కరకట్ట లోపల ఉన్న అక్రమ కట్టడాలను తొలగించే ప్రక్రియను ప్రారంభించామన్నారు. విజయవాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్ట వ్యతిరేకమైన నిర్మాణాలకు గతంలోనే సీఆర్డీఏ నోటీసులు జారీ చేసిందని చెప్పారు. చట్టపరంగా, కోర్టు సూచనలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అందులో భాగంగానే పాతూరు కోటేశ్వరరావుకు చెందిన అక్రమ కాంక్రీట్ నిర్మాణాన్ని సీఆర్డీఏ అధికారులు తొలగించారని, దీన్ని రాజకీయం చేస్తూ చంద్రబాబు నివాసం కూల్చేస్తున్నారని ఎల్లో మీడియా ద్వారా టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాగా, చంద్రబాబు ఉంటున్న నివాసం కూడా అక్రమమేనని దాని యజమాని లింగమనేనితోపాటు పలు అక్రమ కట్టడాల యజమానులకు నోటీసులు జారీ చేశారని, వాటిని కూడా త్వరలో తొలగించాల్సి వుందన్నారు. -
అక్రమ నిర్మాణాలకు తుది నోటీసులు
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేశ్ అతిథి గృహం సహా కృష్ణా నది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన 3 భవనాలకు సీఆర్డీఏ తుది నోటీసులు జారీ చేసింది. నదీ పరిరక్షణ చట్టం, బిల్డింగ్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపారని వీటి యజమానులకు గతంలోనే నోటీసులిచ్చి వివరణ కోరిన విషయం తెలిసిందే. దానికి వారిచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో శుక్రవారం లింగమనేని రమేశ్, పాతూరి నాగభూషణం, ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ భవనాలకు తుది నోటీసులిచ్చారు. నిర్మాణాలకు అనుమతులు లేవని, సరైన అనుమతులు చూపించడంలో విఫలమయ్యారని పేర్కొంటూ వారంలో ఆ నిర్మాణాలను తొలగించాలని, లేకపోతే తామే తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. కరకట్ట లోపల అక్రమంగా నిర్మించినట్లు గుర్తించిన 26 కట్టడాలకు సీఆర్డీఏ గతంలోనే నోటీసులివ్వగా అందరూ వివరణ ఇచ్చారు. తమ వద్ద ఉన్న అనుమతి పత్రాలు, ఇతర పత్రాలను అధికారులకు చూపించారు. సీఆర్డీఏ కమిషనర్ స్వయంగా వారితో మాట్లాడి అభ్యంతరాలను తెలుసుకున్నారు. చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం యజమాని లింగమనేని రమేశ్ కూడా సీఆర్డీఏకు వివరణ ఇచ్చారు. తనకు పంచాయతీ అనుమతి ఉందని చెప్పిన ఆయన తాను భవనం నిర్మించినప్పుడు సీఆర్డీఏ లేదని, కాబట్టి సీఆర్డీఏకు నోటీసులిచ్చే అధికారం లేదన్నారు. గోకరాజు గంగరాజు, చందన బ్రదర్స్ యజమానులు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు సీఆర్డీఏకు పలు సూచనలు చేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, వారి వద్దనున్న పత్రాలను కూడా పరిశీలించిన తర్వాత ఈ భవనాలు అక్రమమేనని తేల్చిన సీఆర్డీఏ చంద్రబాబు నివాసం సహా మూడు భవనాలకు తుది నోటీసులు జారీ చేసింది. మిగిలిన అక్రమ నిర్మాణాలకు సోమవారం నుంచి నోటీసులు జారీ చేయనున్నారు. -
ఇంతకీ ఆ ఇల్లు ఎవరిది చంద్రబాబు?
సాక్షి, విజయవాడ : సీఆర్డీఏ నోటీసులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా స్పందించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిపై లింగమనేని రమేశ్ గతంలో చేసిన వ్యాఖ్యలను సరిచూసుకోవాలన్నారు. ఆదివారం విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఉంటున్న ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చేసినట్టు గతంలో లింగమనేని చెప్పారని అన్నారు. కానీ లింగమనేని ఇప్పుడు మాటమార్చి.. ఆ ఇంటికి అన్ని అనుమతులు ఉన్నాయని చెబుతున్నారని విమర్శించారు. కొత్తగా ఆ ఇళ్లు తనదేనని లింగమనేని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. తాను నివాసం ఉంటున్న ఇళ్లు ప్రభుత్వానిదేనని చంద్రబాబు 2016 మార్చి 6వ తేదీన శాసనసభలో వెల్లడించిన విషయాన్ని గుర్తుచేశారు. సీఎం పదవి పోయాక ప్రభుత్వ ఇళ్లు ఖాళీ చేయాలనే కనీస జ్ఞానం కూడా చంద్రబాబుకు లేకుండా పోయిందని మండిపడ్డారు. చంద్రబాబు లింగమనేనిని భయపెట్టి రకరకాలుగా మాట్లాడిస్తున్నారని ఆరోపించారు. నైతిక బాధ్యతగా చంద్రబాబు తాను ఉంటున్న ఇంటిని తక్షణమే ఖాళీ చేయాలన్నారు. చంద్రబాబు ఖాళీ చేయని పక్షంలో ఆ అక్రమ నిర్మాణాన్ని కూలగొట్టాలని సీఆర్డీఏ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. కరకట్ట మీద అక్రమ నిర్మాణాలను వదిలేది లేదని స్పష్టం చేశారు. కరకట్టపై నిర్మాణాలకు అధికారులు అక్రమంగా అనుమతులు ఇచ్చి ఉంటే వారు కూడా శిక్షర్హులేనని చెప్పారు. చంద్రబాబు తన అనుకూల మీడియాతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. డబ్బుతో ప్రలోభ పెట్టిన చంద్రబాబు తనయుడు లోకేశ్ ఎన్నికల్లో గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. -
లింగమనేని రమేష్‌ను ఎవరు బెదిరించారు?