
సాక్షి, అమరావతి: అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్ డిజైన్ల ముసుగులో సాగిన భూ దోపిడీపై సీఐడీ నమోదుచేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ మాజీ మంత్రి పొంగూరు నారాయణ, వ్యాపారవేత్త లింగమనేని రమేశ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ కేపీవీ అంజనీకుమార్ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ఈ నెల 26కి వాయిదాపడింది.
ఈ వ్యవహారంలో పూర్తివివరాలను కోర్టు ముందుంచాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. ఈమేరకు న్యాయమూర్తి జ స్టిస్ కుంభజడల మన్మధరావు గురువారం ఉత్త ర్వులు జారీచేశారు. సీఐడీ నమోదుచేసిన కేసులో త మను అరెస్ట్ చేస్తే బెయిల్‌పై విడుదల చేసేలా సీఐడీ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను ఆదేశించాలని కోరుతూ నారాయణ తదితరులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment