విజయవాడ : హుదూద్ ధాటికి విలవిలలాడిన ఉత్తరాంధ్రా జిల్లాలు, విశాఖ నగరాన్ని ఆదుకోవడం అందరి తక్షణ కర్తవ్యమని, అందాల విశాఖ కకావికలమైన తీరు ప్రతి వారి గుండెను కలిచివేస్తోందని ఆంధ్రా చాంబర్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చాంబర్ కార్యదర్శి సీహెచ్.ఆర్.కె.ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పి.భాస్కరరావు ఒక ప్రకటన విడుదల చేస్తూ నాలుగు జిల్లాల ప్రజల కష్టాలను పూర్తిగా తీర్చిలేక పోయినా, కనీసం కన్నీళ్లు తుడిచేందుకు చాంబర్ కృషి చేస్తుందని పేర్కొన్నారు. తమవంతు బాధ్యగా తుపాను బాధితులకు చాంబరు సభ్యులు, అఫ్లియేట్ సంఘాల నుంచి రూ. 2కోట్ల వరకూ వసూలు చేసి సీఎం సహాయ నిధికి అందిచినట్లు వివరించారు.
ఎవరెవరు ఇచ్చారంటే..
విరాళాలు ఇచ్చిన వారిలో ఎయిర్‌కోస్తా అధినేత లింగమనేని రమేష్ రూ.25 లక్షలు, పెట్రోల్ డీలర్స్ సంఘం తరఫున ఎం.నారాయణప్రసాద్ రూ.10 లక్షలు, హైదరాబాద్ ఫోనిక్స్ సంస్థ తరపున చుక్కపల్లి సురేష్ రూ.10 లక్షలు, ఆంధ్రా చాంబరు కార్యదర్శి చుక్కపల్లి ప్రసాద్ కుశలవ సంస్థల తరఫున రూ.5 లక్షలు, ఇన్‌కాప్ అధినేత సి.భగవంతరావు రూ.6.5 లక్షలు, (దీనిలో రూ.6లక్షలు విలువగల పవర్ ఇన్సులేటర్స్), ఎగ్జిబిషన్ సొసైటీ తరఫున జి.వి.రామారావు, వి.రాఘవప్రసాద్ రూ.7.5 లక్షలు, కేసీపీ సంస్థల తరఫున రూ.10 లక్షలు ఇవ్వగా, కేసీపీ షుగర్ మిల్స్ తరఫున కోటి విరాళం సేకరించనున్నారు.
ఏపీ స్పిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ తరఫున జి.పున్నయ్యచౌదరి రూ.50 లక్షలు, కృష్ణాజిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున రూ.10 లక్షలు, నవత సంస్థ తరఫున పి.వి.కోటేశ్వరరావు రూ.5 లక్షలు, ఫ్లైవుడ్ డీలర్స్ అసోసియేషన్ రూ.5 లక్షలు, పాపులర్ షూమార్ట్స్ తరఫున చుక్కపల్లి అరుణ్‌కుమార్ రూ.10 లక్షలు, కళానికేతన్ తరఫున వి.నాగభూషణం రూ.30 వేలు, లయనర్స్ సంస్థల తరఫున రూ.లక్ష విరాళం అందజేశారు.
రేవేళ్ల సతీష్ రూ.1.5 లక్షలు, శేషసాయి నిట్టింగ్స్ సంస్థ తరపున టి.చంద్రశేఖరరావు రూ.లక్ష , ప్రకాశ ఇంజినీరింగ్ వర్క్స్ అధినేత టి.జె.జి.ప్రసాద్ రూ.లక్ష, రామ్‌కోర్ అధినేత కె.వి.ఎస్.ప్రకాశరావు రూ.50వేలు, సేఫ్ ఎన్విరాన్‌మెంట్స్ అధినేత వెలగపూడి వెంకటేశ్వరరావు రూ.50 వేలు, వి.కృశ్ఛేవ్ రూ.10వేలు, అమ్మ అసోసియేషన్ తరఫున రూ.5 లక్షలు, కొండపల్లి ఇండస్ట్రీస్ తరఫున రూ.5 లక్షలు అందజేశారు.
టింబరు మర్చంట్స్ తరఫున చలసాని సుబ్బారావు రూ.50 వేలు, పొట్లూరి భాస్కరరావు రూ.10వేలు, టైమ్ హాస్పటల్ ఎండీ మైనేని హేమంత్ రూ.3 లక్షల విలువైన నిత్యావసరాలు అందించారు. ఈ విరాళాలతో పాటు, ఆంధ్రా చాంబర్ తరఫున 16 టన్నుల సామగ్రి, రెండు ట్రక్కుల పాలు, మంచినీరు, ఆహార పదార్థాలు, రొట్టెలు, బిస్కెట్లు, బియ్యం, కొవ్వొత్తులు గురువారం పంపించినట్లు వారు తెలిపారు. ఈ విరాళాల సేకరణ, ఆహార పదార్థాల సరఫరా మరింత కాలం చేపట్టనున్నట్లు ప్రసాద్, భాస్కరరావు వివరించారు.
ప్రాఫిట్‌షూ కంపెనీ విరాళం
గాంధీనగర్ : హుదూద్ బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రాఫిట్ షూ కంపెనీ యాజమాన్యం, సిబ్బంది రూ.3.10 లక్షలు విరాళం ప్రకటించారు. హనుమాన్‌పేటలోని ప్రాఫిట్ షూకంపెనీ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు ఎండీ బోడేపూడి శివ కోటేశ్వరరావు విరాళం చెక్కును అందజేశారు. కంపెనీ రూ. 2లక్షలు, మరో లక్షా పదివేల రూపాయలను సిబ్బంది నుంచి విరాళంగా సేకరించినట్లు ఎండీ తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ముప్పా వెంకటేశ్వరరావు, కంపెనీ డెరైక్టర్ బి.తేజ, కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రా చాంబర్ విరాళం రూ.2కోట్లు
Published Fri, Oct 17 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM
Advertisement
Advertisement