
సాక్షి, విజయవాడ : నగరంలోని లింగమనేని వెంచర్స్ కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. బుధవారం లింగమనేని వెంచర్స్ ఆఫీసులో తనిఖీలు చేపట్టిన అధికారులు కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కార్యాలయ సిబ్బందిని విచారిస్తున్నారు. కాగా, రాజధాని భూముల వ్యవహారంలో లింగమనేని వెంచర్స్ యజమాని రమేష్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.