కృష్ణా(తోటవల్లూరు): కృష్ణా జిల్లా తోటవల్లూరు కరకట్టపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఆదివారం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, పది మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. రెండు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. క్షతగాత్రులను అంబులెన్స్‌లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.