సాక్షి, విజయవాడ: కరకట్ట నివాసాన్ని సీఎం చంద్రబాబు అధికార నివాసంగా ప్రభుత్వం ప్రకటించింది. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు గృహాన్ని సీఎం అధికారిక నివాసంగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జూన్ 12 నుంచి సీఎం అధికారిక నివాసంగా గుర్తిస్తూ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇదే కరకట్ట నివాసంపై అనేక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇది అక్రమ నిర్మాణం అంటూ గతంలో మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రకటించారు. అదే అక్రమ నివాసాన్ని అధికారిక నివాసంగా ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణ నది కరకట్ట లోపల ఈ నివాసాన్ని లింగమనేని రమేష్ నుంచి చంద్రబాబు తీసుకున్నారు.
ఇదీ చదవండి: కూటమి సర్కార్ ‘రాజకీయ’ కక్ష.. మహిళను అవమానించేలా..
కాగా, చంద్రబాబు ఉంటున్న కరకట్ట నివాసాన్ని నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానది భూముల్లో నిర్మించారనే ఆరోపణలున్నాయి. లింగమనేని రమేశ్ ఆ ఇంటికి టైటిల్‌దారుగా ఉన్నప్పటికీ చంద్రబాబు ఆ నివాసంలో గత కొన్నేళ్లుగా నివసిస్తున్నారు. ప్రతిపక్ష నేత హోదాలోనూ, సీఎం హోదాలోనూ అదే నివాసంలో చంద్రబాబు నివసిస్తున్నారు.
ఆ నివాసాన్ని లింగమనేని రమేశ్.. చంద్రబాబుకు వ్యక్తిగతంగానే ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజధాని మాస్టర్‌ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లలో కుంభకోణం ద్వారా భారీగా ప్రయోజనం కల్పించినందున క్విడ్ ప్రోకోలో భాగంగానే కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు ఇచ్చేరనే విమర్శలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment