చంద్రబాబు నివాసానికి నోటీసులు | Flood Warning Notices To Chandrababu House At Krishna Karakatta | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నివాసానికి వరద నోటీసులు

Published Tue, Oct 13 2020 4:26 PM | Last Updated on Tue, Oct 13 2020 4:57 PM

Flood Warning Notices To Illegal Buildings At Krishna Karakatta - Sakshi

సాక్షి, విజయవాడ: భారీ వర్షాలు, వరదలతో విజయవాడలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహంఉండగా.. అది 6 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణా నది కరకట్ట లోపలవైపు ఉన్న 36 అక్రమ కట్టడాలకు  వరద ప్రమాద హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. కరకట్ట లోపలవైపు ఉన్న భవనాలు ఖాళీ చేసి.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కరకట్ట లోపల ఉన్న చంద్రబాబు నివాసానికి కూడా అధికారులు నోటీసులు అందజేశారు. ఏ క్షణాన్నయినా ఇళ్లల్లోకి నీరు రావొచ్చని అధికారులు అలర్ట్‌ చేశారు.
(చదవండి: వాగులో కొట్టుకుపోయిన యువకుడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement