
సాక్షి, తాడేపల్లి : ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడి రాష్ట్ర మహిళా మంత్రులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాలు.. దొండపాడుకు చెందిన నరసింహారావు గురువారం కరకట్ట రోడ్డుపై వెళుతున్న సమయంలో ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నరసింహారావుకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న హోంమంత్రి సుచరిత కరకట్టపై గాయాలతో పడిఉన్న నరసింహారావును చూశారు. వెంటనే వాహనాన్ని ఆపి మరో మంత్రి తానేటి వనితతో కలిసి నరసింహారావును తమ కాన్వాయ్‌లో ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం నరసింహారావు పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తక్షణ సహాయం అందించి తన ప్రాణాలను కాపాడినందుకు హోంమంత్రి సుచరిత, మరో మంత్రి తానేటి వనితకు నరసింహారావు కృతజ్ఞతలు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment