
సాక్షి, అమరావతి: అసెంబ్లీ, సచివాలయానికి వెళ్లేందుకు వీలుగా కరకట్ట రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని, అనుకున్న సమయం కంటే ముందే పూర్తిచేయాలని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సీఆర్‌డీఏ అధికారులను అదేశించారు. సచివాలయంలో సోమవారం ఏపీ సీఆర్‌డీఏ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
విభాగాల వారీగా చేస్తున్న పనులను సీఆర్‌డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భవనాల నిర్మాణ ప్రగతిపైనా మంత్రి ఆరా తీశారు. పట్టణాభివృద్ధి విభాగంపై నిర్వహించిన సమీక్షలో టిడ్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు.
మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. 124 యూఎల్‌బీల్లో చెత్త సేకరణ కోసం ఇప్పటివరకు 1.13 కోట్ల మూడు రంగుల డబ్బాలు పంపిణీ చేశామని, మరో 10 లక్షల డబ్బాల పంపిణీ ఈ నెలాఖరుకు పూర్తవుతుందని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment