
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం సమీపంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. కరకట్ట పక్కనే ఉన్న ఎండుగడ్డి తగులబడి పొలాల్లోకి మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంతో చుట్టుపక్కల ప్రాంతం అంతా దట్టమైన పొగ అలుముకుంది. అయితే ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరైనా కావాలనే ఎండుగడ్డిని తగులబెట్టారా? లేక ప్రమాదవశాత్తూ జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment